ప్రాంతీయ సంధానాన్ని పెంచడం, ప్రయాణ సౌలభ్యానికి పూచీపడడం.. ఇవే ఆ ప్రాజెక్టుల ముఖ్యోద్దేశాలు
సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్‌ల మధ్య నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని
ఢిల్లీకి తొలిసారిగా అందిరానున్న నమో భారత్ సంధాన సదుపాయం
ఢిల్లీ మెట్రో నాలుగో దశలోని జనక్‌పురి - కృష్ణ పార్క్ సెక్షనునూ ప్రారంభించనున్న ప్రధానమంత్రి
అదే దశలో భాగమైన రిఠాలా - కుండలీ సెక్షనుకూ ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన
ఢిల్లీలో రోహిణి ప్రాంతంలో అత్యాధునిక కేంద్రీయ ఆయుర్వేద పరిశోధన సంస్థకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 5న మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతోపాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ రూ.12,000 కోట్లకు పైనే. ప్రధాని దాదాపుఉదయం 11 గంటల 15 నిమిషాల వేళలో నమో భారత్ రైలులో సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు ప్రయాణించనున్నారు.

ఢిల్లీ-ఘజియాబాద్-మేరఠ్ నమో భారత్ కారిడార్లో సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ మధ్య 13 కి.మీ. మేర పొడవున ఉండే భాగాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. నిర్మాణానికి దాదాపు రూ.4,600 కోట్లు ఖర్చయిన ఈ మార్గం ప్రాంతీయ సంధానాన్ని పెంచడంలో ఒక చెప్పుకోదగిన ఘట్టం కానుంది.  దీనిని ప్రారంభించడంతో, ఢిల్లీకి మొదటిసారి నమో భారత్ సంధాన సదుపాయం (కనెక్టివిటీ) సమకూరనుంది.  ఇది ఢిల్లీ, మేరఠ్‌ల మధ్య ప్రయాణించడాన్ని సులభతరంగా మార్చివేయడమే కాకుండా లక్షలాది ప్రజలకు అధిక వేగవంతమైన, సౌకర్యవంతమైన యాత్రానుభూతినీ, దాంతోపాటే సాటిలేని సురక్షనూ, విశ్వసనీయతనూ కూడా అందిస్తుంది.

ప్రధాని ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా జనక్‌పురి, కృష్ణ పార్క్‌ల మధ్య 2.8 కి.మీ. పొడవైన మార్గాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ మార్గం నిర్మాణానికి దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారు. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో ప్రారంభానికి నోచుకొంటున్న మొదటి మార్గం ఇదే కానుంది. దీంతో పశ్చిమ ఢిల్లీలో కృష్ణ పార్క్, వికాస్‌పురిలో కొన్ని ప్రాంతాలే కాక దీంతో ముడిపడ్డ ఇతర ప్రాంతాలకు కూడా ప్రయోజనం అందనుంది.

ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా రిఠాలా - కుండలీ సెక్షను నిర్మాణ పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. 26.5 కి.మీ. పొడవు ఉండే ఈ మార్గం నిర్మాణానికి ఇంచుమించు రూ. 6,230 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ కారిడార్ ఢిల్లీలోని రిఠాలాను హర్యానాలోని నాథూపూర్ (కుండలీ)తో కలుపుతుంది. ఫలితంగా ఢిల్లీ, హర్యానాల్లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో సంధాన సదుపాయాన్ని చాలావరకు మెరుగుపడనుంది. దీంతో రోహిణి, బవానా, నరేలా, ఇంకా కుండలీ వంటి ప్రధాన ప్రాంతాలు లాభపడతాయి. ఆ ప్రాంతాల్లోని నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలకు చేరుకోవడం మెరుగుపడుతుంది. రెడ్ లైనును విస్తరించినందువల్ల ఇది ఒకసారి పనిచేయడం మొదలైందంటే గనక, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో ప్రయాణాలు చేయడం సౌకర్యవంతంగా మారిపోతుంది.

న్యూ ఢిల్లీలో రోహిణి ప్రాంతంలో కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ (సెంట్రల్ ఆయుర్వేద రిసర్చ్ ఇనిస్టిట్యూట్..‘సీఏఆర్ఐ’)కి అత్యాధునిక భవనాన్ని సుమారు రూ.185 కోట్ల ఖర్చుతో నిర్మించడానికి సంబంధించిన పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్యాంపస్ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్య చికిత్స సేవలకు అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానుంది. నూతన భవనంలో పరిపాలన బ్లాకు, ఓపీడీ బ్లాకు, ఐపీడీ బ్లాకులతోపాటు చికిత్సలకు మాత్రమే ప్రత్యేకంగా మరో బ్లాకును కూడా ఏర్పాటు చేయనున్నారు.  వీటితో రోగులకు, పరిశోధకులకు ఒక ఏకీకృత, అంతరాయాలకు తావుండని ఆరోగ్య సంరక్షణ సేవల్ని అందించడం సాధ్య పడనుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence

Media Coverage

India's 1 Trillion Retail Moment: Dawn of Retail Revenue Intelligence
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 27 జూన్ 2026
June 27, 2026

Appreciation for PM Modi's Development-Focused and People-Centric Governance