సంత్ కబీర్ దాస్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు తన హృదయపూర్వక నివాళులు అర్పించారు. సామాజిక సద్భావనతో పాటు సంస్కరణ కోసం సంత్ కబీర్ దాస్ తన జీవన పర్యంతం అంకితభావాన్ని కనబరిచారని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో :
‘‘సామాజిక సామరస్యం కోసం జీవన పర్యంతం అంకితభావంతో నడుచుకున్న సంత్ కబీర్ దాస్ గారికి ఆయన జయంతి సందర్భంగా నేను కోటానుకోట్ల వందనాలు సమర్పిస్తున్నాను. ఆయన దోహాలలో శబ్ద సరళత్వంతో పాటు ప్రగాఢ భావాలను కూడా గమనించవచ్చు. ఈ కారణంగానే భారతీయుల హృదయాల్లో ఆయన ప్రభావం ఈనాటికీ గూడుకట్టుకుని నిలిచింది. సంఘంలో పేరుకుపోయిన దుష్ట సంప్రదాయాల్ని తరిమికొట్టడంలో ఆయన అందించిన తోడ్పాటును మనమంతా శ్రద్ధాపూర్వకంగా స్మరించుకొంటూనే ఉంటాం.’’ అని పేర్కొన్నారు.
सामाजिक समरसता के प्रति आजीवन समर्पित रहे संत कबीरदास जी को उनकी जयंती पर मेरा कोटि-कोटि नमन। उनके दोहों में जहां शब्दों की सरलता है, वहीं भावों की प्रगाढ़ता भी है। इसलिए आज भी भारतीय जनमानस पर उनका गहरा प्रभाव है। समाज में फैली कुरीतियों को दूर करने में उनके योगदान को हमेशा… pic.twitter.com/5d7ArARMHH
— Narendra Modi (@narendramodi) June 11, 2025


