స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామ్ జీ కృష్ణ వర్మ సుమారు రెండు దశాబ్దాల క్రితం చేసిన కృషి వల్ల దీర్ఘకాలిక ఆశయం నెరవేరిందని, ఇది తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
శ్యామ్ జీ కృష్ణ వర్మ 1930లో మరణించగా, భారత్ స్వాతంత్య్రం పొందిన తర్వాతే ఆయన అస్థికలు దేశానికి చేరాలన్న చిరకాల కోరిక, దశాబ్దాల తర్వాత 2003లో నెరవేరింది. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ చొరవ తీసుకుని, శ్యామ్ జీ అస్థికలను స్విట్జర్లాండ్ లోని జెనీవా నుంచి భారత్ కు రప్పించారు.
ఈ చొరవ ద్వారా ధైర్యవంతుడైన భరతమాత పుత్రుడి జ్ఞాపకాలను గౌరవించామని, స్వాతంత్య్ర ఉద్యమ వారసత్వాన్ని పరిరక్షించాలనే దేశ నిబద్ధతను స్పష్టం చేశామని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
శ్యామ్ జీ కృష్ణ వర్మ జీవితం, న్యాయం కోసం నిర్భయంగా ఆయన చేసిన పోరాటం, భారతదేశ స్వాతంత్య్రం పట్ల ఆయన చూపిన అంకితభావం గురించి ఎక్కువ మంది యువ భారతీయులు తెలుసుకోవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
ఎక్స్ లో శ్రీ నరేంద్ర మోదీ ఆర్కైవ్ హ్యాండిల్ పోస్టుకు ప్రతిస్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
“సుమారు రెండు దశాబ్దాల కిందట చేపట్టిన చారిత్రక కృషి వల్ల శ్యామ్ జీ కృష్ణ వర్మ కోరిక నెరవేరింది. భరతమాత సాహసపుత్రుడికి గౌరవం లభించింది.
ఆయన గొప్పతనం, ధైర్యం గురించి దేశ యువత తెలుసుకోవాలని ఆశిస్తున్నాను!”
This thread highlights a very satisfying effort undertaken about two decades ago, thus fulfilling a wish of Shyamji Krishna Varma and honouring a courageous son of Maa Bharti.
— Narendra Modi (@narendramodi) October 4, 2025
May more youngsters read about his greatness and bravery! https://t.co/H6NwdQC3zu




