మాండ్యలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించనున్న ప్రధాని
శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠానికి 71వ పీఠాధిపతి అయిన శ్రీశ్రీశ్రీ డా. బాలగంగాధరనాథ మహాస్వామీజీ స్మారకార్థం శ్రీ గురు భైరవైక్య మందిర నిర్మాణం
‘సౌందర్యలహరి, శివమహిమ్న స్తోత్రం’ గ్రంథాన్ని మాజీ ప్రధాని శ్రీ హెచ్.డి. దేవెగౌడతో కలిసి ఆవిష్కరించనున్న ప్రధాని శ్రీ మోదీ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఏప్రిల్ 15న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో మాండ్యా జిల్లాలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ పర్యటన సందర్భంగా.. మాజీ ప్రధానమంత్రి శ్రీ హెచ్.డి. దేవెగౌడతో కలిసి ‘సౌందర్యలహరి, శివమహిమ్న స్తోత్రం’ అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంయుక్తంగా ఆవిష్కరిస్తారు.

శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠానికి 71వ పీఠాధిపతి అయిన శ్రీశ్రీశ్రీ డా. బాలగంగాధరనాథ మహాస్వామీజీ స్మారకార్థం శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని నిర్మించారు. దివంగత మహాస్వామీజీ జీవిత విశేషాలనూ, వారి మహోన్నత పరంపరనూ చాటేలా.. సంప్రదాయ ద్రవిడ వాస్తుశైలిలో ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరం పూజనీయ క్షేత్రం మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం కూడా.

శ్రీ శ్రీ శ్రీ బాలగంగాధరనాథ మహాస్వామీజీ అనేక విద్యాసంస్థలను, ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి జీవితాంతం సమాజ సేవకే అంకితమయ్యారు. సమాజసేవనే అత్యున్నతమైన దైవసేవగా బలంగా విశ్వసించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సాగిన ఆయన బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance

Media Coverage

India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 ఆగష్టు 2026
August 27, 2026

Make in India Goes Global: Engineering Boom, Rice Triumph & EU FTA Breakthrough Under PM Modi