మాననీయ ఫిన్లాండ్‌ అధ్యక్షులు స్టూబ్‌, రెండు దేశాల విశిష్ట ప్రతినిధులు, మాధ్యమ మిత్రులారా...

అభివందనం!

తెర్వే! (స్వాగతం)

ఫిన్లాండ్ అధ్యక్ష హోదాలో తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన గౌరవనీయ అలెక్సాండర్‌ స్టూబ్‌ గారికి నా హృదయపూర్వక స్వాగతం. ఆయనొక విశిష్ట ప్రపంచ నాయకుడు మాత్రమేగాక మాననీయ రచయిత.. విజ్ఞాని కూడా.

మహోదయా... ఈ ఏడాది రైసినా చర్చలకు మీలాంటి అనుభవజ్ఞులు, చైతన్యవంతమైన నాయకుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం మాకెంతో గౌరవప్రదమేగాక హర్షించాల్సిన అంశం.

మిత్రులారా!

ప్రపంచమంతటా నేడు అస్థిరత, అనిశ్చితి నెలకొంటోంది. ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా దాకా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు సంఘర్షణాత్మక పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటువంటి వాతావరణం నడుమ ప్రపంచంలో రెండు ప్రధాన దౌత్య శక్తులైన భారత్‌, ఐరోపా దేశాలు తమ సంబంధాల్లో స్వర్ణ శక ప్రవేశం చేస్తున్నాయి. మన మధ్య ఇనుమడిస్తున్న సహకారం ప్రపంచ స్థిరత్వం, అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు కొత్త బలాన్నిస్తోంది.

మిత్రులారా!

ఈ ఏడాది (2026) ప్రారంభంలో చారిత్రక భారత్‌-ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్‌, ఫిన్లాండ్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని ఇది మరింత విస్తృతం చేస్తుంది. అలాగే, డిజిటల్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, సుస్థిరతలకు సంబంధించి మన రెండు దేశాలూ కీలక భాగస్వాములుగా ఉన్నాయి.

 

నోకియా మొబైల్ ఫోన్లు, టెలికాం నెట్‌వర్క్‌ ఒకనాడు యావద్భారతంలో లక్షలాది ప్రజానీకాన్ని అనుసంధానించాయి. ఫిన్నిష్ వాస్తుశిల్పుల సహకారంతో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెనను మేం నిర్మించాం. అంతేకాకుండా వెదురు నుంచి ఇథనాల్‌ తీసే బయోఇథనాల్‌ శుద్ధి కర్మాగారాన్ని ఫిన్లాండ్ భాగస్వామ్యంతో భారత్‌లోని నుమాలిగఢ్‌లో ఏర్పాటు చేశాం.

మిత్రులారా!

ఇలాంటి కీలక కార్యక్రమాల స్ఫూర్తితో అధ్యక్షులు స్టూబ్‌ పర్యటన సందర్భంగా భారత్‌-ఫిన్లాండ్ సంబంధాల డిజిటలీకరణ, సుస్థిరతలలో వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరిస్తున్నాం. తద్వారా కృత్రిమ మేధ, (ఏఐ) నుంచి 6జి టెలికమ్యూనికేషన్ల దాకా, కాలుష్య రహితం ఇంధనం నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకూ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో మా సహకారానికి సరికొత్త వేగం, ఉత్తేజం లభిస్తాయి.

అదే సమయంలో రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల వంటి ప్రధాన రంగాల్లోనూ మా భాగస్వామ్యం మరింత విస్తరిస్తుంది. యావత్‌ ప్రపంచానికీ విశ్వసనీయ సాంకేతికతలు సహా పునరుత్థాన సరఫరా వ్యవస్థలకు భరోసా ఇవ్వడంలో భారత్‌-ఫిన్లాండ్ వంటి ప్రజాస్వామ్య, బాధ్యతాయుత దేశాల ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదం చేస్తుంది.

మిత్రులారా!

భారత విద్యార్థులకు, యువతరం ప్రతిభకు ప్రాధాన్యమిచ్చే గమ్యంగా ఫిన్లాండ్ స్థానం నానాటికీ బలపడుతోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల ఆవిష్కరణావరణ వ్యవస్థల అనుసంధానం దిశగా మేమివాళ ఫిన్లాండ్‌తో సమగ్ర వలస-ఆదానప్రదాన ఒప్పందం ఖరారు చేసుకున్నాం.

అంతేగాక ఉమ్మడి పరిశోధన-అంకుర వ్యవస్థ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాం. విద్యా రంగంలో ఫిన్లాండ్ ఒక ఆదర్శప్రాయ దేశం. అందుకే- ఉపాధ్యాయ శిక్షణ, పాఠశాల స్థాయి  భాగస్వామ్యాలు, విద్యపై భవిష్యత్‌ పరిశోధనలలో సహకార విస్తృతికీ మేం అంగీకారానికి వచ్చాం.

సంక్షిప్తంగా- పాఠశాలల నుంచి పరిశ్రమల దాకా మానవాభివృద్ధి దిశగా ప్రతి స్థాయిలో మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేశాం.

 

మిత్రులారా!

నార్డిక్ ప్రాంతంలో భారత్‌కు ఫిన్లాండ్ ఓ కీలక భాగస్వామి... ఆ మేరకు మేం సంయుక్తంగా ఆర్కిటిక్, ధ్రువ పరిశోధనలోనూ సహకారాన్ని విస్తృతం చేసుకుంటున్నాం.

ఆరోగ్యకర భూగోళం మా ఉమ్మడి ప్రాధాన్యం... ఈ నేపథ్యంలో త్వరలోనే ఫిన్లాండ్‌తో సంయుక్తంగా భారత్‌లో ‘వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్‌’ సదస్సును మేం నిర్వహించడంపై మాకెంతో సంతోషదాయకం. స్థిరత్వం దిశగా మా కృషికి ఇది నవ్య దృక్పథాన్ని, ఉత్తేజాన్ని జోడిస్తుంది.

మిత్రులారా!

చట్టబద్ధ పాలన, చర్చలు, దౌత్యం తదితర ప్రక్రియలపై భారత్‌, ఫిన్లాండ్ రెండింటికీ అపార విశ్వాసం ఉంది. సైనిక చర్యలతో ఏ సమస్యకూ పరిష్కారం లభించదనే అంశంపై మేం ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఉక్రెయిన్‌ లేదా పశ్చిమాసియా సహా ప్రపంచంలో ఎక్కడైనా ఘర్షణలకు త్వరగా స్వస్తి చెప్పి, శాంతి పునరుద్ధరణ దిశగా అన్ని మార్గాల్లో సాగే కృషికి మేం పూర్తి మద్దతును కొనసాగిస్తాం.

ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న సమస్యల పరిష్కారం దిశగా అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు తేవడం అత్యంత అవశ్యమని మేం ఏకాభిప్రాయం ప్రకటిస్తున్నాం. అంతేకాకుండా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ, దాని నిర్మూలనను మా ఉమ్మడి బాధ్యతగా పరిగణిస్తున్నాం.

 

మహోదయా!

మీ దేశంలో ‘ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌’ను పోటీలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో మీ వంటి శక్తిమంతులైన నాయకులతో సంయుక్తంగా భారత్‌- ఫిన్లాండ్ మధ్య ఆవిష్కరణ, డిజిటలీకరణ, సుస్థిరతల నవ్య ‘ట్రయాథ్లాన్‌’ను లక్ష్యాన్ని సాధించగలమని ప్రగాఢ విశ్వాసం ప్రకటిస్తున్నాను.

భారత-ఫిన్లాండ్ మధ్య ఈ భవిష్యత్ భాగస్వామ్యంలో సరికొత్త సువర్ణ అధ్యాయానికి ఇక శ్రీకారం చుడదాం!

అనేకానేక ధన్యవాదాలు.

 

 

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India steps up semiconductor push, seeks to turn ‘Make In India’ into ‘Engineer in India’

Media Coverage

India steps up semiconductor push, seeks to turn ‘Make In India’ into ‘Engineer in India’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlighting prayers for peace, well-being, and harmony with nature
September 07, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting prayers for peace, well-being, and harmony with nature.

The Prime Minister wrote on X;

"शं नो वातः पवतां शं नस्तपतु सूर्यः।

शं नः कनिक्रदद् देवः पर्जन्योऽभिवर्षतु॥"

May the wind blow for us in a peaceful, wholesome, and purifying way. May the Sun shine upon us as a source of well-being and blessing. May it's warmth and light bring us comfort and joy. And may the divine Rain-God, Parjanya, shower life-giving and auspicious rain upon us.