ఢిల్లీలోని తన నివాసమైన 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో రాఖీ పండుగ సందర్భంగా పిల్లలతో కలిపి జరుపుకున్న ప్రత్యేక వేడుకల విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. తనపై ఎల్లప్పుడూ నమ్మకం, ఆప్యాయతను చూపించిన నారీ శక్తికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.


పిల్లలు ప్రధానికి రాఖీ కట్టారు. వారితో కలిసి ప్రధాని రాఖీ పండుగ జరుపుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
"ఈ రోజు జరిగిన రాఖీ పండుగ వేడుక విశేషాలివి. ఎల్లప్పుడూ విశ్వాసం, ఆప్యాయతను చూపిస్తోన్న నారీ శక్తికి నా కృతజ్ఞతలు.”
Here are highlights from a very special Raksha Bandhan celebration earlier today. Gratitude to our Nari Shakti for their continuous trust and affection. pic.twitter.com/MeO3KJsXew
— Narendra Modi (@narendramodi) August 9, 2025


