మలేషియాలోని కౌలాలంపూర్‌లో సామాజిక కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
కౌలాలంపూర్‌లోని ప్రవాస భారతీయుల ఆత్మీయతకు కృతజ్ఞుడను.. భారత్, మలేషియా మధ్య బలమైన వారధిగా నిరంతరం సేవలందిస్తున్న ప్రవాస భారతీయులు: పీఎం
ప్రపంచంలో అత్యధికంగా భారత సంతతి వారు నివసిస్తున్న దేశాల్లో మలేషియాది రెండో స్థానం.. భారత్, మలేషియా ప్రజల మధ్య బలమైన బంధం: పీఎం
శతాబ్దాలుగా మీరు సంప్రదాయాలను కాపాడుతున్న తీరు అద్భుతం.. మలేషియాలోని 500కు పైగా పాఠశాలల్లో పిల్లలకు భారతీయ భాషల బోధిస్తున్నట్లు రేడియో ప్రసంగం మన్ కీ బాత్‌లో ప్రస్తావన, 1.4 బిలియన్ భారతీయుల హర్షం: పీఎం
అనేక దశాబ్దాలుగా వివిధ రంగాల్లో సమాజానికి సేవలందిస్తున్న మలేషియాలోని ప్రవాస తమిళులు.. ఎన్నో శతాబ్దాల క్రితం ఇక్కడ స్థిరపడిన వారి సుదీర్ఘ చరిత్ర నుంచి స్ఫూర్తి పొంది, మలేషియా విశ్వవిద్యాలయంలో తిరువళ్లువర్ పీఠాన్ని ఏర్పాటు చేయటం గర్వకారణం.. ఇప్పుడు మన ఉమ్మడి వారసత్వాన్ని మరింత బలోపేతం చేయటానికి ఏర్పాటు చేయనున్న తిరువళ్లువర్ కేంద్రం: పీఎం
భారతదేశ విజయం, మలేషియా విజయం, ఆసియా విజయం.. మన సంబంధానికి మార్గనిర్దేశం చేసే పదం ఇంపాక్ట్.. ఇండియా, మలేషియా పార్టనర్‌షిప్ ఫర్ అడ్వాన్సింగ్ కలెక్టివ్ ట్రాన్స్‌ఫార్మేషన్: పీఎం
భారతదేశంలో పర్యటించి, 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' అనుభూతిని పొందాలని మలేషియా వాసులకు పిలుపు.. స్నేహితులతో కలిసి రండి.. ప్రజల మధ్య పరస్పర సంబంధాలే మన మైత్రికి ఆధారం: పీఎం
అభివృద్ధి పథంలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్.. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఈయూ, అమెరికా వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలే దీనికి నిదర్శనం.. విశ్వసనీయత భారతదేశానికి అత్యంత బలమైన కరెన్సీ: పీఎం

గౌరవనీయులైన ప్రధాని అన్వర్ ఇబ్రహీం గారికి,

నా ప్రియమైన స్నేహితులారా, సోదరీసోదరులారా,

సలామత్ పాతాంగ్!

వణక్కమ్!

సుఖమానో? 

సత్ శ్రీ అకాల్!

బాగున్నారా?

కేమ్-ఛో?

మీ సాదర స్వాగతం మన ఉమ్మడి సంస్కృతికి ఉన్న అద్భుతమైన వైవిధ్యాన్ని తెలియజేస్తోంది. 

ముందుగా ఈ సామాజిక వేడుకలో పాల్గొన్న నా ప్రియ మిత్రుడు ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారికి నా ధన్యవాదాలు. ఇప్పుడే చేసిన ప్రసంగంలో భారత్-మలేషియా స్నేహానికి ఉన్న విస్తృతి, భవిష్యత్తు సామర్థ్యం గురించి ఆయన చెప్పిన మంచి మాటలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

అంతేకాదు ప్రధాని స్వయంగా విమానాశ్రయానికి వచ్చి నాకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తన కారులో నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. కేవలం తన కారును మాత్రమే కాకుండా తన సీటును కూడా పంచుకున్నారు. ఈ ప్రత్యేకమైన ఆత్మీయత భారత్‌తో పాటు మీ అందరిపై ఆయనకు ఉన్న ప్రేమ, గౌరవానికి నిదర్శనం.

మీ ఆత్మీయ మాటలు, ఆతిథ్యం, స్నేహానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. 

మిత్రులారా, 

మనం ఇప్పుడే ఒక రికార్డు స్థాయి సాంస్కృతిక ప్రదర్శనను చూశాం. 800 మందికి పైగా కళాకారులు అద్భుతమైన సమన్వయంతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనను మన ప్రజలు రాబోయే ఎన్నో ఏళ్లపాటు గుర్తుంచుకుంటారు. మీకు అభినందలు తెలియజేస్తున్నాను. ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులందరినీ అభినందిస్తున్నాను. 

మిత్రులారా,

ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం గారు ప్రధాని కాకముందు నుంచే మేం స్నేహితులం. సంస్కరణల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ, ఆయన గొప్ప మేధస్సు, 2025లో ఆసియాన్ అధ్యక్షుడిగా ఆయన సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించటం పట్ల నేను అభినందనలు తెలియజేస్తున్నాను. 

మనం ప్రపంచంలోనే అతిపెద్ద 'డిజిటల్ ప్రజా మౌలికసదుపాయం', అతిపెద్ద ఆర్థిక సాంకేతికత వ్యవస్థను తయారుచేశాం. మన యూపీఐ ప్లాట్‌ఫా‌మ్ కారణంగా ప్రపంచంలోని తక్షణ డిజిటల్ లావాదేవీలలో దాదాపు సగం దేశంలోనే జరుగుతున్నాయి.

వేగంగా వృద్ధి చెందుతూనే మన వృద్ధి పర్యావరణహితంగా ఉండేలా చూసుకున్నాం. ఒక దశాబ్దంలో మన సౌర శక్తి సామర్థ్యం దాదాపు 40 రెట్లు పెరగటం అనేది దీనికి ఒక మంచి ఉదాహరణ. 

మిత్రులారా,

గతంలో భారతదేశాన్ని కేవలం ఒక భారీ మార్కెట్‌లా మాత్రమే చూసేవారు. ఇప్పుడు మనం పెట్టుబడులు, వాణిజ్యానికి ఒక కేంద్రంగా మారాం. వృద్ధికి ఒక 'నమ్మకమైన భాగస్వామి'గా భారతదేశాన్ని నేడు ప్రపంచం గుర్తిస్తోంది. బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఐరోపా సమాఖ్య, అమెరికా.. ఇలా ఎన్నో దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. నమ్మకం అనేది నేడు భారతదేశపు అత్యంత బలమైన డబ్బుగా మారింది.

మిత్రులారా,

భారతదేశం మిమ్మల్ని ఎల్లప్పుడూ రెండు చేతులతో ఆహ్వానిస్తుంది. అందుకే కొన్ని నెలల క్రితం మేం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. మలేషియాలోని భారత సంతతి పౌరులకు 'ఓసీఐ కార్డ్' అర్హతను 6వ తరం వరకు పొడిగించాం. 

మేం 'ఇండియన్ స్కాలర్‌షిప్స్ ట్రస్ట్ ఫండ్'కు మద్దతు ఇస్తూ వస్తున్నాం. ఇప్పుడు విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వీలుగా 'తిరువళ్లువర్ ఉపకారవేతనాలను' కూడా అందించబోతున్నాం. అలాగే 'భారత్ గురించి తెలుసుకోండి కార్యక్రమం'లో మిమ్మల్ని చూడాలని మేం కోరుకుంటున్నాం. 

మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే.. త్వరలోనే మేం మలేషియాలో భారతదేశపు కొత్త 'కాన్సులేట్'ను ప్రారంభించనున్నాం. ఇది మనల్ని మరింత దగ్గర చేస్తుంది.

మిత్రులారా,

140 కోట్ల మంది భారతీయులు 2047 నాటికి 'వికసిత్‌ భారత్'ను నిర్మించాలని కోరుకుంటున్నారు.

వికసిత్ భారత్‌ను తయారుచేయాలి కదా?

మనం వికసిత్ భారత్‌ను నిర్మించి తీరుతామా లేదా? 

మనం మన కలలను సాకారం చేసుకుంటామా లేదా?

మనం మన కలలను సంకల్పాలుగా మారుస్తామా లేదా?

మనం మన సంకల్పాన్ని సిద్ధింపజేసుకుంటామా లేదా?

ఈ ప్రయాణంలో మన ప్రవాస భారతీయులు, భారత సంతతి గలవారు అత్యంత విలువైన భాగస్వాములు. మీరు కౌలాలంపూర్‌లో పుట్టినా లేదా కోల్‌కతాలో పుట్టినా.. మీ హృదయాల్లో భారత్ ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. మలేషియా, భారతదేశాల పురోగతిలో మీరు క్రియాశీలక భాగస్వాములు. సంపన్న మలేషియా, 'వికసిత్ భారత్' కలలను సాకారం చేయడంలో మీరు ఖచ్చితంగా సహాయపడతారు.

జై హింద్!

జుంపా లాగి!

మిక్కా నండ్రి!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
నిస్వార్థ సేవ భావనను బోధించే సంస్కృత సుభాషితాన్ని తెలియజేసిన ప్రధానమంత్రి
August 07, 2026

నిస్వార్థ సేవ గుణాన్ని, ఇతరుల వద్ద నుంచి మరేదీ ఆశించకుండా వారి మేలు కోసం పని చేయాలనే గొప్ప ఆదర్శాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

‘‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’’

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’ అని పేర్కొన్నారు.