షేర్ చేయండి
 
Comments
ఒక వేయి కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేకప్రాజెక్టుల ను సాబర్ కాంఠా లోని సాబర్ డెయరి లో ప్రారంభించడం/ శంకుస్థాపనచేయనున్న ప్రధాన మంత్రి
ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు అండగానిలవనున్నాయి; ఈ ప్రాజెక్టు లు స్థానిక రైతుల మరియు పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచడం లోనూ సహాయకారి కానున్నాయి
నలభై నాలుగో చెస్ ఒలింపియాడ్ ప్రారంభం అయిందని ప్రకటన చేయనున్న ప్రధాన మంత్రి
భారతదేశం లో మొట్టమొదటిసారిగా చెస్ ఒలింపియాడ్ ను నిర్వహించడం జరుగుతున్నది; భారతదేశం ఈ పోటీల లో తన అతి పెద్దజట్టు ను రంగం లోకి దించుతున్నది
అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవాని కి హాజరు కానున్న ప్రధాన మంత్రి
ఐఎఫ్ఎస్ సిఎ ప్రధాన కేంద్రానికి గాంధీనగర్ లోని జిఐఎఫ్ టి సిటీ లోప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
భారతదేశం యొక్క ఒకటో అంతర్జాతీయ బులియన్ ఎక్చేంజ్ - ఐఐబిఎక్స్ ను కూడా జిఐఎఫ్ టి సిటీ లో ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 28వ, 29వ తేదీల లో గుజరాత్ ను మరియు తమిళ నాడు ను సందర్శించనున్నారు. జులై 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వేళ లో సాబర్ కాంఠా లోని గఢోడా చౌకీ ప్రాంతం లో సాబర్ డెయరి కి చెందిన అనేక ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించడమే కాకుండా మరికొన్ని పథకాల కు శంకుస్థాపన ను కూడా చేయనున్నారు. అటు తరువాత ప్రధాన మంత్రి చెన్నై కు పోయి సాయంత్రం సుమారు 6 గంటల వేళ కు చెన్నై లోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియమ్ లో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభం అయినట్లు గా ప్రకటిస్తారు.

జులై 29వ తేదీ న ఉదయం ఇంచుమించు 10 గంటల వేళ కు, ప్రధాన మంత్రి అన్నా యూనివర్సిటీ యొక్క 42వ స్నాతకోత్సవంలో పాలుపంచుకొంటారు. ఆ తరువాత ఆయన గాంధీనగర్ కు ప్రయాణమవుతారు. గాంధీనగర్ లోని జిఐఎఫ్ టి సిటీ (‘గిఫ్ట్ సిటీ’) లో ఇంచుమించు సాయంత్రం 4 గంటల వేళ కు ఆయన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటుగా మరికొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేస్తారు.

గుజరాత్ లో ప్రధాన మంత్రి

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఊతాన్ని అందించడం తో పాటు గా వ్యవసాయాన్ని మరియు సంబంధిత కార్యకలాపాల ను మరింత ఫలప్రదం గా తీర్చిదిద్దడం పట్ల ప్రభుత్వం శ్రద్ధ ను తీసుకొంటూ వస్తున్నది. ఈ దిశ లో వేసిన మరొక అడుగా అన్నట్లు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాబర్ డెయరి ని సందర్శించి 1,000 కోట్ల రూపాయల పై చిలుకు విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించడం/ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు స్థానిక రైతుల, పాల ఉత్పత్తిదారుల సశక్తీకరణ తో పాటు వారి ఆదాయం వృద్ధి చెందేందుకు తోడ్పడనున్నాయి. ఇది ఆ ప్రాంతం లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఒక ఉత్తేజాన్ని కూడా అందిస్తుంది.

సాబర్ డెయరి లో దాదాపుగా రోజుకు 120 మిలియన్ టన్నుల (ఎమ్ టిపిడి) సామర్థ్యాన్ని కలిగి ఉండే ఒక పౌడర్ ప్లాంటు ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 300 కోట్ల రూపాయల కు పైనే ఉంటుంది. ఈ ప్లాంటు యొక్క లే అవుట్ ప్రపంచ ఆహార భద్రత ప్రమాణాల కు తుల తూగుతుంది. ఇది దాదాపు గా సున్నా స్థాయి ఉద్గారం తో కూడి ఉండి, శక్తి ని చాలావరకు ఆదా చేస్తుంది కూడాను. ఈ ప్లాంటు లో అత్యధునాతనమైనటువంటి మరియు పూర్తి గా యంత్రాల పై ఆధారపడి పని చేసేటటువంటి బల్క్ ప్యాకింగ్ లైను ను సమకూర్చడం జరిగింది.

సాబర్ డెయరి లో అసెప్ టిక్ మిల్క్ ప్యాకేజింగ్ ప్లాంటు ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఒక రోజు లో 3 లక్షల లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ప్లాంటు అతి ఆధునికమైనటువంటి ప్లాంటు అని చెప్పాలి. దాదాపు గా 125 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో ఈ ప్రాజెక్టు ను రూపుదిద్దడమైంది. ఈ ప్లాంటు లో శక్తి ని అధిక స్థాయి లో ఆదా చేసేటటువంటి మరియు పర్యావరణ హితకరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం జతపడ్డ అతి ఆధునికమైన ఆటోమేశన్ సిస్టమ్ ఉంది. పాల ఉత్పత్తిదారుల కు మెరుగైన ప్రతిఫలం అందేటట్లు చూడటం లో ఈ ప్రాజెక్టు సహాయకారి కానుంది.

సాబర్ జున్ను మరియు పాల విరుగుడు తేట ను ఎండబెట్టే ప్లాంటు ప్రాజెక్టు నిర్మాణాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం దాదాపు గా 600 కోట్ల రూపాయలు. ఈ ప్లాంటు చెద్దర్ చీజ్ (దీని సామర్థ్యం రోజు కు 20 మిలియన్ టన్ను లు), మొజారెల్లా చీజ్ (దీని సామర్థ్యం రోజు కు రోజు కు 10 మిలియన్ టన్ను లు) లతో పాటు, ప్రోసెస్ డ్ చీజ్ (దీని సామర్థ్యం రోజు కు 16 మిలియన్ టన్ను లు) లను ఉత్పత్తి చేస్తుంది. జున్ను ను తయారు చేసే ప్రక్రియ లో వెలికి వచ్చే పాల విరుగుడు తేట ను వే డ్రయింగ్ ప్లాంటు లో ఎండబెట్టడం జరుగుతుంది; వే డ్రయింగ్ ప్లాంటు రోజు కు 40 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగివుంటుంది.

సాబర్ డెయరి అనేది గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేశన్ (జిసిఎమ్ఎమ్ఎఫ్) లో ఒక భాగం గా ఉంది; ఇది అమూల్ బ్రాండ్ లో భాగం గా పాల ను మరియు పూర్తి శ్రేణి పాల ఉత్పత్తుల ను తయారు చేయడం తో పాటు విక్రయిస్తుంది కూడాను.

జులై 29వ తేదీ నాడు ప్రధాన మంత్రి గాంధీ నగర్ లోని గిఫ్ట్ సిటీ ని సందర్శించనున్నారు. గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్ ఇంటర్ నేశనల్ ఫైనాన్స్ టెక్-సిటీ కి సంక్షిప్త నామం. ఆర్థిక సేవల ను మరియు సాంకేతికపరమైన సేవల ను ఒక్క భారతదేశానికే కాక ప్రపంచాని కి కూడా అందించే ఒక ఏకీకృత కేంద్రం గా దీనిని సంకల్పించడమైంది.

ఇంటర్ నేశనల్ ఫైనాన్శియల్ సర్వీసెస్ సెంటర్స్ ఆథారిరటీ (ఐఎఫ్ఎస్ సిఎ) యొక్క ప్రధాన కేంద్రం నిర్మాణాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది భారతదేశం లో ఇంటర్ నేశనల్ ఫైనాన్శియల్ సర్వీసెస్ సెంటర్స్ (ఐఎఫ్ఎస్ సి స్) లో ఆర్థిక ఉత్పత్తులు, ఆర్థిక సేవలు మరియు ఆర్థిక సంస్థల అభివృద్ధి కి, ఇంకా నియంత్రణ కు ఉద్దేశించినటువంటి ఒక ఐక్య నియంత్రణదారు సంస్థ అన్నమాట. ఈ భవనాన్ని జిఐఎఫ్ టి-ఐఎఫ్ఎస్ సి కి అంతకంతకు వృద్ధి చెందుతున్నటువంటి ప్రాముఖ్యాన్ని, స్థాయి ని దృష్టి లో పెట్టుకొని ఒక ప్రముఖమైన నిర్మాణం గా మలచాలని తలపెట్టడం జరిగింది.

భారతదేశం లో తొలి ఇంటర్ నేశనల్ బులియన్ ఎక్చేంజ్ (ఐఐబిఎక్స్) ను గిఫ్ట్-ఐఎఫ్ఎస్ సి లో ప్రధాన మంత్రి ప్రారంభించబోతున్నారు. భారతదేశం లో బంగారం యొక్క విత్తీకరణ కు ఉత్తేజాన్ని ఇవ్వడం తో పాటు గా, బాధ్యతాయుతమైనటువంటి సోర్సింగ్ కు, నాణ్యత కు భరోసా ను ఇవ్వడం సహా సమర్థమైనటువంటి ధర నిర్ణయాని కి కూడా ఐఐబిఎక్స్ దోహదం చేయనుంది. ప్రపంచ బులియన్ బజారు లో భారతదేశాని కి దక్కవలసిన స్థానాన్ని భారతదేశం చేజిక్కించుకొనేలా ఐఐబిఎక్స్ కొమ్ము కాస్తుంది; అంతేకాక, గ్లోబల్ వేల్యూ చైన్ కు నిజాయతీ ని, నాణ్యత ను సంతరిస్తుంది. ఐఐబిఎక్స్ ప్రపంచ బులియన్ ధరల ను ఒక ప్రధానమైనటువంటి వినియోగదారు దేశం రూపం లో ప్రభావితం చేసే దిశ లో అండగా ఉంటామని భారత ప్రభుత్వం చేసిన వచనబద్ధత ను సైతం ఐఐబిఎక్స్ పరిపుష్టం చేస్తుంది.

ఎన్ఎస్ఇ కి చెందిన ఐఎఫ్ఎస్ సి-ఎస్ జిఎక్స్ కనెక్ట్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇది జిఐఎఫ్ టి ఇంటర్ నేశనల్ ఫైనాన్శియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్ సి) లో నేశనల్ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్ఎస్ఇ) యొక్క అనుబంధ సంస్థ కు మరియు సింగపూర్ ఎక్చేంజ్ లిమిటెడ్ (ఎస్ జిఎక్స్) కు మధ్య ఒక ఫ్రేమ్ వర్క్ అన్నమాట. కనెక్ట్ లో భాగం గా, సింగపూర్ ఎక్చేంజ్ సభ్యులు నిఫ్టీ డెరివేటివ్స్ లో పెట్టే ఆర్డర్ లు అన్నిటిని ఎన్ఎస్ఇ-ఐఎఫ్ఎస్ సి కి మళ్ళించడం తో పాటు ఎన్ఎస్ఇ-ఐఎఫ్ఎస్ సి ఆర్డర్ మేచింగ్ ఎండ్ ట్రేడింగ్ ప్లాట్ ఫార్మ్ లో వాటిని మేచ్ చేయడం జరుగుతుంది. భారతదేశాని కి చెందిన మరియు అంతర్జాతీయ న్యాయాధికార పరిధుల కు చెందిన బ్రోకర్ లు, డీలర్ లు కనెక్ట్ ద్వారా ట్రేడింగ్ డెరివేటివ్స్ లో పెద్ద సంఖ్య లో పాలుపంచుకొంటారన్న ఆశ లు ఉన్నాయి. ఇది జిఐఎఫ్ టి -ఐఎఫ్ఎస్ సి లో డెరివేటివ్ మార్కెట్స్ లో లిక్విడిటీ ని పెంచగలదు. అంతర్జాతీయ ప్రతినిధుల ను మరింత మంది ని ఆకర్షించడం తో పాటు జిఐఎఫ్ టి-ఐఎఫ్ఎస్ సి లోని ఫైనాన్శియల్ ఇకోసిస్టమ్ పై ఒక సకారాత్మకమైనటువంటి ప్రభావాన్ని కూడా ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.

తమిళ నాడు లో ప్రధాన మంత్రి

నలభైనాలుగో చెస్ ఒలింపియాడ్ జులై 28వ తేదీ నాడు ఒక వైభవోపేతమైన ప్రారంభ కార్యక్రమాని కి సాక్షి కానుంది; ఆ రోజు న చెన్నై లోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియమ్ లో నిర్వహించే ఒక ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, చెస్ ఒలింపియాడ్ మొదలైంది అనే ప్రకటన ను చేస్తారు.

ప్రప్రథమ ‘చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే’ ను సైతం ప్రధాన మంత్రి ఈ సంవత్సరం లో జూన్ 19వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ నేశనల్ స్టేడియమ్ లో ప్రారంభించారు. ఈ కాగడా స్విట్జ‌ర్ లాండ్ లోని ఎఫ్ఐడిఇ (‘ ఫిడే ’) కేంద్ర కార్యాలయాని కి బయలుదేరి పోయే కంటే ముందు గా, 40 రోజుల తరబడి దేశం లో 75 ప్రముఖ ప్రదేశాల గుండా ప్రయాణించింది; ఇది మొత్తం సుమారు 20,000 కిలో మీటర్ లు చుట్టి, మహాబలిపురాని కి చేరుకొంది.

నలభై నాలుగో చెస్ ఒలింపియాడ్ ను 2022 జులై 28 వ తేదీ మొదలుకొని ఆగస్టు 9వ తేదీ మధ్య కాలం లో చెన్నై లో నిర్వహించనున్నారు. 1927వ సంవత్సరం లో మొదలైన ఈ ప్రతిష్టాత్మక పోటీల ను భారతదేశం లో తొలిసారి గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అంతేకాదు, ఈ పోటీ లు 30 సంవత్సరాల అనంతరం ఆసియా లో ఏర్పాటవుతున్నాయి. 187 దేశాలు ఈ చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంటున్నాయి. మరే చెస్ ఒలింపియాడ్ లోనూ ఇన్ని దేశాలు పాలుపంచుకోలేదు. భారతదేశం సైతం ఈ పోటీలలో ఇంతకు ముందు ఎన్నడు లేనంతగా అతి పెద్ద దళాన్ని రంగం లో మోహరిస్తున్నది. 6 జట్ల లో 30 మంది క్రీడాకారులు భారతదేశం తరఫున పోటీపడనున్నారు.

ప్రతిష్టాత్మక అన్నా యూనివర్సిటీ యొక్క 42వ స్నాతకోత్సవం జులై 29వ తేదీ నాడు చెన్నై లో జరుగనుండగా, ఆ కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరు అవుతున్నారు. ఈ కార్యక్రమం లో, ఆయన 69 మంది స్వర్ణ పతక విజేతల కు బంగారు పతకాల ను మరియు ధ్రువపత్రాల ను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు కూడాను.

అన్నా యూనివర్సిటీ ని 1978వ సంవత్సరం లో సెప్టెంబర్ 4వ తేదీ నాడు స్థాపించడం జరిగింది. దీనికి తమిళ నాడు పూర్వ ముఖ్యమంత్రి శ్రీ సి.ఎన్. అన్నా దురై పేరు ను ఈ విశ్వవిద్యాలయానికి పెట్టారు. ఈ విశ్వవిద్యాలయానికి తమిళ నాడు లో 13 కళాశాలలు, 494 అనుబంధ కళాశాల లతో పాటు తిరునెల్ వేలి, మదురై, కోయంబత్తూరు లలో మూడు ప్రాంతీయ ప్రాంగణాలు ఉన్నాయి.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
Why 10-year-old Avika Rao thought 'Ajoba' PM Modi was the

Media Coverage

Why 10-year-old Avika Rao thought 'Ajoba' PM Modi was the "coolest" person
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM praises float-on - float-off operation of Chennai Port
March 28, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has praised float-on - float-off operation of Chennai Port which is a record and is being seen an achievement to celebrate how a ship has been transported to another country.

Replying to a tweet by Union Minister of State, Shri Shantanu Thakur, the Prime Minister tweeted :

"Great news for our ports and shipping sector."