ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. ప్రతిభతో పాటు నిరంతర ప్రయత్నాల వల్లే నవకల్పనలో సాఫల్యం లభిస్తుందని ఆ సుభాషితం స్పష్టం చేస్తోంది.
సరైన ఫలితాల్ని రాబట్టాలంటే చేతల్లో వ్యక్తిగత సామర్థ్యాన్ని ప్రదర్శించడం తప్పనిసరి అని చెబుతున్న శాశ్వత జ్ఞానాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ప్రజలతో ఒక సందేశాన్ని ప్రధాని పంచుకున్నారు..:
‘‘యథైకేన న హస్తేన తాలికా సంప్రపద్యతే
తథోద్యమపరిత్యక్తం న ఫలం కర్మణ: స్మృతమ్’’
‘‘ఒక చేతితో చప్పట్లు కొట్టడం ఎలా సాధ్యపడదో, అలాగే ప్రయత్నించనిదే నవకల్పనలో సాఫల్యాన్ని సాధించ జాలం. కఠోర శ్రమ, నిరంతర ప్రయత్నాలు కలబోసినప్పుడే ప్రతిభ రాణింపునకు వచ్చి, ఫలితాన్ని అందిస్తుంది’’ అన్నదే ఈ సందేశం సారాంశం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘‘‘యథైకేన న హస్తేన తాలికా సంప్రపద్యతే
తథోద్యమపరిత్యక్తం న ఫలం కర్మణ: స్మృతమ్’’ అని పేర్కొన్నారు.
यथैकेन न हस्तेन तालिका सम्प्रपद्यते।
— Narendra Modi (@narendramodi) February 24, 2026
तथोद्यमपरित्यक्तं न फलं कर्मणः स्मृतम्॥ pic.twitter.com/0twbUYXXqZ


