‘ఏక్ వర్ష్ – పరిణామ్ ఉత్కర్ష్’ కార్యక్రమంలో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వహణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 17న రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వం ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకొన్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఏక్ వర్ష్ - పరిణామ్ ఉత్కర్ష్’ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.  రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇంధనం, రహదారులు, రైల్వేలు, నీటికి సంబంధించిన, రూ.46,300 కోట్లకు పైగా విలువైన 24 ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

 

ప్రధానమంత్రి రూ.11,000 కోట్లకన్నా ఎక్కువ విలువైన 9 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిలో 7 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులతోపాటు 2 రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులున్నాయి. ఆయన రూ.35,300 కోట్లకు పైగా విలువైన 15 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు. ఇవి కాకుండా మరో 6 రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. 

 

ఈ కార్యక్రమం వేదికగా ప్రారంభించే ప్రాజెక్టుల్లో నవ్‌నేరా ఆనకట్ట, స్మార్ట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ అండ్ అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రాజెక్టులు, భీల్‌డీ- సమ్‌దడీ-లూనీ--జోధ్‌పూర్ – మెడ్‌తా రోడ్- – డేగానా- రతన్‌గఢ్ సెక్షన్ రైలుమార్గ విద్యుదీకరణతోపాటు ఢిల్లీ- వడోదరా గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్ కు చెందిన ప్యాకేజ్ 12 (ఎన్‌హెచ్-148ఎన్)భాగంగా ఉన్నాయి.  మేజ్ నది పైన ప్రధాన వంతెన ప్రాజెక్టు  సహా జంక్షన్ వరకు ఉన్న ప్రాజెక్టు (ఎస్‌హెచ్-37ఏ)లో మరో భాగం సైతం ప్రాజెక్టుల్లో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టులు ప్రజలకు సులభమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావడంలో, ప్రధానమంత్రి సూచించిన హరిత ఇంధన సాధన ఆశయానికి అనుగుణంగా రాష్ట్ర ఇంధన అవసరాల్ని తీర్చడంలో సాయపడనున్నాయి.

 

ప్రధాని రాంగఢ్ బరాజ్, మహల్‌పూర్ బరాజ్ వ్యవస్థ నిర్మాణం కోసం రూ. 9,400 కోట్లకు పైగా ఖర్చుతో చంబల్ నదిపై నవ్‌నేరా ఆనకట్ట నుంచి బీసల్‌పూర్ ఆనకట్ట నిర్మాణ పనులకు, అలాగే ఈసర్‌దా ఆనకట్ట వరకు  ఒక కాలవ ద్వారా నీటిని పంపేందుకు ఉద్దేశించిన ఒక వ్యవస్థ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

 

ప్రభుత్వ కార్యాలయాల భవనాలపైన సౌర ఇంధన ఫలకాల్ని ఏర్పాటుచేయడం, బికనేర్‌లోని పూగల్‌లో 2000 మెగావాట్ల సామర్థ్యంతో ఒక సోలార్ పార్క్‌ను, ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఉండే రెండు దశల సోలార్ పార్కుల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ధోల్‌పూర్‌లోని సాయీపావ్ నుంచి భరత్‌పూర్-డీగ్-కుమ్హేర్-నగర్-కామాన్‌, పహాడీల వరకు తాగునీటి సరఫరా మార్గాన్ని నిర్మించడం, అలాగే చంబల్-ధోల్‌పూర్-భరత్‌పూర్ రెట్రోఫిట్టింగ్ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. లూనీ- సమ్‌దడీ- భీల్‌డీ డబల్ లైన్, అజ్మీర్ - చందేరియా డబల్ లైన్‌లతోపాటు జైపూర్-  సవాయి మాధోపూర్ డబల్ లైన్ రైల్వే ప్రాజెక్టుల పనులకు, ఇంధన ప్రసారానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 జనవరి 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi