మానవ జాతిని రక్షించడంలో అహింసకు ఎంతయినా ప్రాధాన్యం ఉందని పూజ్య బాపూ చెప్పారు. ఈ సంగతిని ప్రస్తావించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరంతప:
అహింసా పరమం సత్యం యతో ధర్మ: ప్రవర్తతే’’.
అహింస పరమ ధర్మం, అహింసయే అత్యున్నత తపస్సు. అహింస ఒక్కటే పరమ సత్యం, అన్ని ధర్మాలూ ఈ భావాన్ని తలదాల్చే ఏర్పడ్డాయి.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో:
‘‘పూజ్య బాపూ మానవ జాతి రక్షణను దృష్టిలో పెట్టుకొని అహింసకే ఎల్లప్పుడూ పెద్దపీట వేశారు. ఆయుధంతో అవసరం లేకుండానే, ఈ ప్రపంచాన్ని మార్చివేసే శక్తి దీన్లో ఉంది.
‘‘అహింసా పరమో ధర్మస్తథాహింసా పరంతప:
అహింసా పరమం సత్యం యతో ధర్మ: ప్రవర్తతే’’ అని పేర్కొన్నారు.
पूज्य बापू ने मानवता की रक्षा के लिए हमेशा अहिंसा पर बल दिया। इसमें वह शक्ति है, जो बिना हथियार के दुनिया को बदल सकती है।
— Narendra Modi (@narendramodi) January 30, 2026
अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परन्तपः।
अहिंसा परमं सत्यं यतो धर्मः प्रवर्तते॥ pic.twitter.com/DOkI98wdYu


