‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0’లో యువత చురుకుగా పాల్గొనాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కోరారు. దేశ నిర్మాణానికి దోహపడేందుకు ఇదొక విలువైన అవకాశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజనులంతా పాల్గొని, అభివృద్ధి చెందిన భారత్ కోసం ఆలోచనలను పంచుకోవాలని ప్రధానమంత్రి కోరారు. ముందుగా నిర్వహించే ప్రత్యేక క్విజ్ పోటీలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని యువతకు విన్నవించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“ దేశ నిర్మాణానికి దోహదపడేందుకు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2.0 ఒక గొప్ప అవకాశం. మన యువత ఆలోచనలు, లోతైన పరిశీలనలు వికసిత్ భారత్‌ను సాకారం చేసుకునే మార్గాన్ని చూపుతాయి.
ఈ కార్యక్రమంలో చేరాలంటే ముందుగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ క్విజ్ పోటీలో పాల్గొనాలి. మీరందరూ దీనికి హాజరవ్వాలని నేను కోరుకుంటున్నాను”
Viksit Bharat Young Leaders Dialogue 2.0 is a great opportunity for our youth to contribute towards nation building. The ideas and insights of our youth can show the way in building a Viksit Bharat.
— Narendra Modi (@narendramodi) October 27, 2025
The way to take part in this Dialogue is to first participate in this specially…


