స్వావలంబన శక్తిని చాటే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు:
‘‘నాంబోధిరర్థితామేతి సదాంభోభిశ్చ పూర్యతే
ఆత్మా తు పాత్రతాం నేయః పాత్రమాయాంతి సంపదః’’
సముద్రం నీటి కోసం ఎన్నడూ ఎవరినీ అడగకపోయినా, అయినా అదెప్పుడూ నిండుగానే ఉన్నట్టుగా... ఓ వ్యక్తి సమర్థుడైతే, సహజంగానే సంపద వారి వద్దకు వస్తుందని ఈ సుభాషితం చెబుతోంది.
స్వావలంబన అన్నది ఆత్మగౌరవమూ, సమర్థత దిశగా దారిదీపమని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ సారి బడ్జెట్ కూడా మన యువత స్వావలంబనలో, వారిని సాధికారులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఆత్మగౌరవమూ, సమర్థత దిశగా దారి చూపే దీపం స్వావలంబన. ఈ సారి బడ్జెట్ కూడా మన యువ మిత్రుల స్వావలంబనలో, వారిని సాధికారులను చేయడంలో ముఖ్య పాత్ర పోషించబోతోంది.
నాంబోధిరర్థితామేతి సదాంభోభిశ్చ పూర్యతే
ఆత్మా తు పాత్రతాం నేయః పాత్రమాయాంతి సంపదః’’
आत्मनिर्भरता वह दीपक है, जो आत्मसम्मान और सामर्थ्य का मार्ग दिखाता है। इस बार का बजट भी हमारे युवा साथियों को आत्मनिर्भर और सशक्त बनाने में अहम भूमिका निभाने वाला है।
— Narendra Modi (@narendramodi) February 2, 2026
नाम्भोधिरर्थितामेति सदाम्भोभिश्च पूर्यते ।
आत्मा तु पात्रतां नेयः पात्रमायान्ति सम्पदः॥ pic.twitter.com/x7iSHqop57


