దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సందేశం లో -
‘‘భారతదేశ ప్రగతి కోసం దివ్యాంగ జనులు అందించినటువంటి గొప్ప తోడ్పాటుల ను, వారి తారస్థాయి కార్య సాధనల ను దివ్యాంగ జనుల అంతర్జాతీయ దినం నాడు నేను ప్రశంసించ దలచుకొన్నాను. వారి జీవన యాత్ర లు, వారి ధైర్య సాహసాలు, ఇంకా వారి దృఢ సంకల్పం ఎంతో ప్రేరణాత్మకం గా ఉన్నాయి.
దివ్యాంగ జనుల కు సాధికారిత ను ప్రసాదించే మౌలిక సదుపాయాల కల్పన ను మరింత బలోపేతం చేయడం కోసం భారత ప్రభుత్వం క్రియాశీలం గా కృషి చేస్తున్నది. సమానత్వం, సులభత మరియు అవకాశం.. వీటి కి పెద్ద పీట ను వేయడం జరుగుతూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
The Government of India is actively working to further strengthen infrastructure that empowers persons with disabilities. The emphasis remains on equality, accessibility and opportunity.
— Narendra Modi (@narendramodi) December 3, 2021


