జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబాతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జపాన్‌కు చెందిన మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో పర్యటించారు. సెమీ‌కండరక్టర్ రంగంలో ప్రముఖ జపాన్ కంపెనీ అయిన టోక్యో ఎలక్ట్రాన్ మియాగీ లిమిటెడ్‌ను (టీఈఎల్ మియాగీ) వారు సందర్శించారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన విలువ గొలుసులో టీఈఎల్ పాత్ర, దాని అధునాతన తయారీ సామర్థ్యాలు.. భారత్‌తో ఆ కంపెనీ ప్రణాళికలో ఉన్న భాగస్వామ్యాల గురించి ప్రధాన మంత్రికి వివరించారు. సెమీకండక్టర్ రంగంలో సరఫరా వ్యవస్థ, తయారీ, పరీక్షలకు సంబంధించిన విభాగాల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు రెండు దేశాల మధ్య ఉన్న అవకాశాల గురించి ఇరువురు నాయకులకు క్షేత్ర స్థాయి అవగాహనను ఈ సందర్శన కల్పించింది.

 

భారతదేశంలో వృద్ధి చెందుతోన్న సెమీకండక్టర్ తయారీ వ్యవస్థ.. అధునాతన సెమీకండక్టర్ పరికరాలు, సాంకేతికత విషయంలో జపాన్‌కు ఉన్న సామర్థ్యంలోని సారూప్యతలను అర్థం చేసుకోవడానికి ఈ సెండాయ్ పర్యటన ఉపకరించింది. భారత్‌-జపాన్ పారిశ్రామిక పోటీతత్వ భాగస్వామ్యం, ఆర్థిక భద్రతా చర్చల ప్రకారం ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలతో పాటు జపాన్-ఇండియా సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థ భాగస్వామ్యంపై సహకార ఒప్పందం ఆధారంగా ఈ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నిబద్ధతలో ఉన్నట్లు ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి.

 

భారత ప్రధాని శ్రీ మోదీ, జపాన్ ప్రధాని శ్రీ ఇషిబా సంయుక్తంగా చేపట్టిన ఈ పర్యటన.. భారీ, ధృడమైన, విశ్వసనీయమైన సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే ఇరు దేశాల ఉమ్మడి దార్శనికతకు అద్దం పట్టింది. ఈ పర్యటనలో పాల్గొన్నందుకు ఆ దేశ ప్రధాని శ్రీ ఇషిబాకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వ్యూహాత్మక రంగంలో జపాన్‌తో కలిసి పనిచేసేందుకు భారత్ సంసిద్ధంగా ఉన్నట్లు శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

 

సెండాయ్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం జపాన్ ప్రధాని శ్రీ ఇషిబా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మియాగి రాష్ట్ర గవర్నర్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
‘DigiDukaan’ drive set to digitise 1.4 crore kirana stores, modernising India’s FMCG backbone and revolutionising general trade

Media Coverage

‘DigiDukaan’ drive set to digitise 1.4 crore kirana stores, modernising India’s FMCG backbone and revolutionising general trade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 జూన్ 2026
June 13, 2026

Viksit Bharat Accelerating: Tech, Defense, Infra & Exports Power India's Global Leap Under the Leadership of PM Modi