ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు
ప్రపంచ చమురు & గ్యాస్ సిఇఒ లతో మరియు నిపుణుల తో ప్రధాన మంత్రి సమావేశమై మాట్లాడుతారు
‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో 1330 కోట్ల రూపాయల కు పైగా విలువకలిగిన ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం తో పాటు, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
నేశనల్ ఇన్స్‌ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా యొక్క శాశ్వత భవన సముదాయాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
రోజ్‌గార్ మేళా లో భాగం గా వేరు వేరు విభాగాల లోక్రొత్త గా నియామకం జరిగిన 1930 మంది ప్రభుత్వ ఉద్యోగుల కు నియామక ఉత్తర్వుల నుఅందజేయనున్న ప్రధాన మంత్రి

గోవా ను 2024 ఫిబ్రవరి 6 వ తేదీ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. ఒఎన్‌జిసి సీ సర్‌వైవల్ సెంటరు ను ఉదయం పూట దాదాపు గా పది గంట ల ముప్ఫయ్ నిమిషాల వేళ లో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు; ఆ తరువాత ఉదయం పూటనే సుమారు 10 గంటల 45 నిమిషాల వేళ లో ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ఆయన ‘వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో భాగం గా ప్రారంభిస్తారు. దీని అనంతరం, మధ్యాహ్నం పూట సుమారు 2 గంటల 45 నిమిషాల వేళ లో ఆయన వికసిత్ భారత్, వికసిత్ గోవా 2047’ కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.

ఇండియా ఎనర్జీ వీక్ 2024

శక్తి అవసరాల పరం గా స్వయం సమృద్ధి ని సాధించాలన్నది ప్రధాన మంత్రి విశేష శ్రద్ధ తీసుకొంటున్న రంగాల లో ఒక రంగం గా ఉంది. ఈ దిశ లో వేసే మరొక అడుగా అన్నట్లు గా, ‘ఇండియా ఎనర్జీ వీక్ 2024’ ను ఫిబ్రవరి 6 వ తేదీ మొదలుకొని 9వ తేదీ వరకు గోవా లో నిర్వహించడం జరుగుతుంది. ఇది భారతదేశం లో కెల్లా అతి పెద్దది అయినటువంటి మరియు ఎనర్జీ ఎగ్జిబిశన్ తో పాటు సమావేశం కూడా కలసి ఉండేటటువంటి ప్రత్యేక కార్యక్రమం కానుంది; ఈ సందర్భం లో ఎనర్జీ వేల్యూ చైన్ అంతటినీ ఒక చోటు కు చేర్చడం జరుగుతుంది; మరి, ఈ కార్యక్రమం భారతదేశం యొక్క శక్తి సంబంధి పరివర్తన లక్ష్యాల కు ఒక ఉత్ప్రేరకం మాదిరి గా పని చేస్తుంది. ప్రధాన మంత్రి గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ సిఇఒ లతోను మరియు నిపుణుల తోను ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

 

స్టార్ట్-అప్స్ ను ప్రోత్సహించడం మరియు వాటిని ఎనర్జీ వేల్యూ చైన్ తో కలపడం ఇండియా ఎనర్జీ వీక్ 2024 యొక్క ప్రధాన ధ్యేయం. ఈ కార్యక్రమాని కి వివిధ దేశాల నుండి దాదాపు గా 17 మంది శక్తి శాఖ మంత్రులు, 35,000 కు పైగా పాలుపంచుకోనున్నారు. కార్యక్రమం లో 900 కు మించిన ప్రదర్శన భాగస్వాములు కూడా పాల్గొంటారన్న అంచనా ఉంది. ఇందులో ఆరు దేశాలు కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రశ్యా, యుకె మరియు యుఎస్ఎ మండపాల ను ఏర్పాటు చేయనున్నాయి. భారతదేశాని కి చెందిన సూక్ష్మ, లఘు మధ్యతరహా వాణిజ్య సంస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) లు శక్తి రంగం కోసం నూతనం గా ఆవిష్కరించిన పరిష్కార మార్గాల ను వివరించే ఒక విశిష్టమైన మేక్ ఇన్ ఇండియా మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

 

వికసిత్ భారత్వికసిత్ గోవా 2047

గోవా లో ఒక సార్వజనిక కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొని, 1310 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన చేయనున్నారు.

 

నేశనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా యొక్క శాశ్వత భవన సముదాయాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు; దానిని దేశ ప్రజల కు అంకితం చేస్తారు. క్రొత్త గా నిర్మాణం పూర్తి అయిన ఈ యొక్క కేంపస్ లో విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బంది అవసరాల ను తీర్చడం కోసం ట్యుటోరియల్ కాంప్లెక్స్, డిపార్ట్‌మెంటల్ కాంప్లెక్స్, సెమినార్ కాంప్లెక్స్, అడ్ మినిస్ట్రటివ్ కాంప్లెక్స్ లతో పాటు వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రం, సిబ్బంది నివాస సముదాయం, అమినిటీ సెంటర్, క్రీడా మైదానం, ఇంకా ఇతర విభిన్న సౌకర్యాల ను సిద్ధపరచడమైంది.

 

నేశనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ తాలూకు క్రొత్త కేంపసు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ సంస్థ లో ప్రజల కు మరియు సాయుధ దళాల వారి కి జల ప్రధానమైన క్రీడలు మరియువ జల సంబంధి రక్షణ కార్యకలాపాల ను ప్రోత్సహించాలనే లక్ష్యం తో 28 విశిష్ట పాఠ్యక్రమాలను మొదలుపెట్టడం జరుగుతుంది. ఒక వంద టిపిడి సామర్థ్యం కలిగిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ ని కూడా దక్షిణ గోవా లో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. దీని ని 60 టిపిడి మేరకు తడి వ్యర్థాలు మరియు 40 టిపిడి మేరకు పొడి వ్యర్థాల ను శాస్త్ర విజ్ఞాన ప్రధానమైన పద్ధతిలో శుద్ధి చేయడం కోసం రూపొందించడం జరిగింది. దీనిలో 500 కెడబ్ల్యు సామర్థ్యాన్ని కలిగి ఉండేటటువంటి సౌర విద్యుత్తు ప్లాంటు కూడా ఉంటుంది. ఇది మిగులు విద్యుత్తు ను ఉత్పత్తి చేయగలదు.

 

ప్రధాన మంత్రి పణజి ని మరియు రీస్ మేగోస్ ను కలిపే పర్యటన కార్యకలాపాలతో పాటు గా పేసింజర్ రోప్ వే కు ప్రధాన మంత్రి శంకుస్థాపన ను చేయనున్నారు. ఒక వంద ఎమ్ఎల్‌డి సామర్థ్యం కలిగివుండేటటువంటి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటు ను దక్షిణ గోవా లో నిర్మించడాని కి శంకుస్థాపన ను కూడా ఆయన చేయనున్నారు.

 

రోజ్ గార్ మేళా లో భాగం గా వేరు వేరు విభాగాల లో క్రొత్త గా నియామకం జరిగిన 1930 మంది అభ్యర్థుల కు నియామకపు ఉత్తర్వుల ను కూడా ప్రధాన మంత్రి ఇవ్వనున్నారు. వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల కు స్వీ కృతి లేఖల ను కూడా అందిస్తారు.

 

ఒఎన్‌జిసి సీ సర్‌వైవల్ సెంటర్

ఒఎన్‌జిసి సీ సర్‌వైవల్ సెంటరు ను దాని కోవ కు చెందిన అద్వితీయమైన ఇంటిగ్రేటెడ్ సీ సర్‌వైవల్ ట్రైనింగ్ సెంటరు వలె ప్రపంచ ప్రమాణాల కు తులతూగేటట్లు గా అభివృద్ధి పరచడమైది. దీనిలో ఒక్కో సంవత్సరం లో పదివేల మంది నుండి పదిహేను వేల మంది వరకు శ్రమికుల కు శిక్షణ ను ఇవ్వవచ్చును. దీని ద్వారా సిమ్యులేటెడ్ మరియు కంట్రోల్డ్ హార్శ్ వెదర్ స్థితుల లో అభ్యాసాలు శిక్షణ లో ఉన్న అభ్యర్థుల కు సముద్ర జీవనం తాలూకు నైపుణ్యా లను వృద్ధి చెందింప చేయగలవు. అలాగే, ఒకవేళ ప్రమాదాలు తలెత్తితే వాటి బారి నుండి సురక్షితం గా ఉండే అవకాశాలు కూడా పెరగవచ్చు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India among top nations on CEOs confidence on investment plans: PwC survey

Media Coverage

India among top nations on CEOs confidence on investment plans: PwC survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 జనవరి 2025
January 21, 2025

Appreciation for PM Modi’s Effort Celebrating Culture and Technology