మహానుభావులారా,




నమస్కారం.
 

ఈ రోజు న జరుగుతున్న ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాని కి మీ అందరికి ఇదే స్నేహపూర్వక స్వాగతం. గడచిన రెండు దశాబ్దాలు గా యావత్తు ఆసియా ప్రాంతం లో శాంతి కి, సమృద్ధి కి మరియు అభివృద్ధి కి ఎస్ సిఒ ఒక ముఖ్యమైన వేదిక గా ఉంటున్నది. ఈ ప్రాంతాని కి మరియు భారతదేశాని కి మధ్య వేల సంవత్సరాలు గా సాంస్కృతిక సంబంధాలు మరియు ఉభయ పక్షాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు ఏర్పడి అవి మన యొక్క ఉమ్మడి వారసత్వాని కి ఒక సజీవ తార్కాణం గా నిలచాయి. మనం ఈ ప్రాంతాన్ని ‘‘విస్తారిత ఇరుగు పొరుగు బంధం’’ గా చూడం, మనం దీనిని ‘‘విస్తారిత కుటుంబం’’ లా ఎంచుతున్నాం.



మహానుభావులారా,




ఎస్ సిఒ చైర్ పర్సన్ హోదా లో భారతదేశం మన బహు పార్శ్విక సహకారాన్ని క్రొత్త శిఖరాల కు తీసుకు పోవడం కోసం నిరంతరాయం గా పాటుపడుతూ వచ్చింది. మేం ఈ ప్రయాసల ను రెండు మౌలిక సూత్రాల ప్రాతిపదికన చేస్తూ వచ్చాం. వాటిలో ఒకటోది ‘వసుధైవ కుటుంబకమ్’ అనేది, ఈ మాటల కు.. ‘యావత్తు ప్రపంచం ఒకే కుటుంబం’ అని భావం. అనాది గా ఈ సూత్రం మా సామాజిక నడవడిక లో విడదీయలేనటువంటి ఒక భాగం గా ఉన్నది. ఇది ఆధునిక కాలాల్లో సైతం మాకు ఒక ప్రేరణదాయకమైన అంశం గాను, శక్తివర్థకం గాను పని చేస్తున్నది. రెండో సూత్రం ఏమిటి అంటే, అది సెక్యూర్ (ఎస్ఇసియుఆర్ఇ). దీనిలో ‘ఎస్’ అక్షరం భద్రత ను (సెక్యూరిటీ), ‘ఇ’ అక్షరం ఆర్థిక అభివృద్ధి ని (ఇకానామిక్ డివెలప్ మెంట్) , ‘సి’ వచ్చి సంధానాన్ని (కనెక్టివిటీ), ‘యు’ ఏమో ఏకత్వాని కి (యూనిటీ) , ‘ఆర్’ అనే అక్షరం సార్వభౌమత్వం, ఇంకా ప్రాదేశిక సమగ్రత ల పట్ల గౌరవాని కి (సావరిన్ టీ ఎండ్ టెర్రిటారియల్ ఇంటెగ్రిటీ) మరియు ‘ఇ’ అనేది పర్యావరణ పరిరక్షణ కు (ఇన్ వైరన్ మెంట్ ప్రొటెక్శన్) కు సంకేతాలు అయి ఉన్నాయి. ఇది మన ఎస్ సిఒ కు మా యొక్క అధ్యక్షత మరియు మన ఎస్ సిఒ పట్ల మా యొక్క దృష్టికోణాని కి అద్దం పట్టేటటువంటిది గా ఉంది.


 


ఈ దృష్టి కోణం తో, భారతదేశం ఎస్ సిఒ పరిధి లో సహకారాని కి అయిదు క్రొత్త స్తంభాల ను ఏర్పరచింది: అవి ఏమేమిటంటే

 

· స్టార్ట్-అప్స్ ఎండ్ ఇనొవేశన్,

· సాంప్రదాయిక వైద్య చికిత్స,

· యువత యొక్క సశక్తీకరణ,

· డిజిటల్ సేవల ను అందరికీ అందించడం, మరియు

· బౌద్ధం సంబంధి ఉమ్మడి వారసత్వం .. అనేవే.


మహానుభావులారా,



 

  • యొక్క ఎస్ సిఒ అధ్యక్షత హయాం లో భాగం గా ఎస్ సిఒ సభ్యత్వ దేశాల లో నూట నలభై కు పైగా కార్యక్రమాల ను, సమావేశాల ను మరియు సదస్సుల ను మేం ఏర్పాటు చేశాం. పద్నాలుగు వేరు వేరు కార్యక్రమాల లో మేం ఎస్ సిఒ యొక్క పరిశీలక భాగస్వాముల ను మరియు సంభాషణ ప్రధానమైన భాగస్వాముల ను క్రియాశీలమైన రీతిన నియోగించాం. ఎస్ సిఒ యొక్క మంత్రిత్వ స్థాయి సమావేశాలు పదునాలుగింటి లో మేం అనేక ముఖ్యమైన పత్రాల ను సమష్టి గా రూపొందించాం. వీటితో కలుపుకొని మన సహకారం లో క్రొత్త మరియు ఆధునికమైన పార్శ్వాల ను మనం జత పరచుకొంటున్నాం. ఆయా పార్శ్వాల లో -

    • శక్తి రంగం లో సరిక్రొత్త గా వచ్చి చేరుతున్న ఇంధనాల పరం గా సహకారం.


• రవాణా రంగం లో కర్బనం యొక్క వాటా ను తగ్గించే దిశ లో సహకారం, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేశన్ , ఇంకా
• డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగం లో సహాకారం.. వంటివి భాగం గా ఉన్నాయి.

 



ఎస్ సిఒ లో సహకారం ఒక్క ప్రభుత్వాలకే పరిమితం కాకూడదనే దిశ లో భారతదేశం తన ప్రయాసల ను కొనసాగించింది. భారతదేశం అధ్యక్ష పదవీ కాలం లో ప్రజల మధ్య సంబంధాల ను పెంపొందింప చేయడం కోసం క్రొత్త కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిసారి గా, ఎస్ సిఒ మిలెట్ ఫుడ్ ఫెస్టివల్, ఫిల్మ్ ఫెస్టివల్, ఎస్ సిఒ సూరజ్ కుండ్ క్రాఫ్ట్ మేళా, థింక్ టాంక్స్ కాన్ఫరెన్స్ మరియు బౌద్ధం సంబంధి ఉమ్మడి వారసత్వం అంశాల పై అంతర్జాతీయ మహా సభల ను ఏర్పాటు చేయడమైంది.



 

చిరకాలికంగా మనుగడ లో ఉన్న వారాణసీ నగరం ఎస్ సిఒ యొక్క ఒకటో పర్యటన ప్రధానమైనటువంటి మరియు సాంస్కృతిక పరమైనటువంటి రాజధాని గా అనేక కార్యక్రమాల కు ఓ ఆకర్షణ బిందువు గా మారింది. ఎస్ సిఒ సభ్యత్వ దేశాల కు చెందిన శక్తి ని మరియు ప్రతిభావంతులైన యువతీ యువకుల ను వెలుగు లోకి తీసుకు రావడం కోసం యంగ్ సైంటిస్ట్ స్ కాన్ క్లేవ్, యంగ్ ఆథర్స్ కాన్ క్లేవ్, యంగ్ రెసిడెంట్ స్కాలర్ ప్రోగ్రామ్, స్టార్ట్-అప్ ఫోరమ్, ఇంకా యూత్ కౌన్సిల్ ల వంటి క్రొత్త వేదికల ను మేం ఏర్పాటు చేశాం.

మహానుభావులారా,



 

వర్తమాన స్థితులు ప్రపంచ వ్యవహారాల లో ఒక కీలకమైన దశ కు ప్రతీక గా ఉన్నాయి.



సంఘర్షణ లు, ఉద్రిక్తత లు మరియు మహమ్మారులు ఆవరించినటువంటి ప్రపంచం లో ఆహారం, ఇంధనం మరియు ఎరువు ల పరమైన సంకటాలు అన్ని దేశాల కు ఒక పెద్ద సవాలు గా ఉంటున్నాయి.



మన ప్రజల అపేక్షల ను, ఆకాంక్షల ను నెరవేర్చగల దక్షత ఒక సంస్థ గా మనకు ఉన్నదా ? అనే సంగతి ని మనమంతా ఆలోచించవలసి ఉంది.



 

ఆధునిక కాలం సవాళ్ళ ను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగా ఉన్నామా?



భవిష్యత్తు కై సర్వసన్నద్ధమైనటువంటి ఒక సంస్థ గా ఎస్ సిఒ రూపుదాల్చుతున్నదా?



ఈ విషయం లో ఎస్ సిఒ యొక్క ఆధునీకరణ కు మరియు సంస్కరణల సంబంధి ప్రతిపాదనల కు భారతదేశం తన సమర్థన ను అందిస్తున్నది.



ఎస్ సిఒ లో భాష పరమైన అడ్డంకుల ను తొలగించడం కోసం భారతదేశం యొక్క ఎఐ-ఆధారితమైన భాషా వేదిక ‘‘భాషిణి’’ ని అందరికీ వెల్లడించడానికి సంతోషం గా మేం ముందంజ వేస్తాం. వృద్ధి తాలూకు ఫలాల ను అన్ని వర్గాల వారి కి అందించడం కోసం ఇది డిజిటల్ టెక్నాలజీ తాలూకు ఒక ఉదాహరణ గా నిలబడ గలుగుతుంది.



 

ఐక్య రాజ్య సమితి సహా ప్రపంచ స్థాయి సంస్థల లో సంస్కరణ ల కోసం ఎస్ సిఒ కూడా తన వంతు గా ఒక ముఖ్య పాత్ర ను పోషించవలసిందే.

ఈ రోజు న ఎస్ సిఒ పరివారం లో ఒక క్రొత్త సభ్యత్వ దేశం గా ఇరాన్ చేరనుండటం పట్ల నేను సంతోషం గా ఉన్నాను.

ఈ సందర్భం లో ఇరాన్ ప్రజల కు మరియు అధ్యక్షుడు శ్రీ రయీసీ కి నేను నా అభినందనల ను తెలియ జేస్తున్నాను.

అలాగే, ఎస్ సిఒ లో సభ్యత్వం కోసం మెమోరాండమ్ ఆఫ్ ఆబ్లిగేశన్ పై బెలారస్ సంతకం చేయడాన్ని కూడా మేం స్వాగతిస్తున్నాం.


 

ఇతర దేశాలు ఈ రోజు న ఎస్ సిఒ లో చేరాలని ఉవ్విళ్ళూరడం ఈ సంస్థ యొక్క ప్రాముఖ్యాని కి ఒక నిదర్శన అని చెప్పుకోవచ్చును.



ఈ ప్రక్రియ లో సెంట్రల్ ఏశియా దేశాల యొక్క ప్రయోజనాలు మరియు ఆకాంక్ష ల విషయం లో ఎస్ సిఒ తన దృష్టి ని కేంద్రీకరించడం ఎంతైనా అవసరం.

 



మహానుభావులారా,



ఉగ్రవాదం అనేది ప్రాంతీయ శాంతి కి మరియు ప్రపంచ శాంతి కి ఒక పెద్ద బెదరింపు గా మారింది. ఈ సవాలు ను పరిష్కరించాలి అంటే అందుకు నిర్ణయాత్మకమైనటువంటి కార్యాచరణ కు పూనుకోవలసి ఉంటుంది. ఉగ్రవాదం అది ఏ రూపంలో ఉందన్న దానితో సంబంధం లేకుండా ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా మనం ఏకోన్ముఖ యుద్ధాన్ని జరిపి తీరాలి. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని వాటి విధానాల లో ఒక సాధనం గా ఉపయోగించుకొంటూ, ఆ క్రమం లో ఉగ్రవాదుల కు ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. అటువంటి దేశాల ను విమర్శించడాని కి ఎస్ సిఒ వెనుదీయకూడదు. ఆ కోవ కు చెందిన గంభీర అంశాల లో ద్వంద్వ ప్రమాణాల కు ఎటువంటి తావు ను ఇవ్వనేకూడదు. ఉగ్రవాదుల కు ఆర్థిక సహాయాన్ని అందించే అంశాన్ని పరిష్కరించడం లో మనం పరస్పర సహకారాన్ని వృద్ధి చెందింప చేసుకోవలసి ఉంది. ఈ విషయం లో ఎస్ సిఒ యొక్క ఆర్ఎటిఎస్ (RATS) యంత్రాంగం ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించింది. మన యువతీ యువకుల లో సమూల సంస్కరణవాదం వ్యాప్తి చెందకుండా నిరోధించడం కోసం సైతం మనం క్రియాత్మక చర్యల కు నడుం బిగించాలి. సమూల సంస్కరణవాదం అనే అంశం పై ఈ రోజు న జారీ చేసిన సంయుక్త ప్రకటన మన ఉమ్మడి వచనబద్ధత కు నిదర్శన గా ఉంది.

 



మహానుభావులారా,



అఫ్ గానిస్తాన్ లో తలెత్తిన స్థితి మన అన్ని దేశాల భద్రత ను నేరు గా ప్రభావితం చేసింది. అఫ్ గానిస్తాన్ విషయం లో భారతదేశం యొక్క ఆందోళనలు మరియు అపేక్షలు ఎస్ సిఒ లోని అనేక సభ్యత్వ దేశాల మాదిరిగానే ఉన్నాయి. అఫ్ గానిస్తాన్ ప్రజల శ్రేయం కోసం పాటుపడేందుకు మనం అంతా ఏకమై పని చేయాలి. అఫ్ గాన్ పౌరుల కు మానవత పూర్వకమైన సహాయం; అన్ని వర్గాల కు ప్రాతినిధ్యం ఉండేటటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం; ఉగ్రవాదం మరియు మత్తు పదార్థాల దొంగ రవాణా.. వీటన్నింటికి వ్యతిరేకం గా పోరాడడం; మహిళ లు, బాలలు మరియు అల్పసంఖ్యక వర్గాల వారి హక్కుల కు పూచీ పడడం అనేవి మన ఉమ్మడి ప్రాథమ్యాల లో భాగం గా ఉన్నాయి. అఫ్ గానిస్తాన్ ప్రజల కు మరియు భారతదేశం ప్రజల కు మధ్య వందల సంవత్సరాలు గా మైత్రీపూర్వక సంబంధాలు ఉన్నాయి. గడచిన ఇరవై ఏళ్ళ లో మేం అఫ్ గానిస్తాన్ ఆర్థికాభివృద్ధి కి, సామాజిక అభివృద్ధి కి తోడ్పాటు ను అందించాం. 2021 వ సంవత్సరం లో సంభవించిన పరిణామాల అనంతరం కూడా ను మేం మానవతా పూర్వక సాయాన్ని అందించడాన్ని కొనసాగించాం. ఇరుగు పొరుగు దేశాల లో అస్థిరత్వాన్ని వ్యాప్తి చేయడం కోసమో, అతివాద సూత్రాల కు కొమ్ము కాయడం కోసమో అఫ్ గానిస్తాన్ గడ్డ ను ఉపయోగించుకోకుండా చూడడం ముఖ్యం.

 



మహానుభావులారా,



ఏ ప్రాంతం అయినా సరే పురోగతి ని సాధించాలి అంటే అందుకు బలమైన సంధానం కీలకం అవుతుంది. మెరుగైన సంధానం పరస్పర వ్యాపారాన్ని వృద్ధి చెందింప చేయడం ఒక్కటే కాకుండా పరస్పర విశ్వాసాన్ని కూడా ను వర్థిల్ల జేస్తుంది. ఏమైనా ఈ విధమైన ప్రయాసల లో ఎస్ సిఒ నియమావళి యొక్క మౌలిక సిద్ధాంతాల ను, మరీ ముఖ్యం గా సభ్యత్వ దేశాల సార్వభౌమత్వాన్ని మరియు ప్రాంతీయ అఖండత్వాన్ని ఆదరిస్తూ, వాటిని పరిరక్షించడం అత్యవసరం. ఎస్ సిఒ లో ఇరాన్ సభ్యత్వం పొందిన దరిమిలా చాబహార్ నౌకాశ్రయాన్ని గరిష్ట స్థాయి లో ఉపయోగించుకొనే దిశ లో మనం ముందుకు సాగ గలుగుతాం. హిందూ మహా సముద్రాన్ని వినియోగించుకోవడం లో సెంట్రల్ ఏశియా లోని దేశాల కు ఒక భద్రమైన మరియు సమర్థమైన మార్గం గా ఇంటర్ నేశనల్ నార్థ్-సౌథ్ ట్రాన్స్ పోర్ట్ కారిడర్ దోహదం చేయగలుగుతుంది. దీని యొక్క సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో వినియోగించుకోవడం కోసం మనం శ్రద్ధ వహించాలి.

 



మహానుభావులారా,




ప్రపంచ జనాభా లో దాదాపు గా 40 శాతం మంది ఎస్ సిఒ సభ్యత్వ దేశాలలో నివసిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో సుమారు మూడింట ఒక వంతు కు కూడా ఎస్ సిఒ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ కారణం గా మనలో ప్రతి ఒక్కరి అవసరాల ను మరియు ఆందోళనల ను అర్థం చేసుకోవలసిన ఉమ్మడి బాధ్యత మన మీద ఉంది. మెరుగైన సహకారం ద్వారా, మెరుగైన సమన్వయం ద్వారా అన్ని సవాళ్ళ ను పరిష్కరించుకోవడం కోసం, మరి మన ప్రజల శ్రేయం కోసం నిరంతర ప్రయాస లు చేయవలసివుంది. భారతదేశం యొక్క అధ్యక్ష పదవీకాలం ఫలప్రదం గా ఉండేటట్లు చూడడం లో మీ అందరి వద్ద నుండి నిరంతరాయ సమర్థన ను మేం అందుకొన్నాం. దీనికి గాను మీలో ప్రతి ఒక్కరి కి నా హృదయ పూర్వకమైన కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. ఎస్ సిఒ యొక్క తదుపరి చైర్ మన్ కజాక్ స్థాన్ అధ్యక్షుడు నా యొక్క మిత్రుడు శ్రీ తొకాయెవ్ కు యావత్తు భారతదేశం పక్షాన నేను నా యొక్క శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను.


 

ఎస్ సిఒ యొక్క సఫలత కోసం ప్రతి ఒక్క సభ్యత్వ దేశం తో పాటు చురుకు గా తోడ్పాటు ను అందించడాని కి భారతదేశం కట్టుబడి ఉంది.



 

మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
It’s time to fix climate finance. India has shown the way

Media Coverage

It’s time to fix climate finance. India has shown the way
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Aide to the Russian President calls on PM Modi
November 18, 2025
They exchange views on strengthening cooperation in connectivity, shipbuilding and blue economy.
PM conveys that he looks forward to hosting President Putin in India next month.

Aide to the President and Chairman of the Maritime Board of the Russian Federation, H.E. Mr. Nikolai Patrushev, called on Prime Minister Shri Narendra Modi today.

They exchanged views on strengthening cooperation in the maritime domain, including new opportunities for collaboration in connectivity, skill development, shipbuilding and blue economy.

Prime Minister conveyed his warm greetings to President Putin and said that he looked forward to hosting him in India next month.