ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు.  ఈ సుభాషితం వ్యక్తిగత, సామాజిక, జాతీయ కర్తవ్యాలను నెరవేర్చడంలో ఆదర్శప్రాయ, శ్రేష్ఠమైన వ్యక్తి గుణాలను మనకు తెలియజేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘పరకార్యేషు యుక్తాత్మా స్వకార్యే క్షిప్రసాధనమ్
సుహృత్కార్యేషు నివృత్తీ రాజకార్యేషు విక్రమః’’ అని పేర్కొన్నారు. 

ఇతరుల పనులను పూర్తి చేయడంలో అత్యంత నిష్ఠతో నిమగ్నమయ్యే వ్యక్తి, తన వ్యక్తిగత పనులను త్వరగా, సమర్థంగా నెరవేర్చే వ్యక్తి, మిత్రుల పనులను స్వార్థరహితంగా ముగించే వ్యక్తి, దేశం పట్ల కర్తవ్యాలను నిర్వహించడంలో తన పూర్తి పరాక్రమాన్ని, సాహసాన్ని కనబరిచే వ్యక్తి మాత్రమే శ్రేష్ఠమైన వ్యక్తి అని  ఈ సుభాషితం మనకు బోధిస్తోంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From importer to exporter: Defence equipment among 5 segments India turned trade-positive in 5 years

Media Coverage

From importer to exporter: Defence equipment among 5 segments India turned trade-positive in 5 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి
September 05, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27ఆదివారం నాడు తన 'మన్ కి బాట్' (మనసులో మాట) పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు ఆలోచనలు కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధానితో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

 దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ సలహాలను పంచుకోండి.