పరాక్రమశాలి, యోధుడు మహారాణా ప్రతాప్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
‘‘దేశ అమర సేనాని మహారాణా ప్రతాప్‌నకు ఆయన జయంతి సందర్భంగా కోటానుకోట్ల వందనాలు. మాతృభూమి గౌరవాన్ని సంరక్షించడానికి ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు, శౌర్యం ఈనాటికీ మన వీరులకు, వీరాంగనలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. భరత మాతకు అంకితమైన ఆయన పరాక్రమ భరిత జీవనం దేశ ప్రజలకు సదా ప్రేరణను ఇస్తూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
देश के अमर सेनानी महाराणा प्रताप को उनकी जयंती पर कोटि-कोटि नमन। मातृभूमि के स्वाभिमान की रक्षा के लिए उन्होंने जिस साहस और शौर्य का परिचय दिया था, वह आज भी हमारे वीर-वीरांगनाओं के लिए पथ-प्रदर्शक बना है। मां भारती को समर्पित उनका पराक्रमी जीवन देशवासियों को सदैव प्रेरित करता…
— Narendra Modi (@narendramodi) May 9, 2025


