దేశవిభజన- భయ విహ్వలత సంస్మరణ దినాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాటించారు. భారతదేశ చరిత్రలో అత్యంత విషాదభరిత అధ్యాయాల్లో ఒకటైన విభ‌జ‌న కాలంలో, ఎంతో మంది ప్రజలు ఎదుర్కొన్న కష్టనష్టాలను, పడ్డ వేదనను ఈ సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు.

విభజన కాలంలో ఇబ్బందులు పడిన వారు చాటిన మనోనిబ్బరానికీ, వారి ధీరత్వానికీ ప్రధానమంత్రి హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. వారు ఊహించలేనన్ని కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచారనీ, మళ్లీ కొత్త జీవితాల్ని నిర్మించుకోగలిగారనీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:

‘‘దేశవిభజన- భయ విహ్వలత సంస్మరణ దినాన్ని (#PartitionHorrorsRemembranceDay) పాటిస్తోంది భారత్. మన దేశ చరిత్రలో దుఖ్ఖభరిత అధ్యాయమైన ఆ కాలంలో ఎంతో మంది ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులనూ, పడ్డ వేదననూ దేశం స్మరించుకుంటోంది. ఇది వారి ధైర్య, సాహసాలను గౌరవించే రోజు.. ఊహకు అందనన్ని కష్టనష్టాలకు ఎదురొడ్డి నిలిచి, తమ జీవన యాత్రను మళ్లీ సరికొత్తగా మొదలుపెట్టే శక్తిని కూడదీసుకున్నారు. ఆనాటి బాధితుల్లో చాలా మంది తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవడంతోపాటు అసాధారణ విజయాలనూ సాధించారు. మన దేశాన్ని ఏకతాటి మీద నిలబెడుతున్న సద్భావన బంధాల్ని సదా బలపరుస్తూ ఉండాల్సిన బాధ్యత మనందరి మీదా ఉందని కూడా ఈ రోజు మనకు గుర్తు చేస్తోంది.’’  ‌

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit

Media Coverage

PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 మే 2026
May 04, 2026

Green Roads, Smart Tolls, Trillion-Dollar Dreams: How PM Modi's Policies are Supercharging a Modern India