#MannKiBaat: ప్రధాని సంగ్రహాలయను సందర్శించే వ్యక్తుల అనుభవాలను పంచుకున్న ప్రధాని మోదీ, నమో యాప్‌లో #MuseumQuiz తీసుకోవాలని పౌరులను కోరారు.
ఏదైనా స్థానిక మ్యూజియాన్ని సందర్శించండి, #MuseumMemoriesని ఉపయోగించి మీ అనుభవాలను పంచుకోండి, #MannKiBaat సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు
#MannKiBaat: చిన్న ఆన్‌లైన్ చెల్లింపులు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయని ప్రధాని మోదీ అన్నారు
#MannKiBaat: ఆన్‌లైన్ లావాదేవీలు సుమారు రూ. రోజూ 20 వేల కోట్లు జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు
క్రీడల్లో మాదిరిగానే, కళలు, విద్యావేత్తలు మరియు అనేక ఇతర రంగాలలో దివ్యాంగులు అద్భుతాలు చేస్తున్నారు. సాంకేతికత శక్తితో వారు గొప్ప ఎత్తులను సాధిస్తున్నారు: #MannKiBaat సందర్భంగా ప్రధాని
అమృత్ మహోత్సవ్ సందర్భంగా, దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లను నిర్మిస్తాం: #MannKiBaat సందర్భంగా ప్రధాని మోదీ
#MannKiBaat: కాలిక్యులస్ నుండి కంప్యూటర్ల వరకు - ఈ శాస్త్రీయ ఆవిష్కరణలన్నీ జీరోపై ఆధారపడి ఉన్నాయి.
భారతీయులమైన మనకు గణితం ఎప్పుడూ కష్టమైన సబ్జెక్ట్ కాదు. దీనికి పెద్ద కారణం మన వేద గణితమే: #MannKiBaat సందర్భంగా ప్రధాని మోదీ

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.

కొత్త అంశాలతో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో, కొత్త కొత్త సందేశాలతోమీకు నా ‘మనసులో మాట’ చెప్పేందుకు మరోసారి వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు వచ్చిన అంశం గురించి మీకు తెలుసా? ఈ విషయం చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు- ఈ మూడింటికి సంబంధించింది. కొత్త ప్రధానమంత్రి మ్యూజియం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మ్యూజియం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమైంది. దీన్ని  దేశప్రజల సందర్శనార్థం తెరిచారు. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు. ఆయన తొలిసారి అవకాశం లభించిన వెంటనే ప్రధాన మంత్రి మ్యూజియం చూడటానికి వచ్చారు. నమో యాప్‌లో సార్థక్ గారు నాకు రాసిన సందేశం చాలా ఆసక్తికరంగా ఉంది. తాను చాలా ఏళ్లుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నానని, వార్తాపత్రికలు చదువుతున్నానని, సోషల్ మీడియాతో కొన్నాళ్లుగా కనెక్ట్ అయ్యానని, కాబట్టి తనకు జనరల్ నాలెడ్జ్ చాలా బాగుందని ఆయన అనుకున్నారు.కానీప్రధానమంత్రి మ్యూజియాన్ని సందర్శించినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. తన దేశం గురించి, దేశానికి నాయకత్వం వహించిన వారి గురించి తనకు పెద్దగా తెలియదని గ్రహించారు. ప్రధాన మంత్రి మ్యూజియంలో తనకు ఆసక్తికరంగా కనిపించిన విషయాలను ఆయన రాశారు. లాల్ బహదూర్ శాస్త్రికి ఆయన అత్తమామలు బహుమతిగా ఇచ్చిన చరఖాను చూసి సార్థక్ గారు చాలా సంతోషించారు. శాస్త్రి జీ పాస్‌బుక్‌ను కూడా సార్థక్ గారుచూశారు. శాస్త్రి గారి వద్ద ఎంత తక్కువ డబ్బు ఉందో కూడా చూశారు.  స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి ముందు మొరార్జీ భాయ్ దేశాయ్ గుజరాత్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారని కూడా తనకు తెలియదని సార్థక్ గారు రాశారు.మొరార్జీ దేశాయ్ పరిపాలనారంగంలో సుదీర్ఘకాలం సేవలందించారు. చౌదరి చరణ్ సింగ్ గారి గురించి కూడా సార్థక్ గారు రాశారు. జమీందారీ నిర్మూలన కోసం  చౌదరి చరణ్ సింగ్ జీ గొప్ప కృషి చేశారని ఆయనకు తెలియదు. ఇది మాత్రమే కాదు- నేను శ్రీ పి.వి. నరసింహారావు గారు భూ సంస్కరణల విషయంలో చాలా ఆసక్తిని కనబరిచిన సంగతి కూడా ఈ మ్యూజియంలో తనకు తెలిసిందని సార్థక్ గారు తెలిపారు. చంద్రశేఖర్ గారు4 వేల కిలోమీటర్లకు పైగా నడిచి చరిత్రాత్మక భారతదేశ యాత్ర చేశారని ఈ మ్యూజియానికి వచ్చిన తర్వాతే సార్థక్ గారికి కూడా తెలిసింది. అటల్ జీ ఉపయోగించిన వస్తువులను మ్యూజియంలో చూసినప్పుడు, ఆయన ప్రసంగాలు వింటుంటే సార్థక్ గర్వంతో ఉప్పొంగిపోయారు. ఈ మ్యూజియంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, డాక్టర్ అంబేద్కర్, జయ ప్రకాష్ నారాయణ్, మన ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గురించి కూడా చాలా ఆసక్తికరమైన సమాచారం ఉందని సార్థక్ గారు తెలిపారు.

మిత్రులారా! దేశ ప్రధానమంత్రుల సేవలను గుర్తుంచుకోవడానికి స్వతంత్ర భారత అమృత మహోత్సవంకంటే మంచి సందర్భం ఏముంటుంది! స్వాతంత్య్ర అమృత మహోత్సవం ప్రజాఉద్యమ రూపం దాల్చడం దేశానికి గర్వకారణం. ప్రజలలో చరిత్ర పట్ల ఆసక్తి చాలా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలోదేశంలోని అమూల్యమైన వారసత్వ సంపదతో యువతను అనుసంధానిస్తూ ఈ మ్యూజియం యువతకు కూడా కేంద్రంగా మారుతోంది.

మిత్రులారా! మ్యూజియం గురించి మీతో ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడునేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనిపించింది. మీ జనరల్ నాలెడ్జి ఏం  చెప్తుందో చూద్దాం. మీకు ఎంత అవగాహన ఉందో చూద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? నా యువ సహచరులుకాగితం, పెన్ను చేతుల్లోకి తీసుకున్నారా? నేను ప్రస్తుతం మిమ్మల్ని అడిగే ప్రశ్నల సమాధానాలను నమో యాప్ లేదా సోషల్ మీడియాలో #MuseumQuizతో పంచుకోవచ్చు. దయచేసి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్నికోరుతున్నాను. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో మ్యూజియంపై ఆసక్తి పెరుగుతుంది. దేశంలోని ఏ నగరంలో ప్రసిద్ధ రైలు మ్యూజియం ఉందో మీకు తెలుసా? అక్కడ గత 45 ఏళ్లుగా భారతీయ రైల్వే వారసత్వాన్ని చూసే అవకాశం ప్రజలకు లభిస్తోంది. నేను మీకు మరొక క్లూ ఇస్తాను. మీరు ఇక్కడ ఫెయిరీ క్వీన్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సెలూన్ నుండి మొదలుకొని ఫైర్‌లెస్ స్టీమ్ లోకోమోటివ్ వరకు కూడా చూడవచ్చు. ముంబైలోని ఏ మ్యూజియం కరెన్సీ పరిణామాన్ని ఆసక్తికరంగా వివరిస్తుందో మీకు తెలుసా? ఇక్కడ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన నాణేలు ఉన్నాయి. మరోవైపు ఈ-మనీ కూడా ఉంది. మూడవ ప్రశ్న 'విరాసత్-ఎ-ఖల్సా' ఏ మ్యూజియానికి సంబంధించింది? పంజాబ్‌లోని ఏ నగరంలో ఈ మ్యూజియం ఉందో తెలుసా? మీరందరూ గాలిపటం ఎగురవేయడంలో చాలా ఆనందించి ఉంటారు. తర్వాతి ప్రశ్న దీనికి సంబంధించింది. దేశంలోని ఏకైక గాలిపటాల మ్యూజియం ఎక్కడ ఉంది? నేను మీకు ఒక క్లూ ఇస్తాను. ఇక్కడ ఉన్న అతిపెద్ద గాలిపటం పొడవు వెడల్పులు 22అడుగులు, 16 అడుగులు. ఒక విషయం గుర్తొచ్చింది. ఇక్కడే ఇంకో విషయం చెప్తాను. ఈ మ్యూజియం ఉన్న ఊరికి బాపుకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిన్నతనంలో టపాసులు సేకరించే హాబీ ఎవరికి మాత్రం ఉండదు! అయితేభారతదేశంలో పోస్టల్ స్టాంపులకు సంబంధించిన జాతీయ మ్యూజియం ఎక్కడ ఉందో తెలుసా? నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. గుల్షన్ మహల్ అనే భవనంలో ఏ మ్యూజియం ఉంది? మీ కోసం క్లూ ఏమిటంటేఈ మ్యూజియంలో మీరు సినిమా డైరెక్టర్‌గా కూడా మారవచ్చు. మీరు కెమెరా, ఎడిటింగ్ నైపుణ్యాలను కూడా అక్కడ చూడవచ్చు. సరే! భారతదేశ వస్త్ర వారసత్వాన్ని తెలియజేసే మ్యూజియం ఏదైనా మీకు తెలుసా? ఈ మ్యూజియంలో సూక్ష్మ వర్ణ చిత్రాలు, జైన లిఖిత ప్రతులు, శిల్పాలు - మరెన్నో ఉన్నాయి. ఇది ప్రత్యేక తరహా ప్రదర్శనకు కూడా ప్రసిద్ధి చెందింది.

మిత్రులారా!ఈ టెక్నాలజీ యుగంలోమీరు వాటికి సమాధానాలు కనుగొనడం చాలా సులభం. మన కొత్త తరంలో ఆసక్తి పెరగాలని, వాటి గురించి మరింత ఎక్కువగా చదవాలని, చూడ్డానికి వెళ్లాలని నేను ఈ ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు మ్యూజియాలకు ఉన్న ప్రాధాన్యత కారణంగా చాలా మంది స్వయంగా ముందుకు వచ్చి వాటికి విరాళాలు ఇస్తున్నారు. చాలా మంది తమ పాత సేకరణలతో పాటు చారిత్రక విశేషాలను మ్యూజియంలకు అందజేస్తున్నారు. మీరు ఇలా చేసినప్పుడుఒక విధంగామీరు మొత్తం సమాజంతో సాంస్కృతిక అంశాలను పంచుకుంటారు. భారతదేశంలో కూడా ఇప్పుడు ప్రజలు దీని కోసం ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తిగత ప్రయత్నాలన్నింటినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజుల్లో మారుతున్న కాలంలోకోవిడ్ నిబంధనల  కారణంగామ్యూజియాలలో కొత్త పద్ధతులను అవలంబించడంపై దృష్టి సారిస్తున్నారు.

మ్యూజియాలలో డిజిటలైజేషన్‌పై కూడా దృష్టి పెరిగింది. మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. నా యువ సహచరుల కోసం నా దగ్గర  ఒక ఆలోచన ఉంది. రాబోయే సెలవుల్లో మీ స్నేహితుల బృందంతో స్థానిక మ్యూజియాన్ని ఎందుకు సందర్శించకూడదు! #MuseumMemoriesతో మీ అనుభవాన్ని పంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు ఇతరుల మనస్సులలో కూడా మ్యూజియాలపై ఆసక్తిని పెంచుతారు.

నా ప్రియమైన దేశప్రజలారా!మీరు మీ జీవితంలో చాలా తీర్మానాలు చేసి ఉండాలి. వాటిని నెరవేర్చడానికి మీరు కష్టపడి ఉండాలి. మిత్రులారా!కానీ ఇటీవలనేను ఒక భిన్నమైన, ప్రత్యేకమైన  తీర్మానం గురించి తెలుసుకున్నాను. అందుకే 'మన్ కీ బాత్' శ్రోతలతో తప్పక పంచుకోవాలని అనుకున్నాను.

మిత్రులారా!రోజంతా ఊరంతా తిరుగుతూనగదు రూపంలో ఎలాంటి డబ్బు లావాదేవీలు చేయనుఅనే సంకల్పంతో ఎవరైనా తమ ఇంటి నుండి బయటకు రాగలరని మీరు ఊహించగలరా! ఇది ఆసక్తికరమైన తీర్మానం కదా! ఢిల్లీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు సాగరిక, ప్రేక్ష ఇలాంటి ఒక క్యాష్‌లెస్ డే అవుట్‌ ప్రయోగం చేశారు. ఢిల్లీలో సాగరిక, ప్రేక్ష ఎక్కడికి వెళ్లినా డిజిటల్‌ పేమెంట్‌ సౌకర్యం లభించింది. UPI QR కోడ్ కారణంగావారు నగదు విత్‌డ్రా చేయాల్సిన అవసరం రాలేదు. స్ట్రీట్ ఫుడ్ దుకాణాల్లోనూ వీధి వ్యాపారుల దగ్గర కూడావారు ఆన్‌లైన్ లావాదేవీల సౌకర్యాన్ని పొందారు.

మిత్రులారా!ఢిల్లీ మెట్రో నగరం కాబట్టి అక్కడ ఇవన్నీ ఉండటం చాలా సులభమణి ఎవరైనా అనుకోవచ్చు.  కానీ ఇప్పుడు UPI  వ్యాప్తి కేవలం ఢిల్లీ వంటి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాదు. ఘజియాబాద్ కు చెందిన ఆనందితా త్రిపాఠి గారి నుండి నాకు సందేశం వచ్చింది. ఆనందిత గత వారం తన భర్తతో కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లారు. అస్సాం నుంచి మొదలుకుని  మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ వరకు తమ ప్రయాణ అనుభవాన్ని చెప్పారు. చాలా రోజుల ఈ ప్రయాణంలో వారు మారుమూల ప్రాంతాల్లో కూడా నగదు ఉపయోగించవలసిన అవసరం రాలేదని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కొన్నేళ్ల క్రితం వరకు మంచి ఇంటర్నెట్ సదుపాయం కూడా లేని చోట ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. సాగరిక, ప్రేక్ష, ఆనందిత అనుభవాలను పరిశీలిస్తూ క్యాష్‌లెస్ డే అవుట్ ప్రయోగాన్ని ప్రయత్నించమని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. తప్పకుండా చేయండి. మిత్రులారా!గత కొన్ని సంవత్సరాలుగా BHIM UPI మన ఆర్థిక వ్యవస్థ, అలవాట్లలో ఒక భాగంగా మారింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో, చాలా గ్రామాల్లో ప్రజలు UPI ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. డిజిటల్ ఎకానమీ వల్ల దేశంలో ఒక సంస్కృతి కూడా ఏర్పడుతోంది. డిజిటల్ చెల్లింపుల కారణంగా వీధుల్లోని చిన్నచిన్న  దుకాణాలు కూడా ఎక్కువ మంది వినియోగదారులకు సేవలను అందించడాన్ని సులభతరం చేశాయి. ఇప్పుడు వారికి నగదు సమస్య కూడా లేదు. మీరు రోజువారీ జీవితంలో UPI సౌలభ్యాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్లినా నగదు తీసుకెళ్లడం, బ్యాంకుకు వెళ్ళడం, ఏటీఎం వెతకడం మొదలైన సమస్యలు దూరమయ్యాయి. అన్ని చెల్లింపులు మొబైల్ నుండే జరుగుతాయి. కానీమీ ఈ చిన్న ఆన్‌లైన్ చెల్లింపుల వల్ల దేశంలో ఎంత పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా! ప్రస్తుతం మన దేశంలో ప్రతిరోజూ దాదాపు 20 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. గత మార్చి నెలలో యూపీఐ లావాదేవీలు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనివల్ల దేశంలో సౌలభ్యం కూడా పెరిగి నిజాయితీ వాతావరణం కూడా ఏర్పడుతోంది. ఇప్పుడు ఫిన్-టెక్‌కి సంబంధించిన అనేక కొత్త స్టార్టప్‌లు కూడా దేశంలో ముందుకు సాగుతున్నాయి. ఈ డిజిటల్ చెల్లింపు శక్తి, స్టార్ట్-అప్ వ్యవస్థకు సంబంధించి మీకు ఏవైనా అనుభవాలు ఉంటే పంచుకోవాలని నేను కోరుతున్నాను. మీ అనుభవాలు ఇతరులకు స్ఫూర్తిగా మారవచ్చు.

నా ప్రియమైన దేశవాసులారా ! సాంకేతికతలోని  శక్తి సామాన్య ప్రజల జీవితాలను ఎలా మారుస్తుందోమన చుట్టూ మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. టెక్నాలజీ మరో గొప్ప పని చేసింది. దివ్యాంగ సహచరుల అసాధారణ సామర్థ్యాల ప్రయోజనాన్ని దేశానికి, ప్రపంచానికి చూపించడమే ఈ పని. మన దివ్యాంగ సోదర సోదరీమణులు ఏం  చేయగలరో టోక్యో పారాలింపిక్స్‌లో మనం  చూశాం. క్రీడలతోపాటు కళలు, విద్యారంగం మొదలైన అనేక ఇతర క్షేత్రాల్లో దివ్యాంగసహచరులు అద్భుతాలు చేస్తున్నారు. కానీ ఈ సహచరులకు  సాంకేతికత లోని  శక్తి లభించినప్పుడు వారు మరింత ఉన్నత గమ్యాలను చేరుకుంటారు. అందుకేఈ రోజుల్లో దేశం దివ్యాంగులకు  వనరులను, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తోంది. దేశంలో అనేక స్టార్టప్‌లు, సంస్థలు ఈ దిశలో స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్నాయి. అటువంటి సంస్థల్లో ఒకటి – వాయిస్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. ఈ సంస్థ సహాయక సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తోంది. దివ్యాంగ కళాకారుల కృషిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు వినూత్నమైన ప్రారంభం కూడా జరిగింది. వాయిస్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్  సంస్థకు చెందిన కళాకారుల చిత్రాల డిజిటల్ ఆర్ట్ గ్యాలరీని సంస్థ సిద్ధం చేసింది. దివ్యాంగులైన సహచరులు ఎంత అసాధారణమైన ప్రతిభతో సుసంపన్నమవుతారో, వారు ఎలాంటి అసాధారణ సామర్థ్యాలను కలిగి ఉంటారో తెలిపేందుకు ఈ ఆర్ట్ గ్యాలరీ ఉదాహరణగా నిలుస్తుంది. దివ్యాంగ సహచరుల జీవితంలో ఉండే సవాళ్లు, వాటిని అధిగమిస్తే వారు ఎంత దూరం చేరుకోగలరు మొదలైన విషయాలు ఈ పెయింటింగ్స్‌ చూస్తే తెలుస్తాయి. మీకు కూడా దివ్యాంగ సహచరులు తెలిస్తే, వారి ప్రతిభను తెలుసుకుంటే, డిజిటల్ టెక్నాలజీ సహాయంతోమీరు వారిని ప్రపంచం ముందుకు తీసుకురావచ్చు. దివ్యాంగ సహచరులు  కూడా అలాంటి ప్రయత్నాలలో పాలుపంచుకోవాలి.

నా ప్రియమైన దేశప్రజలారా!దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్నఈ వేడి- నీటిని ఆదా చేసే విషయంలో  మన బాధ్యతను పెంచుతుంది. మీరు ఇప్పుడు ఉన్న చోట పుష్కలంగా నీరు అందుబాటులో ఉండవచ్చు. కానీనీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నివసించే కోట్లాది ప్రజలను కూడా మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారికి ప్రతి నీటి బొట్టు అమృతం లాంటిది.

మిత్రులారా!స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నసందర్భంగా అమృతోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో దేశం ముఖ్యమైనవిగా భావిస్తున్న సంకల్పాలలో నీటి సంరక్షణ కూడా ఒకటి. అమృత మహోత్సవం  సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలను  నిర్మిస్తారు. ఎంత పెద్ద  ఉద్యమం జరుగుతుందో మీరు ఊహించుకోవచ్చు. మీ పట్టణానికి 75 అమృత సరోవరాలు  వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. మీరందరూ-ముఖ్యంగా యువత ఈ ప్రచారం గురించి తెలుసుకోవాలని,ఈ బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ ప్రాంతంలో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఏదైనా చరిత్ర ఉన్నా,ఒక పోరాట యోధుని జ్ఞాపకాలు ఉన్నా మీరు వాటిని అమృత సరోవరాలతో కూడా అనుసంధానించవచ్చు. అమృత్ సరోవర్  సంకల్పం  తీసుకున్న తర్వాతదాని కోసం చాలా చోట్ల శరవేగంగా పనులు ప్రారంభమయ్యాయని తెలిసి నాకు చాలా సంతోషమైంది. యూపీలోని రాంపూర్ లో పట్వాయి గ్రామ పంచాయతీ గురించి నాకు సమాచారం వచ్చింది. అక్కడ గ్రామసభ జరిగే స్థలంలో ఒక చెరువు ఉంది. కానీ అది మురికితో, చెత్తతో నిండి ఉంది. ఎంతో కష్టంతో స్థానికుల సహకారంతో, స్థానిక పాఠశాల విద్యార్థుల సహకారంతో ఆ మురికి చెరువు గత కొన్ని వారాల్లో రూపాంతరం చెందింది.ఇప్పుడు ఆ సరస్సు ఒడ్డున రిటైనింగ్ వాల్, ప్రహరీ గోడ, ఫుడ్ కోర్ట్, ఫౌంటెన్లు, లైటింగ్ లాంటి ఏర్పాట్లు చేశారు. ఈ కృషికి రాంపూర్‌లోని పట్వాయి గ్రామపంచాయతీని, గ్రామ ప్రజలను,అక్కడి చిన్నారులను అభినందిస్తున్నాను.

మిత్రులారా!నీటి లభ్యత, నీటి కొరతదేశ ప్రగతిని, అభివృద్ధి వేగాన్ని నిర్ణయిస్తాయి. 'మన్ కీ బాత్'లో పరిశుభ్రత వంటి అంశాలతో పాటు నీటి సంరక్షణ గురించి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడటం మీరు గమనించి ఉంటారు.

“పానీయం పరమం లోకే, జీవానాం జీవనం స్మృతమ్” అని మన గ్రంథాలలో స్పష్టంగా ఉంది.

అంటే ప్రపంచంలో ప్రతి జీవికి నీరే ఆధారం. నీరే అతి పెద్ద వనరు కూడా.  అందుకే మన పూర్వీకులు నీటి సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వేదాల నుండి పురాణాల వరకుప్రతిచోటా-  నీటి పొదుపు;చెరువులు, సరస్సులు మొదలైన వాటి నిర్మాణం మనిషి  సామాజిక, ఆధ్యాత్మిక కర్తవ్యంగా పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలో నీటి సంరక్షణ, నీటి వనరుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదేవిధంగాసింధు-సరస్వతి , హరప్పా నాగరికతలలో కూడా నీటికి సంబంధించి భారతదేశంలో ఇంజనీరింగ్ ఎంత అభివృద్ధి చెందిందో చరిత్ర విద్యార్థులకు తెలిసి ఉండవచ్చు. పురాతన కాలంలో, అనేక నగరాల్లో నీటి వనరులు ఒకదానితో ఒకటి అనుసంధానమైన వ్యవస్థ ఉండేది. ఆ సమయంలో జనాభా అంతగా లేదు. సహజ వనరుల కొరత లేదు. ఒక రకమైన సమృద్ధి ఉంది. అయినప్పటికీనీటి సంరక్షణ గురించిఅప్పుడుఅవగాహన చాలా ఎక్కువగా ఉండేది. కానీఈరోజులలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మీ ప్రాంతంలోని ఇటువంటి పాత చెరువులు, బావులు, సరస్సుల గురించి తెలుసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. అమృత్ సరోవర్ అభియాన్ కారణంగానీటి సంరక్షణతో పాటుమీ ప్రాంతానికి  గుర్తింపు కూడా లభిస్తుంది. దీంతో నగరాలతో పాటు వివిధ ప్రాంతాలలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రజల విహారయాత్రలకు కూడా స్థలం లభిస్తుంది.

*****

 

మిత్రులారా నీటికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ మన భవిష్యత్తుతో ముండిపడిందే. అది మన సామాజిక బాధ్యతకదా. దీనికోసం శతాబ్దాలుగా విభిన్న సమాజాలు భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కచ్ కి చెందిన మాల్ ధారీ అనే ఓ తెగ జల సంరక్షణకోసం వృదాస్ అనే ఓ ప్రత్యేకమైన ప్రక్రియని అనుసరిస్తుంది. దాంట్లో చిన్న చిన్న బావుల్ని ఏర్పాటు చేసుకుని వాటి సంరక్షణకోసం చుట్టుపక్కలంతా మొక్కల్ని నాటి చెట్లు పెంచుతారు. అదే విధంగా మధ్యప్రదేశ్ కి చెందిన బీల్ అనే తెగ హల్మా అనే ఓ సంప్రదాయ విధానాన్ని అనుసరించింది. ఈ విధానంలో జల సంరక్షణకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకునేందుకు అందరూ కలసి ఓ చోట సమావేశమవుతారు. హల్మా విధానంలో కనుగొన్న పరిష్కారాల వల్ల ఈ ప్రదేశంలో నీటి ఎద్దడి తగ్గిపోయింది. అలాగే భూగర్భజలాలు పెరుగుతున్నాయి.

 

మిత్రులారా అసలు ఇది మన కర్తవ్యం అన్న భావన అందరి మనసుల్లో కలిగితే నీటి ఎద్దడికి సంబంధించిన అతి పెద్ద సమస్యలకు కూడా సులభ పరిష్కారాలు లభిస్తాయి. అందుకే మనం స్వాతంత్ర్య అమృతోత్సవాల వేళ జల సంరక్షణ, జీవన సంరక్షణ అనే సంకల్పాలు చేద్దాం. మనం ప్రతి నీటి బొట్టునూ, అలాగే మన జీవితాలను కాపాడుకుందాం.

 

ప్రియతమ దేశవాసులారా మీరంతా చసే ఉంటారు నేను కొన్ని రోజుల క్రితం నా యువనేస్తాలతో, విద్యార్ధులతో పరీక్షలపై చర్చ జరిపాను. దాంట్లో చాలా మంది విద్యార్థులు ఏమన్నారంటే వాళ్లకి పరీక్షల్లో లెక్కల పరీక్షంటే చాలా భయమేస్తోందట. ఇదే విషయాన్ని ఎంతో మంది విద్యార్ధులు నాకు సందేశాల ద్వారాకూడా పంపించారు. ఈసారి మనసులో మాటలో లెక్కల గురించి చర్చించాలని నేను ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. మిత్రులారా అసలు లెక్కల గురించైతే మన భారతీయులెవరూ అస్సలు భయపడాల్సిన పనేలేదు. ఎందుకంటే లెక్కలకి సంబంధించి భారతీయులే ఎక్కువగా వీలైనన్ని పరిశోధనలు, ఆవిష్కారాలు చేశారుకదా. సున్నా విలువ అలాగే దాని ప్రాధాన్యత గురించి మన యువతరం వినే ఉంటుందికదా. నిజానికి మీకింకో విషయం కూడా తెలిసే ఉంటుంది అసలు సున్నాని కనిపెట్టకపోయుంటే అసలు ప్రపంచం ఇంత వైజ్ఞానిక ప్రగతి సాధించడం కూడా మనం చూసుండే వాళ్లం కాదేమో. క్యాలిక్యులస్ నుంచి కంప్యూటర్ల వరకూ అన్ని వైజ్ఞానికి ఆవిష్కరణలూ సున్నామీదే ఆధారపడి ఉంటాయికదా. అసలు మన భారతీయ గణి శాస్త్రవేత్తలు, విద్వాంసులు ఏం రాశారంటే

       యత్ కించిత్ వస్తు తత్ సర్వః గణితేన వినా నహి

దానర్థం ఏంటంటే అసలీ మొత్తం బ్రహ్మాండంలో ఏముందో మొత్తం అదంతా గణితం మీదే ఆధారపడి ఉందని. మీరు విజ్ఞాన శాస్త్రం గురించి గుర్తు చేసుకుంటే అప్పుడు మీకు దీని గురించి అర్థమైపోతుంది. విజ్ఞానానికి సంబంధించిన ప్రతి ఒక్క సూత్రాన్నీ మేథమెటికల్ ఫార్ములాగానే వ్యక్తం చెయ్యడం జరిగిందికదా. న్యూటన్ లా కావొచ్చు, ప్రసిద్ధి చెందిన ఐన్ స్టీన్ ఈక్వేషన్ కావొచ్చు, అసలీ బ్రహ్మాండానికి సంబంధించిన మొత్తం విజ్ఞానమంతా గణితమే కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలు థియరీ ఆఫ్ ఎవ్రీ థింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మొత్తం బ్రహ్మాండం గురించి చెప్పడానికి ఒకే ఒక సూత్రమన్న మాట. అసలు గణితానికి సంబంధించి మన మహర్షులు ఎంతో విస్తృత స్థాయిలో ఆలోచించారు, పరిశోధనలు చేశారు. మనం కేవలం సున్నానిమాత్రం ఆవిష్కరించడమే కాక అనంతం అంటే ఇన్ఫినిటీనికూడా కనిపెట్టాం. సాధారణమైన మాటల్లో మనం సంఖ్యల గురించి మాట్లాడుకున్నప్పుడు మిలియెన్, బిలియెన్, ట్రిలియెన్ వరకూ చెబుతాం, ఆలోచిస్తాం. కానీ వేదాల్లో అలాగే భారతీయ గణితంలో ఈ గణన ఇంకా చాలా ముందుకెళ్లింది. మనకి ఓ పురాతనమైన శ్లోకం కూడా ప్రచారంలో ఉంది.

 

       ఏకం దశం శతంచైవ సహస్రం అయుతం తథా

       లక్షంచ నియుతంచైవ కోటిః అర్బుదమ్ ఏవచ

       వృదం ఖర్వే నిఖర్వ చ శంఖః పదమః చ సాగరః

       అంత్యం మధ్యం పరార్ధః చ దశ వృదధ్వా యధా క్రమమ్

 

ఈ శ్లోకంలో సంఖ్యల ఆర్డర్ ని చెప్పారు. ఎలాగంటే ఒకటి, పది, వంద, వెయ్యి, అయుతం, లక్ష, నియుత, అలాగే కోటి. సంఖ్యలు ఈ విధంగా వెళ్తుంటాయి సంఖ్య, పదం అలాగే సాగరం వరకూ. ఓ సాగరం అంటే ఎంతంటే పదికి టూదీ పవర్ ఆఫ్ 57. అది మాత్రమే కాక ఇంకా ఆ తర్వాత ఓధ్ అలాగే మహోధ్ లాంటి సంఖ్యలు కూడా ఉన్నాయి. ఓ మహోధ్ అంటే ఎంతంటే 10కి టూది పవర్ ఆఫ్ 62కి సమానం. అంటే ఒకటి తర్వాత 62 సున్నాలు 62 జీరోస్. మనం అసలు అంత పెద్ద సంఖ్యల గురించి సలు తలచుకున్నా సరే కష్టంగా అనిపిస్తుంది. కానీ భారతీయ గణితంలో వీటి ప్రయోగం వేలాది సంవత్సరాలుగా జరుగుతోంది. నాకు కొన్ని రోజుల క్రితం ఇంటెల్ కంపెనీ సీఈఓ కలిశారు. అసలు ఇంటెల్ పేరు వింటేనే మీ మనసులో కంప్యూటర్ అన్న ఆలోచన వచ్చేస్తుందికదా. మీరు కంప్యూటర్ గురించి మన బైనరీ సిస్టమ్ గురించి కూడా వినుంటారుకదా. కానీ మీకోటి తెలుసా అసలు మన దేశంలో ఆచార్య పింగళుడు ఎన్నో ఏళ్ల క్రితమే ఈ బైనరీ సిస్టమ్ గురించి ఆలోచించాడు. ఈ విధంగా ఆర్యభట్టనుంచి రామానుజం లాంటి గణిత శాస్త్ర వేత్తల వరకూ అందరూ గణితానికి సంబంధించిన న్నో సూత్రాలను సిద్ధాంతీకరించారు.

మిత్రులారా అసలు మన భారతీయులకెప్పుడూ గణితం అస్సలు కష్టంగా అనిపించలేదు. దానికి మన వైదిక గణితం కూడా ఓ కారణం.  ఆధునిక కాలంలో వైదిక గణితానికి సంబంధించిన కీర్తెవరికి దక్కుతుందంటే శ్రీ భారతీ కృష్ణ తీర్థ మహరాజ్ కే. ఆయన క్యాలిక్యులేషన్ కి సంబంధించిన ప్రాచీన విధానాలను ఆధునికీకరించారు. అలాగే దానికి వైదిక గణితం అనే పేరు పెట్టారు. అసలు వైదిక గణితం విశిష్టత ఏంటంటే మీరు దాంతో అత్యంత కఠిమైన లెక్కల్ని కూడా రెప్పపాటు కాలంలో చేసెయ్యొచ్చు. అసలీ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అలా వైదిక గణితాన్ని నేర్చుకునేవాళ్లు నేర్పించేవాళ్ల వీడియాలు అనేకం చూడొచ్చు.

మిత్రులారా ఇవ్వాళ్టి మనసులో మాటలో అలా వైదిక గణితం నేర్పించే ఓ మిత్రుడు మనతో కలవబోతున్నారు. ఆయనెవరంటే కోలకతాకి చందిన సౌరవ్ టేక్రీవాల్ గారు. ఆయన గడచిన రెండు రెండున్నర దశాబ్దాలనుంచి వైదిక్ మ్యాధమెటిక్స్ అనే ఈ మూవ్ మెంట్ ని చాలా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడదాం.

 

నరేంద్ర మోడీ      గౌరవ్ గారూ నమస్కారం

గౌరవ్              నమస్కారం సర్

నరేంద్ర మోడీ      మేమేం విన్నామంటే మీకు వైదిక్ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమట కదా, చాలా పరిశ్రమ చేశారట కదా

                     ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను

                     తర్వాత అసలు మీకు దానిమీద ఎందుకు ఇష్టత కలిగిందో చెప్పండి

గౌరవ్              సార్ నేను ఇరవై ఏళ్లక్రితం బిజినెస్ స్కూల్ కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, దానికో కాంపిటీటివ్ ఎగ్జామ్ జరిగేది.

                     దాని పేరు క్యాట్.

                     అందులో గణితానికి సంబంధించి చాలా ప్రశ్నలొచ్చేవి.

                     వాటిని చాలా తక్కువ సమయంలో పూర్తి చెయ్యాలి.

                     అప్పుడు మా అమ్మ నాకో పుస్తకం తెచ్చిచ్చింది, దాని పేరేంటంటే వైదిక గణితం.

                     స్వామి శ్రీ భారతీ కృష్ణ తీర్థ మహారాజు ఆ పుస్తకం రాశారు.

                     ఆవిడా పుస్తకంలో పదహారు సూత్రాల్ని ఇచ్చారు.

                     వాటివల్ల గణితం చాలా సులభంగా, చాలా తొందరగా పూర్తైపోయేది.

                     నేనా పుస్తకాన్ని చదివినప్పుడు నాకు చాలా ప్రేరణ కలిగింది.

                     తర్వాత నాకు మ్యాథమెటిక్స్ మీద ఇష్టత ఏర్పడింది.

                     అసలు మనకున్న ఆ విజ్ఞానాన్ని, ఆ బలాన్ని ప్రపంచం నలుమూలలా విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యొచ్చనిపించింది.

                     అందుకే నేను అప్పట్నుంచీ వైదిక గణితాన్ని ప్రపంచంలో మూలమూలలా ప్రచారం చెయ్యడం అనే ఓ మిషన్ కి చేపట్టి అందుకోసం ప్రయత్నిస్తున్నాను.

                     ఎందుకంటే ప్రతొక్కరూ లెక్కలంటే భయపడతారు కాబట్టి.

                     పైగా అసలు వైదిక గణితం కంటే తేలికైంది ఇంకేదైనా ఉంటుందా.

నరేంద్రమోడీ       గౌరవ్ గారు మీరు ఎన్నేళ్లుగా దీనికోసం పనిచేస్తున్నారు.

గౌరవ్              దాదాపుగా ఇవ్వాళ్టికి ఇరవై ఏళ్లయ్యింది సార్. నేను పూర్తిగా ఇందులోనే ఉన్నాను.

నరేంద్రమోడీ       మరి అవేర్ నెస్ కోసం ఏం చేస్తారు? ఏమేం ప్రయోగాలు చేస్తారు?

గౌరవ్              మేం స్కూళ్లకెళ్తాం. మేం ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తాం.

                     మా సంస్థ పేరేంటంటే వైదిక్ మ్యాథ్స్ ఫోరమ్ ఇండియా.

                     ఆ సంస్థ ద్వారా మేము ఇంటర్ నెట్ మాధ్యమంలో ఇరవై నాలుగ్గంటలూ చదువు చెబుతాం సర్.

నరేంద్రమోడీ       గౌరవ్ గారూ నాకసలెప్పుడూ పిల్లలతో మాట్లాడ్డం చాలా ఇష్టమని, పైగా నేను దానికోసం అవకాశాలు వెతుక్కుంటానని మీకు తెలుసుకదా. పైగా అసలు ఎగ్జామ్ వారియెర్ తో నేను పూర్తిగా ఓ విధంగా దాన్ని ఇనిస్టిట్యూషనలైజ్ చేసేశాను.

                     పైగా అసలు విషయం ఏంటంటే మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు లెక్కల గురించి మాట్లాడితే చాలు చాలామంది పిల్లలు వెంటనే పారిపోతారు. అందుకే నేనేం చేస్తానంటే అలాంటి అనవసరపు భయాల్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తాను. అసలా భయాన్ని పోగొట్టాలి. అలాగే వాళ్లకి మనకి వారసత్వంగా లభించిన చిన్న చిన్న టెక్నిక్స్ ని చెప్పాలి. ఎందుకంటే భారతీయులకి లెక్కలంటే కొత్త విషయమేం కాదుగా. బహుశా ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన రీతుల్లో భారత దేశానికి చెందిన గణిత శాస్త్ర రీతులుకూడా భాగమేనేమో. మకి ఎగ్జామ్ వారియెర్స్ మనసుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మీరు వాళ్లకేం చెబుతారు?

గౌరవ్              సర్ ఇది పిల్లలకి అన్నింటికంటే ఎక్కువ ఉపయోగపడే విషయం. ఎందుకంటే అసలు పరీక్షలంటేనే చాలా భయపడిపోతారు పిల్లలు, వాళ్లకి చాలా అపోహలుంటాయా విషయంలో ప్రతి ఇంట్లోనూ. పరీక్షలకోసం పిల్లలు ట్యూషన్లకెళ్తారు. తల్లిదండ్రులు ఇబ్బందిపడుతుంటారు. అసలు మామూలు గణితంతో పోలిస్తే వేద గణితం పదిహేను వందల శాతం ఎక్కువ వేగవంతమైంది. అలాగే దానివల్ల పిల్లలకు చాలా కాన్ఫిడెన్స్ కలుగుతుంది. అలాగే మైండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అసలు మేం వైదిక గణితంతోపాటుగా యోగానికడా ఇంట్రడ్యూస్ చేశాం. దానివల్ల ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే కళ్లుమూసుకుని కూడా కాలిక్యులేషన్ చేసేయొచ్చు వైదిక గణిత పద్ధతుల్లో.

నరేంద్రమోడీ       నిజానికి అదెలాంటి ధ్యాన రీతి అంటే దాంట్లో ఆ విధంగా గణించడం కూడా ధ్యానంలో ఓ ప్రైమరీ కోర్సు కదా

గౌరవ్              అవును సర్

నరేంద్ర మోడీ      సరే గౌరవ్ గారూ, మీరు దీన్ని మిషన్ మోడలో తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే మీ అమ్మగారు మిమ్మల్ని ఓ గురువు రూపంలో ఈ దారిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇవ్వాళ్ల మీరుకూడా లక్షలాది మంది పిల్లల్ని ఈ మార్గంలోకి తీసుకొస్తున్నారు. నా తరఫున మీకు హార్ధిక శుభాభినందనలు.

గౌరవ్              ధన్యవాదాలు సర్. మీరు వైదిక గణితానికి ఈ విధంగా ఇప్పుడు గుర్తింపుని తీసుకొచ్చేందుకు, దానికోసం నన్ను ఎంపిక చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను సర్. మేం మీకు ఋణపడి ఉన్నాం.

నరేంద్రమోడీ       మీకు హార్థిక శుభాకాంక్షలు. నమస్కారం.

గౌరవ్              నమస్తే సర్.

 

మిత్రులారా గౌరవ్ గారు అసలు వైదిక గణితం సాధారణ గణితాన్ని ఏ విధంగా కష్టాన్ని ఇష్టంగా మారుస్తుందో చాలా చక్కగా చెప్పారు. అది మాత్రమే  కాక వైదిక గణితం ద్వారా మీరు అతి పెద్ద ప్రాబ్లమ్స్ ని కూడా అత్యంత సులభంగా  సాల్వ్ చెయ్యొచ్చు. అందుకే ప్రతొక్క తల్లీ తండ్రీ వైదిక గణితాన్ని తమ పిల్లలకి

నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. దానివల్ల వాళ్లకి కాన్ఫిడెన్స్ పెరగడం  మాత్రమే కాక వాళ్ల అనలెటికల్ పవర్ కూడా పెరుగుతుంది. పైగా ఏంటంటే  లెక్కలనే పేరు చెప్పగానే కొందరు పిల్లల్లో ఉన్న కాస్తో కూస్తో భయం కూడా పూర్తిగా దూరమైపోతుంది.

 

ప్రియమైన మిత్రులారా ఇవ్వాళ్ల మనం మనసులో మాటలో మ్యూజియం నుంచి  మ్యాథ్స్ వరకూ అనేక విధాలైన జ్ఞానాన్ని పెంపొందించే విషయాల గురించి  చర్చించుకున్నాం.  అసలీ విషయాలన్నీ మీ సూచనలవల్లే మనసులో మాటలో చోటు చేసుకుంటున్నాయి. నాకు మీరు ఇదే విధంగా ఇకపై కూడా మీ సలహాలు, సూచనలను నమో యాప్ మరియు మై గౌవ్ ల ద్వారా పంపిస్తూనే ఉండండి. రాబోయే రోజుల్లో దేశంలో ఈద్ పండగకూడా రాబోతోంది. మే మూడో తేదీన అక్షయ తృతీయ, అలాగే పరశురామ భగవానుడి జయంతిని కూడా జరుపుకుంటాం. కొన్ని రోజుల తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి పర్వదినంకూడా వస్తుంది. ఈ పండుగలన్నీ శాంతి, పవిత్రత, దానం అలాగే సహృదయతలను

పెంపొందించే పర్వాలే. మీకందరికీ ఈ పర్వాలకు సంబంధించి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగల్ని చాలా సంతోషంగా చాలా మంచి మనసుతో జరుపుకోండి. వాటితోపాటుగా మీరు కరోనా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ పెట్టుకోండి. నియమిత కాల వ్యవధుల్లో చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండండి. దానినుంచి తప్పించుకోవడానికి ఉన్న ఉపాయాలన్నింటినీ మీరు

తప్పకుండా పాటించండి. మళ్లీ వచ్చేసారి మనసులో మాటలో మళ్లీ కలుసుకుందాం. అలాగే మీరు పంపించిన ఇంకొన్ని కొత్త విషయాల గురించి కూడా చర్చించుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. హృదయపూర్వక

ధన్యవాదాలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
India eliminates extreme poverty

Media Coverage

India eliminates extreme poverty
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 3 మార్చి 2024
March 03, 2024

A celebration of Modi hai toh Mumkin hai – A journey towards Viksit Bharat