హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్‌ను తలుచుకొని గౌరవించుకొనే ఉద్దేశంతో ఏటా ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవంగా దేశ ప్రజలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రీడారంగ ముఖచిత్రంలో నిరంతరంగా చోటుచేసుకొంటున్న మార్పులను ఆయన ప్రస్తావిస్తూ, క్రీడలతో పాటు దేహ దారుఢ్య సంస్కృతిని పెంపొందించడానికి ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. క్రీడాకారులకు సంస్థాపరమైన మద్దతును బలోపేతం చేస్తామనీ, దేశం నలు మూలల ఆధునిక శిక్షణ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఆటల పోటీల నిర్వహణకు అనువైన మైదానాలను కూడా ఏర్పాటు చేస్తామనీ ఆయన స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి నమోదు చేస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ విశిష్టత సందర్భంగా, మనం మేజర్ ధ్యాన్ చంద్ జీకి నివాళులు అర్పిస్తాం.. ఆయన కనబరిచిన ప్రతిభ తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తోంది.
గత పది సంవత్సరాల్లో, భారత క్రీడారంగ ముఖచిత్రం అసాధారణ మార్పులకు లోనైంది. క్షేత్ర స్థాయి కార్యక్రమాలు యువ ప్రతిభావంతులకు ప్రోత్సాహకరంగా ఉండడం మొదలు ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడం వరకు, మనం మన దేశంలో హుషారైన క్రీడా రంగ అనుబంధ విస్తారిత వ్యవస్థ పరిఢవిల్లడాన్ని మనం గమనిస్తున్నాం. క్రీడాకారులకు సాయపడడానికీ, మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో పాటు క్రీడల పరంగా శ్రేష్ఠత్వానికి ప్రపంచ కూడలిగా ఇండియాను తీర్చిదిద్దడానికీ మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.’’
Greetings on National Sports Day! On this special occasion, we pay tribute to Major Dhyan Chand Ji, whose excellence continues to inspire generations.
— Narendra Modi (@narendramodi) August 29, 2025
In the last decade, India’s sporting landscape has undergone a remarkable transformation. From grassroots programmes that…


