అర్హ‌త క‌లిగిన జ‌నాభా కు అంతటికీ క‌రోనా టీకా మందు తాలూకు క‌నీసం ఒక డోసు ను ఇప్పించినటువంటి భారతదేశం లోని మొద‌టి రాష్ట్రం గా హిమాచల్ నిల‌చింది
ప్ర‌పంచం లో కెల్లా అతి పెద్ద‌ది అయిన‌టువంటి మ‌రియు అత్యంత వేగ‌వంతమైన‌టువంటి టీకాక‌ర‌ణ ప్ర‌చార ఉద్య‌మాని కి దేశం లోని గ్రామీణ స‌మాజం ఏ విధం గా సాధికారిత ను క‌ల్పిస్తోందనే అంశాని కి హిమాచ‌ల్ నిద‌ర్శ‌నం గా ఉంది: ప్ర‌ధాన మంత్రి
కొత్త డ్రోన్ నియ‌మావ‌ళి ఆరోగ్యం, వ్య‌వ‌సాయం వంటి అనేక రంగాల లో స‌హాయ‌కారి కానుంది: ప్ర‌ధాన మంత్రి
త్వ‌ర‌లో రాబోతున్నటువంటి ‘మ‌హిళ‌ ల స్వ‌యంస‌హాయ స‌మూహాల కు ఉద్దేశించిన ప్ర‌త్యేక‌ ఆన్ లైన్ ప్లాట్‌ ఫార్మ్’ మ‌న సోద‌రీమ‌ణుల‌ కు వారి ఉత్ప‌త్తుల ను దేశంలోను, విదేశాల లోను విక్ర‌యించ‌డం లో వారికి సాయ‌ప‌డ‌నుంది: ప్ర‌ధాన మంత్రి
హిమాచ‌ల్ లో నేల ను ర‌సాయ‌నాల బారి నుంచి విముక్తం చేసేందుకు గాను ‘అమృత కాలం’ లో హిమాచ‌ల్ ను మళ్లీ సేంద్రియ వ్య‌వ‌సాయం దిశ గా మ‌ళ్ళించడం అంటూ అక్క‌డి రైతుల కు, తోట‌ ల పెంప‌కందారుల కు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి

హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ లో ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాక‌ర‌ణ కార్య‌క్రమం తాలూకు ల‌బ్ధిదారుల తోను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయ‌తీ నాయ‌కులు, త‌దిత‌రులు హాజరయ్యారు.

సంభాష‌ణ సాగిన క్ర‌మం లో, దోద్ రా క‌వార్ శిమ్లా సివిల్ హాస్పిట‌ల్ కు చెందిన డాక్ట‌ర్ రాహుల్ తో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, టీకా మందు వృథా ను క‌నీస స్థాయి కి కుదించిన జ‌ట్టు స‌భ్యుల‌ కు ప్ర‌శంస‌లు అంద‌జేశారు; ఒక క‌ష్ట‌మైన రంగం లో సేవ‌లను అందించడం లో వారి అనుభ‌వం ఎలా ఉన్న‌దీ ఆయన చ‌ర్చించారు. మండీ లో తునాగ్ ప్రాంత నివాసి, టీకా ను వేయించుకొన్న శ్రీ ద‌యాళ్ సింహ్ తో ప్ర‌ధాన మంత్రి ముచ్చ‌టిస్తూ, టీకాక‌ర‌ణ సంబంధిత స‌దుపాయాలు ఎలా ఉన్నాయని, టీకాక‌ర‌ణ కు సంబంధించిన వ‌దంతుల ను ఏ విధం గా సంబాళించార‌ంటూ వాక‌బు చేశారు. ఆ టీకా ల‌బ్ధిదారు ప్ర‌ధాన మంత్రి నాయ‌క‌త్వానికి గాను ధన్య‌వాదాలు తెలిపారు. హిమాచ‌ల్ బృందం యొక్క జ‌ట్టు ప్ర‌యాస‌ల ను ప్ర‌ధాన మంత్రి మెచ్చుకొన్నారు. కులూ కు చెందిన ఎఎస్ హెచ్‌ఎ శ్రామికురాలు నిర్మా దేవి ని మీకు టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఏ విధ‌మైన‌టువంటి అనుభూతి ని ఇచ్చిందో తెలియ‌జేయండి అంటూ ప్ర‌ధాన మంత్రి అడిగారు. టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి స్థానిక సంప్ర‌దాయాల ను వినియోగించుకోవడాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ఆరా తీశారు. జ‌ట్టు స‌భ్యులు సిద్ధం చేసినటువంటి సంభాష‌ణ‌ మ‌రియు స‌హ‌కారం తాలూకు న‌మూనా ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఆమె భాగ‌స్తురాలు గా ఉన్నటువంటి జ‌ట్టు టీకాల ను ఇవ్వ‌డం కోసం ఎంతో దూరంలో ఉన్న ప్రాంతానికి ఎలాగ ప్ర‌యాణించిందీ ఆయ‌న తెలుసుకోగోరారు.

వృద్ధుల కు ఎదురైన అనుభ‌వాన్ని గురించి హ‌మీర్ పుర్ కు చెందిన శ్రీ‌మ‌తి నిర్మ‌ల దేవి తో ప్ర‌ధాన మంత్రి చ‌ర్చించారు. టీకా మందు ను త‌గినంత స్థాయి లో స‌ర‌ఫ‌రా చేసినందుకు, ఆ కార్య‌క్ర‌మాని కి ఆశీర్వాదాలను అందించినందుకు ప్ర‌ధాన మంత్రి కి ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. హిమాచ‌ల్ లో అమ‌ల‌వుతున్న ఆరోగ్య ప‌థ‌కాల ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసించారు. ఊనా కు చెందిన క‌ర్మో దేవి గారు 22,500 మంది కి టీకా మందు ను ఇచ్చిన ఖ్యాతి ని పొందారు. ఒక కాలి ఎముక విరిగిపోయిన‌ప్ప‌టికీ కూడాను విధుల‌ ను నిర్వ‌హించి ఆమె చాటిన స్ఫూర్తి ని ప్ర‌ధాన మంత్రి పొగ‌డారు. ప్ర‌పంచం లో అతి భారీది అయిన టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మం క‌ర్మో దేవి గారు వంటి వ్య‌క్తుల కృషి వ‌ల్ల‌నే ముందుకు సాగుతోంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. లాహౌల్‌- స్పీతి కి చెందిన శ్రీ న‌వాంగ్ ఉపాశక్ టీకా మందు ను తీసుకొనేట‌ట్లు గా ప్ర‌జ‌ల‌ ను ఒప్పించ‌డం కోసం ఒక ఆధ్యాత్మిక నాయ‌కుని గా త‌నకు ఉన్న హోదా ను ఎలా వినియోగించారో ప్ర‌ధాన మంత్రి తెలుసుకోగోరారు. ఆ ప్రాంతం లో అట‌ల్ సొరంగం తాలూకు ప్ర‌భావాన్ని గురించి కూడా శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడారు. అది ప్ర‌యాణ కాలాన్ని త‌గ్గించిన వైనాన్ని, అలాగే సంధానాన్ని మెరుగుప‌ర‌చిన తీరు ను గురించి శ్రీ ఉపాశక్ త‌న సంభాష‌ణ లో తెలియజేశారు. టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌ర వేగం గా పురోగ‌మించ‌డం లో స‌హ‌క‌రించే విధం గా లాహౌల్- స్పీతి ని తీర్చి దిద్ద‌డం లో తోడ్ప‌డినందుకు గాను బౌద్ధ నాయ‌కుల‌ కు ప్ర‌ధాన మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సంభాష ణ సాగిన క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ఎంతో ఆత్మీయ‌త‌ ను వ్య‌క్తం చేస్తూ, ఇష్టగోష్ఠి గా మాట్లాడారు.

శ్రోత‌ల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, 100 సంవ‌త్స‌రాల లో త‌లెత్తే అతి పెద్దదైన అంటువ్యాధి కి వ్య‌తిరేకం గా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఒక విజేత గా నిల‌చింది అన్నారు. అర్హులైన అంద‌రికీ క‌రోనా వ్యాక్సీన్ తాలూకు క‌నీసం ఒక డోసు ను వేసిన ఒక‌టో రాష్ట్రం గా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప్ర‌సిద్ధికెక్కింద‌ని కూడా ఆయ‌న అన్నారు. ఈ స‌ఫ‌ల‌త ఆత్మ‌విశ్వాసం మ‌రియు ఆత్మ‌నిర్భ‌త ల మ‌హ‌త్వాన్ని స్పష్టం చేసింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

భారతదేశం లో టీకాల ను ఇప్పించే కార్యక్రమం సఫలత ఆ దేశం పౌరుల కఠోర శ్రమ, వారి లోని స్ఫూర్తి ల ఫలితం అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ప్రతి ఒక్క రోజు 1.25 కోట్ల టీకా మందు ను ఇస్తూ రెకార్డ్ స్థాయి లో టీకాకరణ చేస్తున్నది. భారతదేశం లో ఒక రోజు కు ఇస్తున్న టీకా ల సంఖ్య అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ గా ఉంది అని దీనికి అర్థం. టీకాకరణ ఉద్యమం లో వైద్యులు, ఎఎస్ హెచ్ ఎ శ్రామికులు, ఆంగన్ వాడీ శ్రామికులు, చికిత్స సిబ్బంది, ఉపాధ్యాయులు, మహిళలు అందిస్తున్న తోడ్పాటు కు గాను వారిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు తాను ‘సబ్ కా ప్రయాస్’ ను గురించి మాట్లాడిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ఈ సఫలత ‘సబ్ కా ప్రయాస్’ ను ఆచరణాత్మకం గా మార్చింది అన్నారు. హిమాచల్ దేవత ల భూమి అనే వాస్తవాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ, ఈ విషయం లో సంభాషించడం, సహకరించుకోవడం అనే నమూనా ను మెచ్చుకొన్నారు.

లాహౌల్-స్పీతి వంటి ఒక దుర్గమ జిల్లా లో సైతం 100 శాతం ఒకటో డోసు ను ఇవ్వడం లో హిమాచల్ అగ్రణి గా ఉంది అని ప్రధాన మంత్రి పేర్కొంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు. అటల్ సొరంగాన్ని నిర్మించడానికి పూర్వం ఈ ప్రాంతాని కి దేశం లోని మిగిలిన ప్రాంతాల తో సంబంధాలు నెలల తరబడి తెగిపోయాయయి అని ఆయన చెప్పారు. టీకాకరణ ప్రయాసల కు ఏ వదంతి, ఏ దుష్ప్రచారం అడ్డుపడకుండా చూసినందుకు గాను హిమాచల్ ప్రజల ను ప్రధాన మంత్రి పొగడారు. ప్రపంచం లో అతి పెద్దది, అమిత వేగం గా సాగుతున్నది అయినటువంటి టీకాకరణ ఉద్యమానికి దేశం లోని గ్రామీణ సమాజం ఏ విధం గా సాధికారిత ను కల్పిస్తున్నదో హిమాచల్ రుజువు చేస్తోంది అని కూడా ఆయన అన్నారు.

అలాగే, సంధానాన్ని బలపరడం వల్ల పర్యటన రంగం కూడా దాని తాలూకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందుకొంటోంది అని ప్రధాన మంత్రి అన్నారు. కాయగూరల ను, పండ్ల ను పండిస్తున్న రైతులు, తోటల పెంపకందారులు కూడా దీని తాలూకు లబ్ధి ని పొందుతున్నారని ఆయన వివరించారు. పల్లెల లో ఇంటర్ నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా హిమాచల్ లోని యువ ప్రతిభావంతులు వారి సంస్కృతి ని, పర్యటన రంగం తాలూకు కొత్త కొత్త అవకాశాల ను దేశ, విదేశాల కు పరిచయం చేయగలుగుతారు అని ఆయన చెప్పారు.

ఇటీవలే అధికారికం గా ప్రకటించిన డ్రోన్స్ సంబంధిత నియమావళి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ నియమాలు ఆరోగ్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల లో వివిధ కార్యకలాపాల కు సహాయకారి కాగలుగుతాయి అని పేర్కొన్నారు. ఇది కొత్త కొత్త అవకాశాల కు తలుపుల ను తెరుస్తుంది అని ప్రధాన మంత్రి చెప్పారు. స్వాతంత్య్ర దినం నాడు తాను చేసిన ప్రకటనల లో మరొక ప్రకటన ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మహిళల స్వయంసహాయ సమూహాల కోసం ఒక ప్రత్యేక ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ ను ఏర్పాటు చేయనుంది అని ఆయన అన్నారు. మన సోదరీమణులు వారు తయారు చేసిన ఉత్పత్తుల ను ఈ మాధ్యమం ద్వారా దేశం లోను, ప్రపంచం లోను విక్రయించ గలుగుతారని ఆయన తెలిపారు. వారు ఆపిల్ లను, నారింజల ను, కిన్నుల ను, పుట్టగొడుగుల ను, టమాటల ను, ఇంకా అటువంటి అనేక రకాలైన ఫలాలను దేశం లో మూల మూలల కు అందజేయగలుగుతారు అని ఆయన అన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భం లో రాబోయే 25 సంవత్సరాల కాలం లో హిమాచల్ లో సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించవలసిందంటూ రైతుల కు, తోటల పెంపకందారుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. మన నేల కు రసాయన పదార్థాల బారి నుంచి మెల్ల మెల్ల గా విముక్తి ని ప్రసాదించాలి మనం అని ఆయన అన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Boosting ‘Make in India’! How India is working with Asean to review trade pact to spur domestic manufacturing

Media Coverage

Boosting ‘Make in India’! How India is working with Asean to review trade pact to spur domestic manufacturing
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 ఏప్రిల్ 2024
April 13, 2024

PM Modi's Interaction with Next-Gen Gamers Strikes a Chord with Youth

India Expresses Gratitude for PM Modi’s Efforts to Achieve Exponential Growth for the Nation