దేవి స్కందమాత దివ్యానుగ్రహాన్ని స్పష్టం చేస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. మాత దివ్య ఆశీస్సులతో అందరికీ శుభాలు కలగాలని ఆయన వేడుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘దేవి స్కందమాతను ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తున్నాను.. మాత మమతాపూర్వక స్నేహ, ఆశీర్వాద దృష్టితో అందరినీ కటాక్షించు గాక.
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ
(ఈ సంస్కృత పదాలకు.. సదా సింహంపై ఆసీనురాలై, పద్మాల్ని రెండు చేతుల్లోనూ ధరించి ఉండే వైభవోపేత దేవి స్కందమాత మనకు నిరంతరం శుభ ఫలాల్ని ప్రసాదించాలని భావం)’’ అని పేర్కొన్నారు.
देवी स्कन्दमाता की करबद्ध प्रार्थना! मेरी कामना है कि अपने ममतामयी स्नेह और आशीर्वाद से वे सबका जीवन आलोकित करें।
— Narendra Modi (@narendramodi) March 23, 2026
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया।
शुभदाऽस्तु सदा देवी स्कन्दमाता यशस्विनी॥ pic.twitter.com/sUdbx4Zpkg


