బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.
సమాజంలోని అణగారిన, వెనకబడిన, బలహీన వర్గాల అభ్యున్నతే ఎల్లప్పుడూ కర్పూరీ ఠాకూర్ రాజకీయాల్లో ప్రధానాంశమని ప్రధానమంత్రి అన్నారు. జననాయక్ కర్పూరి ఠాకూర్ తన సాదాసీదా జీవనం, ప్రజా సేవకు ఆయన చూపిన అంకిత భావాల ద్వారా ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని తెలిపారు. ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘బిహార్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న జననాయక్ కర్పురి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు. సమాజంలో దోపిడీకి గురైన, అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతే ఎల్లప్పుడూ ఆయన రాజకీయాల్లో కేంద్రబిందువుగా ఉండేది. తన నిరాడంబరత, ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకితభావంతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. అందరికీ ఆదర్శంగా నిలిచిపోతారు’’.
बिहार के पूर्व मुख्यमंत्री भारत रत्न जननायक कर्पूरी ठाकुर जी को उनकी जयंती पर सादर नमन। समाज के शोषित, वंचित और कमजोर वर्गों का उत्थान हमेशा उनकी राजनीति के केंद्र में रहा। अपनी सादगी और जनसेवा के प्रति समर्पण भाव को लेकर वे सदैव स्मरणीय एवं अनुकरणीय रहेंगे। pic.twitter.com/ACf7ZCRURS
— Narendra Modi (@narendramodi) January 24, 2026


