షేర్ చేయండి
 
Comments
The UN needs to address the crisis of confidence it currently faces: PM Modi
For today’s interconnected world, we need a reformed multilateralism that reflects today’s realities: PM at UN
India is one of the largest contributors to the UN Peacekeeping Missions: PM Modi

ఐక్య రాజ్య స‌మితి సాధార‌ణ స‌భ అధ్య‌క్షుడు శ్రీ వోల్క‌న్ బోజ్‌ కిర్‌, శ్రేష్ఠులు, మ‌హిళ‌లు, స‌జ్జ‌నులారా,

న‌మ‌స్తే.

75 సంవ‌త్స‌రాల క్రింద‌ట యుద్ధ బీభత్సాల నుంచి ఒక కొత్త ఆశ రేకెత్తింది.  మాన‌వ జాతి చ‌రిత్ర లో మొట్ట‌మొద‌టి సారిగా యావ‌త్తు ప్ర‌పంచం కోసం ఒక సంస్థ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  ఐరాస అధికారపత్రంలో వ్య‌వ‌స్థాప‌క సంత‌కందారుగా భార‌త‌దేశం ఆ ప‌విత్ర‌ దార్శ‌నిక‌త లో పాలుపంచుకొంది.  ఈ ఘ‌ట‌న భార‌త‌దేశం స్వీయ సిద్ధాంత‌మైన ‘వ‌సుధైవ కుటుంబ‌క‌మ్‌’ (ఈ సృష్టి అంతా ఒకే కుటుంబం అనే భావన) కు అద్దం పట్టింది.  

మ‌న ప్ర‌పంచం ప్ర‌స్తుతం ఒక ఉత్త‌మ‌ ప్రాంతం గా ఉందీ అంటే అందుకు కార‌ణం ఐక్య రాజ్య స‌మితే.  ఐరాస పతాకం నీడలో అభివృద్ధి, శాంతి అనే ఆశ‌యాల‌ ను ముందుకు తీసుకుపోయిన వారంద‌రికీ- ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌క ద‌ళం సహా- మ‌నం శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టిద్దాం.  ఐరాస శాంతి ప‌రిర‌క్ష‌క ద‌ళాలకు పెద్ద ఎత్తున సైనికుల‌ ను అందించిన దేశాల్లో భార‌త‌దేశం కూడా ఉంది.  

ఎన్నో మైలురాళ్ళ‌ను అధిగ‌మించిన‌ప్ప‌టికీ, సిస‌లైన లక్ష్యాన్ని చేరుకోవడం ఇంకా అసంపూర్తిగానే ఉండిపోయింది.  చేయ‌వ‌ల‌సిన ప‌నులు ఎన్నో ఉన్నాయని ఈ రోజున మ‌నం స్వీకరిస్తున్న దీర్ఘ ప్రభావ ప్ర‌క‌ట‌న  సూచిస్తోంది. ఆ పనుల్లో.. ఘ‌ర్ష‌ణ ను నివారించ‌డం, అభివృద్ధి జ‌రిగేట‌ట్లు చూడ‌టం, జ‌ల‌వాయు ప‌రివ‌ర్త‌న సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం, అస‌మాన‌త‌ల‌ను త‌గ్గించ‌డం, డిజిట‌ల్ సాంకేతిక ప‌రిజ్ఞానాల ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవ‌డం.. వంటి కార్యాలు ఉన్నాయి.  ఐక్య రాజ్య స‌మితిని సైతం సంస్క‌రించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ ప్ర‌క‌ట‌న అంగీక‌రిస్తోంది.

మ‌నం కాలం చెల్లిన వ్య‌వ‌స్థ‌ల తో వర్తమాన కాలపు స‌వాళ్ళ ను ఎదుర్కోలేము.  స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ‌లకు బాట వేయ‌కుండా ఐరాస  విశ్వాస సంబంధిత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  ఒక దేశంపై మ‌రొక దేశం ప‌ర‌స్ప‌రం ఆధార‌ప‌డ్డ ప్ర‌స్తుత ప్ర‌పంచంలో సంస్క‌రణలకు చోటు ఉండే బ‌హుళ పక్షీయ సంస్థలు మనకు ఎంత‌యినా అవ‌స‌రం. అటువంటి సంస్థలు ఈనాటి వాస్త‌వాల‌కు అద్దం ప‌డుతూ, స్టేక్ హోల్డ‌ర్స్ అంద‌రికీ గళాన్ని ఇస్తూ, స‌మ‌కాలీన స‌వాళ్ళ ను ప‌రిష్క‌రించేవి అయి ఉండి, మాన‌వాళి సంక్షేమంపట్ల శ్ర‌ద్ధ వహించేవి కూడా అయి ఉండాలి.

ఈ విధమైన గ‌మ్యాన్ని చేరే దిశ లో, అన్ని దేశాల తో క‌ల‌సి కృషి చేసేందుకు భార‌త‌దేశం ఎదురుచూస్తున్నది.

మీకు ఇవే ధ‌న్య‌వాదాలు.

న‌మ‌స్తే.

Click here to read full text speech

Pariksha Pe Charcha with PM Modi
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
Oxygen Express: Nearly 3,400 MT of liquid medical oxygen delivered across India

Media Coverage

Oxygen Express: Nearly 3,400 MT of liquid medical oxygen delivered across India
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 9 మే 2021
May 09, 2021
షేర్ చేయండి
 
Comments

Modi Govt. taking forward the commitment to transform India-EU relationship for global good

Netizens highlighted the positive impact of Modi Govt’s policies on Ground Level