శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి నిజంగా ఉపయోగకరంగా మార్చడంలో మేధస్సు, హేతుబద్ధత, నిర్ణయం తీసుకునే సామర్థ్యాల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆయన... పౌరులందరి సంక్షేమం కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోగల మార్గాలను అన్వేషించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రాచీన గ్రంథంలోని శ్లోకాన్ని ఉటంకిస్తూ మేధస్సుకు గల అద్భుత లక్షణాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు:
"మేధస్సు, హేతుబద్ధత, నిర్ణయం తీసుకోగల సామర్థ్యాలు శాస్త్ర, సాంకేతికతలను ప్రజలకు ఉపయోగకరంగా చేస్తాయి. అందరి ప్రయోజనం కోసం ఏఐని సద్వినియోగం చేసుకోగల మార్గాలను అన్వేషించడమే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు లక్ష్యం.
శుశ్రూష శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ।
ఊహాపోహోహృథవిజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణః॥”
(అంటే తెలుసుకోవాలనే ఆసక్తి నుంచి ప్రారంభమై, వినడం, అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం, తర్కించడం, సత్యాన్ని గ్రహించడం వరకు అన్నీ మేధస్సుకు గల అద్భుత లక్షణాలు)
— Narendra Modi (@narendramodi) February 17, 2026


