ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యం తొణికిసలాడుతూ ఉండే విశాఖపట్నం నగరంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటరుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సహా అనేక వసతులకు నిలయమైన ఈ కేంద్రం.. ‘వికసిత్ భారత్‌’ను ఆవిష్కరించాలన్న మన దృష్టికోణంతో సరిపోలేదిగా ఉందని శ్రీ మోదీ అన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ప్రభావవంతమైన శక్తిగా నిలుస్తుంది. ఇది ఏఐని అందరి చెంతకు చేరుస్తూ, మన ప్రజలకు ఆధునిక సేవలను సమకూరుస్తూ, మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడంతో పాటు ప్రపంచానికి సాంకేతిక మార్గదర్శి భారత్ అనే హోదాను కూడా ఇస్తుంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.
 
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:

‘‘ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యం తొణికిసలాడుతూ ఉండే విశాఖపట్నం నగరంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నాను.

గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటరుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు సహా అనేక వసతుల నిలయమైన ఈ కేంద్రం.. ‘వికసిత్ భారత్‌’ను ఆవిష్కరించాలన్న మన దృష్టికోణంతో సరిపోలేదిగా ఉంది. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ప్రభావవంతమైన శక్తిగా నిలుస్తుంది.ఇది ఏఐని అందరి చెంతకు చేరుస్తూ, మన ప్రజలకు ఆధునిక సేవలను సమకూరుస్తూ, మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవడంతో పాటు ప్రపంచానికి సాంకేతిక మార్గదర్శి భారత్ అనే హోదాను కూడా ఇస్తుంది.’’

@sundarpichai

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%

Media Coverage

India stands tall in shaky world economy as Fitch lifts FY26 growth view to 7.5%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మార్చి 2026
March 14, 2026

Heartening Resolve Meets Bold Action: PM Modi's Transformative Push for a Developed Assam.