In the Information era, first-mover does not matter, the best-mover does : PM
It is time for tech-solutions that are Designed in India but Deployed for the World :PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బెంగ‌ళూరు లో టెక్ స‌మిట్ ను ఈ రోజున వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.  ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నాన్ని క‌ర్నాట‌క ఇన్నోవేషన్ ఎండ్ టెక్నాలజీ సొసైటీ (కెఐటిఎస్), క‌ర్నాట‌క ప్ర‌భుత్వ విజ‌న్ గ్రూప్ ఆన్ ఇన్ఫ‌ర్మేషన్ టెక్నాల‌జీ, బ‌యోటెక్నాల‌జీ ఎండ్ స్టార్ట్-అప్, సాఫ్ట్ వేర్ టెక్నాల‌జీ పార్క్‌స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ), ఎమ్ఎమ్ యాక్టివ్‌, సైన్స్‌-టెక్ క‌మ్యూనికేష‌న్స్ ల‌తో క‌ల‌సి క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఏర్పాటుచేసింది. ‘‘నెక్స్‌ట్ ఈజ్ నౌ’’ అనేది ఈ సంవ‌త్స‌ర శిఖ‌ర స‌మ్మేళ‌నం ఇతివృత్తంగా ఉంది.  ఈ కార్యక్ర‌మం లో ఇల‌క్ట్రానిక్స్‌, ఐటి, క‌మ్యూనికేష‌న్స్‌, చ‌ట్టం, న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్‌, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ డి.ఎస్‌. య‌డియూర‌ప్ప లు కూడా పాల్గొన్నారు.
 
ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తుతం డిజిట‌ల్ ఇండియా ను ఒక ప్ర‌భుత్వ సాధార‌ణ కార్య‌క్ర‌మం గా చూడ‌టం ఏదైనా అది ఒక జీవ‌న మార్గంగా, మ‌రీ ముఖ్యంగా పేద‌లు, ఆద‌ర‌ణ‌కు నోచుకోని వ‌ర్గాల‌ వారికి సంబంధించిన, అలాగే ప్ర‌భుత్వం లో ఉన్న వ‌ర్గాల జీవ‌న మార్గంగా కూడా మారిపోయింద‌ని చెప్తూ, అందుకు సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

డిజిట‌ల్ ఇండియా వ‌ల్ల మ‌న దేశం అభివృద్ధి ప్ర‌యాణం లో మాన‌వుల‌కు మ‌రింత ప్రాముఖ్యం గ‌ల విధానానికి సాక్షీభూతంగా నిల‌చింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  సాంకేతిక విజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉప‌యోగించ‌డం పౌరుల‌కు ఎన్నో మార్పుల‌ను తీసుకు వ‌చ్చింద‌ని, వాటి ఫ‌లితాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.  ప్ర‌భుత్వం డిజిట‌ల్ ప‌రిష్కార మార్గాల‌కు, సాంకేతిక విజ్ఞాన సంబంధ ప‌రిష్కార మార్గాల‌కు ఒక బ‌జారును ఏర్పాటుచేయ‌డం ఒక్క‌టే కాకుండా, దానిని అన్ని ప‌థ‌కాల‌ లో ఒక ముఖ్య భాగంగా కూడా  చేర్చింద‌ని ఆయ‌న అన్నారు.  త‌న ప్ర‌భుత్వ న‌మూనాలో సాంకేతిక‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌ని, సాంకేతిక విజ్ఞానం ద్వారా మాన‌వుల గౌర‌వాన్ని పెంచ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న అన్నారు.  కోట్ల కొద్దీ రైతులు ఒకే క్లిక్ ద్వారా న‌గ‌దు సాయాన్ని అందుకొంటున్నార‌ని, ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కం అయిన ‘ఆయుష్మాన్ భార‌త్’ ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు.  భార‌త‌దేశం లో పేద ప్ర‌జ‌లు లాక్ డౌన్ శిఖ‌ర స్థాయిలో ఉన్న కాలంలో కూడాను స‌రైన సాయాన్ని, శీఘ్రంగా అందుకొనేట‌ట్లు సాంకేతిక విజ్ఞానం పూచీ ప‌డింద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు.  ఇంత పెద్ద ఎత్తున జరిగిన  ఈ స‌హాయానికి సాటిరాగ‌లిగిన‌వి మ‌రేవి లేవ‌ని ఆయ‌న అన్నారు.

ఉత్త‌మ‌మైన సేవ‌ల విత‌ర‌ణ‌కు, స‌మ‌ర్థ‌మైన తీరున ఆయా సేవ‌ల‌ను స‌మ‌కూర్చ‌డానికిగాను డాటా ఎన‌లటిక్స్ శ‌క్తిని ప్ర‌భుత్వం వినియోగించుకొంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  మా ప‌థ‌కాల‌కు ముఖ్య కార‌ణం సాంకేతిక‌త‌.  అది ఫైళ్ళలో నుంచి ప్ర‌జ‌ల జీవితాల లోకి అడుగిడి చాలా త్వ‌ర‌గా పెద్ద ఎత్తున మార్పులు తీసుకువ‌చ్చింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.  సాంకేతిక విజ్ఞానం కార‌ణంగానే మ‌నము అంద‌రికీ విద్యుత్తును స‌మ‌కూర్చ‌డంతో పాటు, దారి సుంకం కేంద్రాల‌ను త్వ‌రిత‌గ‌తిన దాటిపోగ‌లుగుతున్నామ‌ని, అంతేకాకుండా త‌క్కువ కాలంలోనే విస్తార‌మైన జ‌నాభాకు టీకా మందు ఇప్పించ‌గ‌ల‌మ‌న్న విశ్వాసాన్ని కూడా ఇది అందిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

మ‌హ‌మ్మారి కాలం లో ప్ర‌తిభాత‌త్వాన్ని క‌న‌బ‌రచినందుకుగాను, సాంకేతిక రంగాన్ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు.  ఒక ద‌శాబ్ద కాలంలోనైనా చోటుచేసుకోలేనంత‌టి సాంకేతిక విజ్ఞాన అనుస‌ర‌ణ కేవ‌లం కొన్ని నెల‌ల వ్య‌వ‌ధిలో సాధ్య‌ప‌డింద‌ని ఆయ‌న ప్ర‌ముఖంగా పేర్కొన్నారు.  ఎక్క‌డినుంచైనా ప‌ని చేయ‌డం అనే ధోర‌ణి ఒక నియ‌మంగా మారిపోయింద‌ని, ఇది ఇక మీద‌ట కూడా కొన‌సాగుతుంద‌న్నారు.  విద్య‌, వైద్యం, వ‌స్తువుల కొనుగోలు మొద‌లైన రంగాల‌లో సాంకేతిక‌త‌ను అనుస‌రించ‌డం విరివిగా చోటుచేసుకొంద‌ని ఆయ‌న చెప్పారు.

పారిశ్రామిక యుగం లో న‌మోదైన కార్య సాధ‌న‌ను గ‌డ‌చిపోయిన కాలానికి చెందిన‌ది అని, ప్ర‌స్తుతం మ‌నం స‌మాచార యుగం మ‌ధ్య ద‌శ‌లో ఉన్నామ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  పారిశ్రామిక యుగంలో మార్పు అనేది ఒకే వ‌రుసలో ఉండ‌గా, స‌మాచార యుగంలో మాత్రం మార్పు పెను ప్ర‌భావాన్ని క‌లుగ‌జేసేదిగా ఉంద‌న్నారు.  పారిశ్రామిక యుగానికి భిన్నంగా మొద‌ట ఎవ‌రు త‌ర‌లి వ‌చ్చారు అనే అంశానికి బ‌దులు, ఉత్త‌మ‌మైన ఫ‌లితాల‌ను ఎవ‌రు ఆవిష్కరించారు అనేది స‌మాచార యుగంలో ప్ర‌ధానంగా మారుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  ఒక ఉత్ప‌త్తిని ఎవ‌రైనా, ఏ కాలంలోనైనా త‌యారుచేయ‌వ‌చ్చ‌ని, అయితే అది అప్ప‌టి వ‌ర‌కు బ‌జారులో ఉన్న స‌మీక‌ర‌ణాల‌న్నిటినీ ధ్వంసం చేసేదిగా ఉండాల‌ని ఆయ‌న చెప్పారు.

స‌మాచార యుగం లో ఒక్క‌సారిగా ముందుకు దూసుకుపోయే విశిష్ట సామ‌ర్ధ్యం భార‌త‌దేశానికి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  భార‌త‌దేశం లో శ్రేష్ఠ‌మైన ప్ర‌జ్ఞావంతుల‌కు తోడు, అతిపెద్ద బ‌జారు కూడా అందుబాటులో ఉంద‌ని ఆయ‌న అన్నారు.  మ‌న స్థానిక సాంకేతిక ప‌రిష్కార మార్గాల‌కు ప్ర‌పంచ స్థాయికి ఎదిగే స‌త్తా ఉంద‌ని ఆయ‌న చెప్పారు.  భార‌త‌దేశం లో రూపొందించేట‌టువంటి సాంకేతిక సంబంధిత ప‌రిష్కార మార్గాల‌ను ప్ర‌పంచ అవ‌స‌రాల‌కు వినియోగించ‌వ‌ల‌సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు.  సాంకేతిక‌త‌, నూత‌న ఆవిష్కారాల ప‌రిశ్ర‌మ‌ను స‌ర‌ళ‌తరంగా మార్చ‌డం ప‌ట్ల ప్ర‌భుత్వ విధాన నిర్ణ‌యాలు స‌దా దృష్టిని కేంద్రీక‌రించాయ‌ని, ఇటీవ‌ల స‌మాచార సాంకేతిక ప‌రిశ్ర‌మ మీద ఉన్న విధానాల‌ను పాటించాల‌నే భారాన్ని త‌గ్గించ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న గుర్తుకు తెచ్చారు.  ప్ర‌భుత్వం ఎల్ల‌వేళ‌లా సాంకేతిక ప‌రిశ్ర‌మ లోని భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతూ ఉండ‌టానికే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, భ‌విష్య‌త్తు కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర‌వ‌ని తీరున విధాన‌ప‌ర‌మైన ఫ్రేమ్ వ‌ర్క్ ల‌ను రూపొందించాల‌నుకొంటోంద‌ని ఆయ‌న చెప్పారు.

విజ‌య‌వంత‌మైన అనేక ఉత్ప‌త్తుల కోసం ఒక ప‌ర్యావ‌ర‌ణ అనుకూల వ్య‌వ‌స్థ‌ను నిర్మించే సామ‌ర్ధ్యంతో కూడిన ఫ్రేమ్ వ‌ర్క్ స్థాయి మ‌న‌స్త‌త్వం కావాల‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  యుపిఐ నేశన‌ల్ డిజిట‌ల్ హెల్త్ మిష‌న్‌, స్వామిత్వ ప‌థ‌కం వంటి కార్య‌క్ర‌మాలు ఫ్రేమ్ వ‌ర్క్ స్థాయి మ‌న‌స్త‌త్వం క‌లిగిన‌వేన‌ని ఆయ‌న చెప్పారు.  ర‌క్ష‌ణ రంగం మ‌రింత‌గా అభివృద్ధి చెంద‌డానికి, సాంకేతిక విజ్ఞానం గ‌తిని అందిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.  సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవ‌డం అమాంతం పెరుగుతూ ఉన్న వేళ స‌మాచార ప‌రిర‌క్ష‌ణ తో పాటు, సైబ‌ర్ సెక్యూరిటీ తాలూకు అవ‌స‌రం కూడా పెరిగిపోయింద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వైర‌స్ లు, సైబ‌ర్ దాడుల బారిన డిజిట‌ల్ ఉత్ప‌త్తులు ప‌డ‌కుండా వాటికి ధీటైన టీకా మందును పోలిన బ‌ల‌మైన సైబ‌ర్ సెక్యూరిటీ సంబంధిత ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొన‌డంలో యువ‌తీ యువ‌కులు ఒక ప్ర‌ధాన పాత్ర‌ను పోషించేందుకు వీలు ఉంద‌ని ఆయ‌న ప్ర‌తిపాదించారు.

బ‌యో-సైన్సెస్‌, ఇంజినీరింగ్ మొద‌లైన విజ్ఞాన శాస్త్ర సంబంధిత రంగాల‌ లో నూత‌న ఆవిష్క‌ర‌ణ అవ‌స‌రం, అవ‌కాశం ఎంతో సంద‌ర్భ శుద్ధిని క‌లిగి ఉంటాయి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  పురోగ‌మించ‌డానికి నూత‌న ఆవిష్క‌ర‌ణ అనేది కీల‌కమ‌ని, మ‌రి భార‌త‌దేశం నూత‌న ఆవిష్కారాల విష‌యానికి వ‌స్తే ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌యోజ‌నాన్ని క‌లిగి ఉంద‌ని, దీనికి కార‌ణం మ‌న యువ‌త‌లోని ప్ర‌తిభ‌, క్రొత్త క్రొత్త విష‌యాల‌ను అన్వేషించాల‌నేట‌టువంటి వారిలోని ఉత్సుక‌త‌లేన‌ని ఆయ‌న అన్నారు.  మ‌న యువ‌తీ యువ‌కుల సామ‌ర్ధ్యం, అలాగే సాంకేతిక‌త లో గ‌ల అవ‌కాశాలు అనంత‌మైన‌వ‌ని ఆయ‌న చెప్పారు.  వాటిని వినియోగించుకోవ‌డానికి మ‌నం మ‌న స‌ర్వ శ‌క్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌వ‌ల‌సిన త‌రుణం ఇదేన‌ని ఆయ‌న అన్నారు.  మ‌న స‌మాచార, సాంకేతిక రంగం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణంగా నిలుస్తూ ఉంటుంద‌న్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
RBI increases UPI Lite, UPI 123PAY transaction limits to boost 'digital payments'

Media Coverage

RBI increases UPI Lite, UPI 123PAY transaction limits to boost 'digital payments'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
English Translation of Closing Remarks by Prime Minister Shri Narendra Modi at the 21st ASEAN-India Summit, Lao PDR
October 10, 2024

Your Majesty,

Excellencies,

I express my gratitude for our positive discussions today and for all your valuable insights and suggestions.

I would also like to express my sincere gratitude to Prime Minister Sonexay Siphandone for the successful organization of today’s summit.

The two Joint Statements we have adopted to strengthen digital transformation and our Comprehensive Strategic Partnership will lay the groundwork for our collaboration in future. I commend all for this achievement.

I would like to express my gratitude to Singapore for its positive role as India’s Country Coordinator in ASEAN over the past three years. Thanks to your support, we have made unprecedented progress in India-ASEAN relations. I also welcome and congratulate the Philippines as our new Country Coordinator.

I am confident that we will continue to collaborate for the bright future of two billion people and for regional peace, stability, and prosperity.

Once again, I extend my heartfelt congratulations to the Prime Minister of Lao P.D.R. for the exemplary chairmanship of ASEAN.

As Malaysia assumes the mantle of the next chair, I convey my best wishes on behalf of 1.4 billion Indians.

You can rely on India’s unwavering support for success of your Chairmanship.

Thank you very much.