ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కష్టపడి పనిచేసే వారికి అసాధ్యమంటూ ఏదీ లేదని ఉద్బోధించే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
“నాత్యుచ్ఛశిఖరో మేరుర్నాతినీచం రసాతలం
వ్యవసాయద్వితీయానాం నాత్యపారో మహోదధిః’’
ఏ పర్వతమూ ఎక్కలేనంత ఎత్తయినదీ కాదు, ఏ ప్రదేశం చేరుకోలేనంత లోతైనదీ కాదు అని ఈ సుభాషితం చెబుతోంది. అదేవిధంగా, దాటలేనంత విశాలమైన సముద్రమూ ఏదీ లేదు! నిజానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, కష్టించి పనిచేసేవారికి అసాధ్యమైనది ఏదీ లేదు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“నాత్యుచ్ఛశిఖరో మేరుర్నాతినీచం రసాతలం
వ్యవసాయద్వితీయానాం నాత్యపారో మహోదధిః’’
नात्युच्चशिखरो मेरुर्नातिनीचं रसातलम्।
— Narendra Modi (@narendramodi) December 29, 2025
व्यवसायद्वितीयानां नात्यपारो महोदधिः॥ pic.twitter.com/drNJNTbEm0


