ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్‌ పర్యటనలో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్‌ జెట్టెన్‌తో సంయుక్తంగా ఆ దేశంలోని వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవో)తో సమావేశమయ్యారు. ఇంధనం, ఓడరేవులు, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు రంగాల్లోని ప్రసిద్ధ కంపెనీల ‘సీఈవో’లతో అనేక అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్లు, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, రవాణా, సముద్ర రంగం, సుస్థిరత, ఇంధనం, వ్యవసాయ రంగాలపై తమ ఆలోచనలను పంచుకుంటూ, భారత్‌కు సంబంధించి తమ వ్యాపార వ్యూహాలను వివరించారు.

ఈ సమావేశానికి ముందు ఇద్దరు ప్రధానమంత్రుల సమక్షంలో ‘ఏఎస్ఎంఎల్’, టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. గుజరాత్‌లోని ధోలేరాలో భారత తొలి ‘ఫ్రంట్-ఎండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్’ పురోగమనం ధ్యేయంగా ఈ సంస్థలు ఏర్పరచుకున్న భాగస్వామ్యంపై వారిద్దరూ హర్షం ప్రకటించారు.

భారత-నెదర్లాండ్స్ వాణిజ్య-వ్యాపార సంబంధాలు బలపడటం తమకెంతో సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక చైతన్యంపై డచ్ కంపెనీలలో  పెరుగుతున్న ఆసక్తిని ప్రశంసించారు. ఇటీవలి సంస్కరణలు, కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- వాణిజ్య సౌలభ్యం మెరుగుదలతోపాటు సుస్థిర, సమర్థ, అంచనా సహిత విధాన వాతావరణం ఏర్పరిచేందుకు చేస్తున్న కృషిని ఆయన వివరించారు. ముఖ్యంగా సముద్ర రంగం, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సాంకేతికతలు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో భారత్‌ సృష్టిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని డచ్‌ కంపెనీలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.

భారత్-ఐరోపా సమాఖ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) త్వరగా అమలులోకి తేవాలని తమతమ యంత్రాంగాలను ప్రధానమంత్రులు ఇద్దరూ ఆదేశించారు. స్వేచ్ఛా విపణులు, సార్వజనీన వృద్ధి, పటిష్ట సరఫరా వ్యవస్థపై నిబద్ధతగల విశ్వసనీయ భాగస్వాములుగా భారత్, ఐరోపా సమాఖ్యల బంధం ఈ ‘ఎఫ్‌టీఏ’తో మరింత బలోపేతం అవుతుంది.

భారత ప్రభుత్వ సంస్కరణల కార్యక్రమాన్ని డచ్‌ పారిశ్రామిక రంగ ప్రముఖులు ప్రశంసించారు. భారత్‌లో వాణిజ్యానికి సంబంధించి తమ భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. భారత్‌లో తమ సంస్థల స్థాపనకుగల అవకాశాల అన్వేషణ దిశగా వారు ఆసక్తి ప్రదర్శించారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ సంస్థల ‘సీఈవో’ల జాబితా కింది విధంగా ఉంది:

1.    కీత్‌ స్వెండ్‌సెన్‌, ఏపీఎం టెర్మినల్స్‌, ఓడరేవులు, రవాణా, సరఫరా వ్యవస్థ మౌలిక సదుపాయాల రంగం

2.   క్రిస్టోఫ్‌ ఫౌకెట్‌, ఏఎస్‌ఎంఎల్‌ అధ్యక్షుడు-సీఈవో, సెమీకండక్టర్ల రంగం

3.   అర్నాట్‌ డామెన్‌, డామెన్‌ షిప్‌యార్డ్స్‌ గ్రూప్‌, షిప్‌బిల్డింగ్‌ రంగం

4.   డాల్ఫ్‌ వాన్‌ డెన్‌ బ్రింక్‌, హెయినెకెన్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌-సీఈవో, బ్రూయింగ్‌ రంగం

5.   మార్జాన్‌ రింటెల్‌, కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్‌ అధ్యక్షుడు-సీఈవో, విమానయాన రంగం

6.   మారిస్‌ జెరేట్స్‌, ఎన్‌ఎక్స్‌పీ సెమీకండక్టర్స్‌ నెదర్లాండ్స్‌ సీఈవో, సెమీకండక్టర్‌ రంగం

7.   రాయ్‌ జాకోబ్స్‌, ఫిలిప్స్‌ సంస్థ సీఈవో, ఆరోగ్య సంరక్షణ రంగం

8.   బౌడెవీన్‌ సీమన్స్‌, పోర్ట్‌ ఆఫ్‌ రోటర్‌డామ్‌ సీఈవో, లాజిస్టిక్స్‌-పోర్ట్‌ మేనేజ్‌మంట్‌ రంగం

9.   ఓక్కో రోలెఫ్‌సెన్‌, పవర్‌2ఎక్స్‌ సీఈవో, క్లీన్‌ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్సిషన్‌ రంగం

10.  ఫాబ్రికో బ్లోయిసి, ప్రోసస్‌ సంస్థ సీఈవో, కన్జ్యూమర్‌ ఇంటర్‌నెట్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రంగం

11.   శాండర్‌ వాంట్‌ నూర్డెండీ, రాండ్‌స్టాడ్‌ సంస్థ సీఈవో, హ్యూమన్‌ రిసోర్సెస్‌ సర్వీసెస్‌ రంగం

12.  మార్టిన్‌ ఎగ్గింక్‌, రిజిక్‌ జడీల్ట్‌ ఎయ జాడెండెల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, అగ్రిబిజినెస్‌ రంగం

13.  హన్స్‌ హుయిస్ట్రా, రాయల్‌ హెచ్‌జడ్‌పీసీ సంస్థ సీఈవో, అగ్రిబిజినెస్‌ అండ్‌ సీడ్‌ రంగం

14.  డెర్క్‌ టీ బొక్కెల్‌, రాయల్‌ ఐహెచ్‌సీ సంస్థ సీఈవో, షిప్‌బిల్డింగ్‌ రంగం

15.  డిక్‌ రిచెల్‌, రాయల్‌ వోపాక్‌ ఎగ్జిక్యూటివ్‌ డోర్డు చైర్మన్‌-సీఈవో, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లాజిస్టిక్స్‌ రంగం

16.  గవర్ట్‌ వాన్‌ ఊర్డ్‌, వాన్‌ ఊర్డ్‌ సంస్థ సీఈవో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగం

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'We'll provide AI skill training to 1 crore youth': PM Modi's big announcement on Independence Day 2026

Media Coverage

'We'll provide AI skill training to 1 crore youth': PM Modi's big announcement on Independence Day 2026
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 ఆగష్టు 2026
August 15, 2026

Azadi Ka Amrit Mahotsav Continues: PM Modi’s Independence Day Vision Unites Growth, Youth Power & National Pride