ఆజాది కా అమృత్ మహోత్సవ్‌ను బలోపేతం చేసేందుకు డిజిటల్ జ్యోత్పై మన స్వాతంత్ర సమరయోధులకు నివాళులను షేరు్చేయవలసిందిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి వరుస ట్వీట్లు చేస్తూ,
" మన స్వాతంత్ర పోరాట యోధులకు ప్రత్యేక నివాళి!
మన స్వాతంత్ర సమరయోధులకు కృతజ్ఞతాపూర్వక నివాళి తెలియజేస్తూ మీ హృదయపూర్వక సందేశాన్ని తెలియజేసేందుకు డిజిటల్ జ్యోత్ మీకు అవకాశం కల్పిస్తుంది.
ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ లో స్కైబీమ్ లైట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క నివాళితో డిజిటల్ జ్యోత్ మరింత ప్రకాశవంతమౌతుంది. ఈ ప్రత్యేక కృషిలో పాలుపంచుకోండి.ఆజాది కా అమృత్ మహోత్సవ్‌ను బలోపేతం చేయండి.
A special tribute to the heroes of our freedom struggle!
— Narendra Modi (@narendramodi) July 23, 2022
Digital Jyot uses technology and enables you to share a heartfelt message of gratitude to our freedom fighters. https://t.co/0nGXaK0P3g pic.twitter.com/zmV5j6KGJn


