స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థల వైపునకు మళ్ళడం అనే అంశం ఈ సమావేశానికి ఇతివృత్తంగా ఉంది
ఈ సమావేశం స్థిరమైన వ్యవసాయ-ఆహార వ్యవస్థలు, ఇంకా డిజిటల్ అగ్రికల్చర్ లో ముందంజలు సహా, భారతదేశ వ్యావసాయిక పురోగతిని కళ్లకు కడుతుంది
సుమారు 75 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు

వ్యవసాయ ఆర్థికవేత్తల ముప్ఫై రెండో అంతర్జాతీయ సమావేశాన్ని (ఐసిఎఇ) శనివారం, అంటే 2024 ఆగస్టు 3న, న్యూ ఢిల్లీ లోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ (ఎన్ఎఎస్‌సి) కాంప్లెక్స్ లో ఉదయం సుమారు 9 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

ఇంటర్‌నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకానమిస్ట్ స్ ఆధ్వర్యంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటయ్యే ఈ సమావేశాన్ని 2024 ఆగస్టు 2 - 7 తేదీల మధ్య నిర్వహించనున్నారు. ఐసిఎఇ కి భారతదేశం 65 సంవత్సరాల తరువాత వేదిక అవుతోంది.

ఈ సంవత్సరంలో నిర్వహించనున్న సమావేశానికి ‘‘ట్రాన్స్‌ఫర్మేషన్ టువార్డ్స్ సస్‌టేనబుల్ అగ్రి-ఫుడ్ సిస్టమ్స్’’ (స్థిరమైన వ్యవసాయ-ఆహార వ్యవస్థ వైపునకు మళ్ళడం) ఇతివృత్తంగా ఉంది. వాతావరణంలో మార్పులు, ప్రాకృతిక వనరుల క్షీణత, ఉత్పత్తి ఖర్చులు ఎగబాకుతూ ఉండడం, సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్ళ నేపథ్యంలో స్థిర వ్యవసాయం సంబంధ ముఖ్యావసరాన్ని తీర్చుకోవాలనేది ఈ సమావేశం లక్ష్యంగా ఉంది. ప్రపంచంలో వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్ళను గురించి ముందస్తు ఆలోచనలను చేస్తూ, వాటి పరిష్కారానికి తగిన దృష్టి కోణాన్ని అనుసరిస్తున్న భారతదేశ వైఖరితో పాటు వ్యవసాయ సంబంధ పరిశోధనలు, వ్యవసాయ సంబంధ విధానాలలో దేశం సాధిస్తున్న పురోగతిని ఈ సమావేశం ప్రముఖంగా చాటిచెప్పనుంది.

యువ పరిశోధకులు, అగ్రగామి వృత్తి నిపుణులు వారి కృషిని వెల్లడించేందుకు ప్రపంచంలో తమ సమకాలికులతో సంబంధాలను ఏర్పరచుకొనేందుకు ఒక వేదికగా ఐసిఎఇ 2024 ఉంటుంది. ఈ సమావేశం పరిశోధక సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు మధ్య భాగస్వామ్యాలను బలపరచడం, జాతీయ, ప్రపంచ స్థాయిలలో విధాన రూపకల్పనను ప్రభావితం చేయడంతో పాటు భారతదేశంలో డిజిటల్ అగ్రికల్చర్, స్థిరమైన వ్యవసాయ-ఆహార వ్యవస్థల పరంగా నమోదైన పురోగతి లు సహా వ్యవసాయ రంగంలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని కళ్ళకు కట్టడం సమావేశం లక్ష్యంగా ఉంది. సుమారు 75 దేశాల నుంచి సుమారు ఒక వేయి మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
GIFT City scales new heights as India's 1st international finance and IT hub

Media Coverage

GIFT City scales new heights as India's 1st international finance and IT hub
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 మార్చి 2026
March 30, 2026

Mann Ki Baat to Mission Mode: How PM Modi's Initiatives Spark Hope in Health, Innovation, Security & Nature