షేర్ చేయండి
 
Comments
ప్రధానమంత్రి 3,650 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల లో కొన్నిటిని ప్రారంభించి, మరికొన్నిటికిశంకుస్థాపన చేయనున్నారు
ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్ ను ప్రారంభించనున్నప్రధాన మంత్రి; దీనికి శంకుస్థాపన చేసింది కూడా ఆయనే
ప్రధానమంత్రి 1690 కోట్లరూపాయల కు పైగా విలువ కలిగిన నాలుగు దోవ ల జాతీయ రహదారి ప్రాజెక్టు కు శంకుస్థాపన చేస్తారు
ఈప్రాజెక్టు తో ఆ ప్రాంతం లో పారిశ్రామిక అభివృద్ధి కి మరియు పర్యటన రంగాని కి ప్రోత్సాహంలభిస్తుంది
నాలాగఢ్ లో మెడికల్ డివైస్ పార్కు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయడం తో పాటుబంద్ లా లో గవర్నమెంట్ హైడ్రో ఇంజినీరింగ్కాలేజీ ని ప్రారంభించనున్నారు
కుల్లూదసరా ఉత్సవాల లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 అక్టోబరు 5వ తేదీ న హిమాచల్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. అక్కడ ఆయన 3,650 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన ప్రాజెక్టుల లో కొన్నిటి ని ప్రారంభించడమే కాకుండా, మరికొన్నిటి కి శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఉదయం పూట ఇంచుమించు 11:30 గంటల వేళ లో ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. తదనంతరం, ఆయన మధ్యాహ్నం సుమారు 12 గంటల 45 నిమిషాల వేళ లో బిలాస్ పుర్ లో లుహ్ నూ మైదానాని కి చేరుకొంటారు. అక్కడ అనేక అభివృద్ధి పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిటి కి శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఒక సార్వజనిక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు కూడాను. ప్రధాన మంత్రి మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల 15 నిమిషాల వేళ లో కుల్లూ లోని ఢాల్ పుర్ గ్రౌండు కు చేరుకొని అక్కడ జరిగే కుల్లూ దసరా కార్యక్రమం లో పాల్గొంటారు.

ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్

ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్ ప్రారంభ కార్యక్రమం దేశవ్యాప్తం గా ఆరోగ్య సేవల ను పటిష్టపరచాలనే ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణాన్ని మరియు సంకల్పాన్ని మరో సారి కళ్ల కు కట్టనుంది. ప్రధాన మంత్రి 2017వ సంవత్సరం అక్టోబరు లో దీనికి శంకుస్థాపన కూడా తనే చేశారు. కేంద్ర రంగ పథకం అయినటువంటి ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన లో భాగం గా దీనిని ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

ఎఐఐఎమ్ఎస్ బిలాస్ పుర్ నిర్మాణాని కి 1470 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు అయింది. ఈ అత్యాధునిక ఆసుపత్రి లో 18 స్పెశిలలిటీ విభాగాలు, 17 సూపర్ స్పెశియలిటీ విభాగాలు, 18 మాడ్యూలర్ ఆపరేశన్ థియేటర్ లు, 64 ఐసియు పడకల తో సహా 750 పడక లు ఉన్నాయి. ఈ ఆసుపత్రి 247 ఎకరాల లో విస్తరించి ఉంది. ఇది 24 గంటల అత్యవసర స్థితి మరియు డాయెలిసిస్ సదుపాయాలు, అల్ట్రసోనోగ్రఫి, సిటి స్కాన్, ఎమ్ఆర్ఐ వంటి అధునాతన రోగ నిర్ణయకారి యంత్రాలు, అమృత్ ఫార్మసి మరియు జన్ ఔషధీ కేంద్ర తో పాటు 30 పడకల తో కూడిన ఆయుష్ బ్లాకు తో రూపొందింది. ఆసుపత్రి లో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆదివాసి ప్రాంతాలు మరియు, చేరుకోవడం కష్టమైన మారుమూల ప్రాంతాల లో స్వాస్థ్య సేవల ను అందించడం కోసం తోడ్పడే సెంటర్ ఫార్ డిజిటల్ హెల్థ్ ను కూడా ఏర్పాటు చేయడమైంది. అంతేకాక కాజా, సలూనీ మరియు కెలాంగ్ ల వంటి దుర్గమమైన ఆదివాసీ ప్రాంతాలు, ఎక్కువ ఎత్తు లో ఉండేటటువంటి హిమాలయ ప్రాంతాల లో ఆరోగ్య శిబిరాల ను నిర్వహించి ఆసుపత్రి ద్వారా స్పెశలిస్ట్ స్వాస్థ్య సేవల ను ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ ఆసుపత్రి లో ఏటా ఎమ్ బిబిఎస్ కోర్సు కోసం 100 మంది విద్యార్థుల ను మరియు నర్సింగ్ కోర్సుల కోసం 60 మంది విద్యార్థుల కు ప్రవేశం కల్పించడం జరుగుతుంది.

అభివృద్ధి పథకాలు

ప్రధాన మంత్రి ఎన్ హెచ్ -105 లో పింజౌర్ నుండి నాలాగఢ్ వరకు దాదాపు గా 31 కిలో మీటర్ లపొడవైన జాతీయ రహదారి ని నాలుగు దోవ లు కలిగింది గా తీర్చిదిద్దే ప్రాజెక్టు కు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు 1690 కోట్ల రూపాయల కు పైబడి ఉంటుంది. ఈ ప్రాజెక్టు రోడ్డు అంబాలా, చండీగఢ్, పంచ్ కుల, సోలన్/శిమ్ లా ల నుండి బిలాస్ పుర్ కు, మండీ కి మరియు మనాలీ వైపునకు పోయే ట్రాఫిక్ కు ఒక ప్రధానమైన లంకె గా ఉంటుంది. నాలుగు దోవల జాతీయ రహదారి లో ఇంచుమించు 18 కి. మీ. భాగం హిమాచల్ ప్రదేశ్ లో ఉంటే, మిగిలిన భాగం హరియాణా లో ఉంటుంది. ఈ హైవే హిమాచల్ ప్రదేశ్ లో పారిశ్రామిక కేంద్రం అయినటువంటి నాలాగఢ్-బద్దీ లో ఉత్తమమైన రవాణా సౌకర్యాల కు పూచీపడటం తో పాటు గా ఆ ప్రాంతం లో పారిశ్రామికాభివృద్ధి కి గతి ని కూడా అందించనుంది. దీని తో రాష్ట్రం లో పర్యటన కు కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

ప్రధాన మంత్రి నాలాగఢ్ లో మెడికల్ డివైస్ పార్కు కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కు ను సుమారు 350 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. ఈ మెడికల్ డివైస్ పార్కు లో పరిశ్రమల ను ఏర్పాటు చేయడం కోసం 800 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రాల (ఎంఒయు) పై ఇప్పటికే సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు ఆ ప్రాంతం లో ఉపాధి అవకాశాల ను చెప్పుకోదగ్గ స్థాయి లో పెంపొందింపచేయనుంది.

ప్రధాన మంత్రి బంద్ లా లో గవర్నమెంట్ హైడ్రో ఇంజినీరింగ్ కాలేజీ ని కూడా ప్రారంభించనున్నారు. ఈ కళాశాల నిర్మాణాని కి 140 కోట్ల రూపాయల ఖర్చు అయింది; జల విద్యుత్తు పథకాల కు శిక్షణ ను పొందినటువంటి శ్రమ శక్తి ని అందుబాటు లోకి తీసుకు రావడం లో ఈ కళాశాల దోహదం చేయనుంది. హిమాచల్ ప్రదేశ్ జల విద్యుత్తు ప్రాజెక్టుల లో అగ్రగామి రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా ఉంది. ఈ కళాశాల యువత కు నైపుణ్యాల కు మెరుగు లు దిద్దుకోవడం లోను, జలవిద్యుత్తు రంగం లో కావలసినంత ఉద్యోగ అవకాశాల కల్పన కు సాయపడనుంది.

కుల్లూ దసరా

అంతర్జాతీయ కుల్లూ దసరా మహోత్సవాన్ని 2022 అక్టోబరు 5వ తేదీ మొదలుకొని 11వ తేదీ వరకు కుల్లూ లోని ఢాల్ పుర్ మైదానం లో నిర్వహించడం జరుగుతుంది. లోయ లోని 300 కు పైగా దేవీ దేవత లు ఒక చోటు కు రావడం అనేది ఈ మహోత్సవం యొక్క విశిష్టత అని చెప్పాలి. మహోత్సవం లో ఒకటో రోజు న, చక్కగా అలంకరించినటువంటి పల్లకీల లో బయలుదేరే దేవత లు ముఖ్య దైవం భగవాన్ రఘునాథ్ జీ యొక్క ఆలయం లో వాటి వందనాన్ని ఆచరించి, అటు తరువాత ఢాల్ పుర్ మైదానాని కి పయనిస్తాయి. చరిత్రాత్మకమైనటువంటి కుల్లూ దసరా ఉత్సవాల లో ప్రధాన మంత్రి ఈ దివ్య రథయాత్ర ను మరి అలాగే దేవతల మహా కూటమి ని వీక్షించనున్నారు. దేశ ప్రధాన మంత్రి కుల్లూ దసరా ఉత్సవాల లో పాలుపంచుకోవడం ఇదే తొలిసారి కానుంది.

 

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India ‘Shining’ Brightly, Shows ISRO Report: Did Modi Govt’s Power Schemes Add to the Glow?

Media Coverage

India ‘Shining’ Brightly, Shows ISRO Report: Did Modi Govt’s Power Schemes Add to the Glow?
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM highlights Rashtrapati Ji's address to both Houses of Parliament
January 31, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has highlighted Rashtrapati Smt Draupadi Murmu’s address to both Houses of Parliament.

The Prime Minister tweeted;

“Rashtrapati Ji's address to both Houses of Parliament covered a wide range of topics, giving an in-depth picture of the transformative changes taking place across sectors. She highlighted how common citizens have been empowered and 'Ease of Living' furthered. “