కోచి-లక్షద్వీప్ ఐలండ్స్ సబ్‌మరీన్ ఆప్టికల్ ఫైబర్కనెక్శన్ ను ఆయన ప్రారంభించారు
కద్‌మత్ లో లో టెంపరేచర్ థెర్మల్ డిసెలినేశన్ (ఎల్‌టిటిడి) ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితమిచ్చారు
ఆగత్తీ మరియు మినికాయ్ దీవుల లో అన్ని కుటుంబాల కు పంపు కనెక్శన్ (ఎఫ్‌హెచ్‌టిసి) లను అందుబాటు లోకి తెస్తున్నట్లు ప్రకటించారు
కవరత్తి లో సౌర విద్యుత్తు ప్లాంటు ను దేశ ప్రజల కుఅంకితం చేశారు
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం పునర్నవీకరణ కు శంకుస్థాపన చేశారు; అలాగే అయిదు మాడల్ ఆంగన్‌వాడీ సెంటర్స్ కు కూడా శంకుస్థాపన చేశారు
‘‘లక్షద్వీప్ యొక్కభౌగోళిక విస్తీర్ణం చిన్నదే అయినప్పటికీ ప్రజల హృదయాలు సాగరమంత లోతైనవి గా ఉన్నాయి’’
‘‘మా ప్రభుత్వం సుదూర ప్రాంతాల, సరిహద్దు ప్రాంతాల, కోస్తా తీర ప్రాంతాల మరియు ద్వీప ప్రాంతాల ను అగ్ర ప్రాధాన్యం గా తీసుకొంది’’
‘‘ప్రభుత్వపథకాలన్నీ ప్రతి ఒక్క లబ్ధిదారు చెంత కు చేరేటట్లుగా కేంద్ర ప్రభుత్వంపాటుపడుతున్నది’’
‘‘ఎగుమతి చేయదగ్గ మంచి నాణ్యత కలిగిన చేపలకు గల బోలెడన్ని అవకాశాలు స్థానిక మత్స్యకారుల జీవనం రూపు రేఖల ను ఎంతగానో మార్చివేయగలుగుతాయి’’
‘‘లక్షద్వీప్ యొక్క శోభ తో పోల్చి చూసినప్పుడు ప్రపంచం లోని అన్ని ప్రాంతాలు చిన్నబోతాయి’’
‘‘ఒక వికసిత్ భారత్ ను ఆవిష్కరించడం లో లక్షద్వీప్ ఒకదృఢమైన పాత్ర ను పోషించగలుగుతుంది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లక్షద్వీప్ లోని కవరత్తి లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం, ప్రారభించడంల తో పాటు ఆ పథకాల ను దేశ ప్రజల కు అంకితమిచ్చారు కూడాను. ఆయా ప్రాజెక్టుల విలువ 1150 కోట్ల రూపాయల కు పైగానే ఉంది. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల లో భాగం గా సాంకేతిక విజ్ఞానం, శక్తి, జల వనరులు, ఆరోగ్య సంరక్షణ, ఇంకా విద్య లు సహా అనేకమైన రంగాల కు చెందిన పథకాలు ఉన్నాయి. లాప్‌టాప్ స్కీము లో భాగం గా విద్యార్థుల కు ప్రధాన మంత్రి లాప్‌టాప్ లను అందజేయడం, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం లో భాగం గా పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ళ ను ఇవ్వడం చేశారు. రైతుల కు మరియు మత్స్యకార లబ్ధిదారుల కు పిఎమ్ కిసాన్ క్రెడిట్ కార్డుల ను సైతం ఆయన అందజేశారు.

 

జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, లక్షద్వీప్ యొక్క శోభ మాటల కు అందనిది అని అభివర్ణించారు. తాను ఆగత్తీ, బంగారం మరియు కవరత్తి లను సందర్శించి, అక్కడి పౌరుల తో భేటీ అయిన సంగతి ని ఆయన ప్రస్తావించారు. ‘‘లక్షద్వీప్ యొక్క భౌగోళిక విస్తీర్ణం చిన్నదే అయినప్పటికీ కూడాను ప్రజల మనస్సు లో సాగరమంత లోతైనవి గా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి చెప్తూ, వారు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నందుకు గాను వారి కి ఆయన తన ధన్యవాదాల ను తెలియ జేశారు.

సుదూర ప్రాంతాల ను, సరిహద్దు ప్రాంతాల ను, కోస్తా తీర ప్రాంతాల ను మరియు ద్వీపాల ప్రాంతాల ను చాలా కాలం గా చిన్నచూపు చూడటం జరిగింది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘‘అటువంటి ప్రాంతాల కు ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలి అని మా ప్రభుత్వం సంకల్పించుకొంది’’ అని ఆయన అన్నారు. మౌలిక సదుపాయాలు, సంధానం, నీరు, ఆరోగ్యం మరియు బాలల సంరక్షణ రంగాల కు సంబంధించిన ప్రాజెక్టుల ను చేపట్టిన సందర్భం లో ఆ ప్రాంత ప్రజల కు ఆయన అభినందనల ను తెలియ జేశారు.

లక్షద్వీప్ యొక్క అభివృద్ధి దిశ లో ప్రభుత్వం నడుం కట్టిన ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. పిఎమ్ ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం అమలు లో వంద శాతం ఫలితాల ను సాధించడాన్ని గురించి, ఉచిత ఆహార పదార్థాల సరఫరా ను ప్రతి ఒక్క లబ్ధిదారు చెంతకు తీసుకు పోవడం గురించి, పిఎమ్ కిసాన్ క్రెడిట్ కార్డుల అందజేత ను గురించి, ఆయుష్మాన్ కార్డుల అందజేత ను గురించి, మరి అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ యొక్క అభివృద్ధిని గురించి ప్రధాన మంత్రి వివరించారు. ‘‘ప్రభుత్వ పథకాలు అన్నిటినీ లబ్ధిదారులు అందరికీ అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం పరిశ్రమిస్తున్నది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా లబ్ధిదారుల కు డబ్బును అందించే పని లో పారదర్శకత ను సాధించడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రక్రియ అవినీతిని చాలా వరకు అరికట్టింది అన్నారు. లక్షద్వీప్ లో ప్రజల హక్కుల ను లాగివేసుకొనేందుకు ప్రయత్నించిన వారిని ఎట్టి పరిస్థితుల లో వదలి పెట్టేది లేదు అంటూ ఆయన హామీని ఇచ్చారు.

 

వేగవంతమైనటువంటి ఇంటర్ నెట్ సదుపాయాన్ని ఒక వెయ్యి రోజుల లోపల కల్పించడాన్ని గురించి 2020వ సంవత్సరం లో తాను పూచీ ని ఇచ్చిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. కోచి-లక్షద్వీప్ ఐలండ్స్ సబ్‌మరీన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్శన్ (కెఎల్ఐ-ఎస్ఒఎఫ్‌సి) ప్రాజెక్టును ప్రజల కు ఈ రోజు న అంకితం చేయడమైంది. మరి ఇది లక్షద్వీప్ లో ప్రజల కు 100 రెట్ల వేగవంతమైనటువంటి ఇంటర్ నెట్ ప్రాప్తి కి పూచీ పడుతుంది అని ఆయన వివరించారు. ఇది ప్రభుత్వ సేవలు, వైద్య చికిత్స, విద్య, ఇంకా డిజిటల్ బ్యాంకింగ్ ల వంటి సౌకర్యాల ను మెరుగు పరుస్తుంది అని ఆయన అన్నారు. లక్షద్వీప్ ను ఒక లాజిస్టిక్స్ హబ్ గా అభివృద్ధి పరచేందుకు ఉన్న అవకాశాలు దీనితో బలాన్ని పుంజుకోనున్నాయి అని ఆయన వివరించారు. లో టెంపరేచర్ థర్మల్ డిసెలినేశన్ (ఎల్‌టిటిడి) ప్లాంట్ ను కద్‌మత్ లో నెలకొల్పుతున్న సంగతి ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, లక్షద్వీప్ లో ప్రతి ఒక్క కుటుంబాని కి నల్లా ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సంబంధించిన పనులు త్వరిత గతి న ముందుకు సాగుతున్నాయి అన్నారు.

లక్షద్వీప్ కు తాను చేరుకోగానే ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ అలీ మానిక్‌ఫాన్ తో సమావేశం అయినట్లు ప్రధాన మంత్రి చెప్పారు. లక్షద్వీప్ ద్వీప కల్పం యొక్క సంరక్షణ దిశ లో శ్రీ అలీ మానిక్‌ఫాన్ చేసిన పరిశోధనల ను మరియు నూతన ఆవిష్కరణల ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. శ్రీ అలీ మానిక్‌ఫాన్ కు 2021 వ సంవత్సరం లో పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం పట్ల శ్రీ నరేంద్ర మోదీ అమిత సంతృప్తి ని వ్యక్తం చేశారు. లక్షద్వీప్ లో యువతీ యువకుల విద్యాభ్యాసం మరియు నూతన ఆవిష్కరణ ల రంగం లో వారి ముందంజ కు గాను కేంద్ర ప్రభుత్వం మార్గాన్ని సిద్ధం చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న విద్యార్థుల కు సైకిళ్ళ ను మరియు లాప్ టాప్ లను అందజేసిన సంగతి ని ఆయన ప్రస్తావించారు. మునుపటి కాలం లో లక్షద్వీప్ లో అగ్రగామి విద్య బోధన సంస్థ అంటూ ఒకటైనా లేదు; దీనితో యువత ఈ దీవుల నుండి ఇతర ప్రాంతాల కు తరలి వెళ్ళారు అని ఆయన అన్నారు. ఉన్నత విద్య బోధన సంస్థల ను ప్రారంభించే దిశ లో తీసుకొన్న చర్యల ను గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ, ఆండ్రోట్ మరియు కద్‌మత్ దీవుల లో ఆర్ట్స్ ఎండ్ సైన్స్ కోర్సుల ను మొదలు పెట్టడం తో పాటు మినికాఁయ్ లో పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ‘‘ఇవి లక్షద్వీప్ లో యువతీ యువకుల కు ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

 

హజ్ యాత్రికుల కోసం చేపట్టిన చర్యలు లక్షద్వీప్ లోని ప్రజల కు కూడా ప్రయోజనం కలిగించాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. హజ్ వీజా నిబంధనల ను సరళతరం చేయడాన్ని గురించి, అలాగే వీజా పొందడం కోసం అమలవుతున్న ప్రక్రియ ను డిజిటలైజ్ చేయడం గురించి, ‘మెహరమ్’ లేకున్నా, హజ్ యాత్ర కు వెళ్ళేందుకు మహిళల కు అనుమతి ని ఇవ్వడం గురించి ఆయన వివరించారు. ఈ ప్రయాసల తో ‘ఉమ్‌రా’ కోసం వెళుతున్న భారతీయుల సంఖ్య గణనీయం గా వృద్ధి చెందింది అని ఆయన అన్నారు.

ప్రపంచ సముద్ర సంబంధి ఆహార బజారు లో భారతదేశం తన వాటా ను పెంచుకోవడం కోసం చేస్తున్న కృషి ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా తెలియ జేశారు. ఈ కృషి ద్వారా లక్షద్వీప్ కు మేలు చేకూరుతున్నది. ఎలాగంటే స్థానిక టూనా చేపల ను జపాన్ కు ఎగుమతి చేయడం సాధ్యపడింది అని ఆయన అన్నారు. ఎగుమతుల కు అనువైన నాణ్యమైన స్థానిక చేపల నిలవల అవకాశాలు మత్స్యకారుల జీవన రూపురేఖల ను గణనీయం గా మార్చివేయగలుగుతాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సీవీడ్ ఫార్మింగు కు గల అవకాశాల ను అన్వేషించడం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతం లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి అని ఆయన నొక్కి చెప్పారు. కవరత్తీ లో మొట్టమొదటిసారి గా ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ అండ తో పనిచేసేటటువంటి సౌర శక్తి ప్లాంటు ఆ తరహా కార్యక్రమాల లో ఒక కార్యక్రమం అని ఆయన తెలిపారు.

 

స్వాతంత్య్రం వచ్చిన తరువాత 75 సంవత్సరాల కాలం లో (ఆజాదీ కా అమృత్ కాల్) భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం గా ఆవిష్కరించడం లో లక్షద్వీప్ యొక్క పాత్ర ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యటక చిత్రపటం లో స్థానాన్ని దక్కించుకొనేటట్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషి ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. ఇటీవలే ఇక్కడ ముగిసినటువంటి జి-20 సమావేశం గురించి ఆయన ప్రస్తావించి, లక్షద్వీప్ అంతర్జాతీయ గుర్తింపు ను సంపాదించుకొంది అన్నారు. స్వదేశ్ దర్శన్ పథకం లో భాగం గా లక్షద్వీప్ ను దృష్టి లో పెట్టుకొని ఒక నిర్ధిష్ట గమ్యస్థానాల తో కూడినటువంటి బృహత్ ప్రణాళిక కు రూపకల్పన జరుగుతున్నదని ఆయన వెల్లడించారు. రెండు బ్లూ-ఫ్లాగ్ బీచ్ లకు లక్షద్వీప్ నిలయం గా ఉన్న విషయాన్ని ఆయన చాటిచెప్తూ, కద్‌మత్ మరియు సుహేలీ దీవుల లో వాటర్ విలా ప్రాజెక్టు ల అభివృద్ధి జరిగిన అంశాన్ని ప్రస్తావించారు. ‘‘లక్షద్వీప్ క్రూజ్ టూరిజమ్ పరం గా ఒక ప్రధానమైన గమ్యస్థానం గా మారుతోంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అయిదు సంవత్సరాల కిందటి కాలం తో పోల్చి చూసినప్పుడు ఈ ప్రాంతాని కి విచ్చేస్తున్న యాత్రికుల సంఖ్య లో వృద్ధి అయిదు రెట్లు ఉంది అని ఆయన అన్నారు. భారతదేశ పౌరులు విదేశాల ను సందర్శించాలి అని నిర్ణయం తీసుకొనేందుకు ముందు గా దేశం లో కనీసం పదిహేను స్థలాల ను చూడాలి అనే తన పిలుపును గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు. విదేశాల లో ద్వీప దేశాల ను చూడదలచుకొనే వారు లక్షద్వీప్ కు వెళ్ళాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘మీరు ఒకసారి లక్షద్వీప్ యొక్క శోభ ను తిలకించారా అంటే, ప్రపంచం లోని ఇతర ప్రదేశాలు ఈ ప్రాంతం ముందు వెల వెలబోతాయి సుమా’’ అని ఆయన అన్నారు.

లక్షద్వీప్ లో ప్రజల జీవన సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని, మరి వ్యాపార నిర్వహణ సంబంధి సౌలభ్యాని కి పూచీ పడడం కోసం వీలు ఉన్న ప్రతి ఒక్క చర్య ను కేంద్ర ప్రభుత్వం తీసుకొంటూనే ఉంటుందంటూ సభికుల కు ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. ‘‘ఒక వికసిత్ భారత్ ను రూపొందించడం లో లక్షద్వీప్ ఒక బలమైనటువంటి భూమిక ను పోషిస్తుంది’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నరు శ్రీ ప్రఫుల్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

 

పూర్వరంగం

లక్షద్వీప్ పర్యటన లో భాగం గా ప్రధాన మంత్రి 1,150 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రాజెక్టుల లో కొన్నిటిని జాతి కి అంకితం చేయడంతో పాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతం లో ఇంటర్ నెట్ సదుపాయం అత్యంత బలహీనం గా ఉండడం ఇక్కడి ప్రధాన సమస్య. దీనిని పరిష్కరించేందుకు చేపట్టిన పరివర్తనాత్మక చర్యల లో భాగం గా కోచి-లక్షద్వీప్ ఐలండ్స్ సబ్‌మరీన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్శన్ (కెఎల్ఐ-ఎస్ఒఎఫ్‌సి) ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సమస్య పరిష్కారం దిశ లో ఈ ప్రాజెక్టు విషయమై ఆయన 2020వ సంవత్సరం లో ఎర్ర కోట మీది నుండి స్వాతంత్ర్య దినం నాడు ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ఒక ప్రకటన ను చేశారు. ఈ ప్రాజెక్టు ను ఇక పూర్తి కాగా ప్రధాన మంత్రి దీనిని ప్రారంభించారు. దీని ద్వారా ఇకమీదట ఇంటర్ నెట్ వేగం 100 రెట్లు (1.7 జిబిపిఎస్ నుండి 200 జిబిపిఎస్ కు) పెరుగుతుంది. స్వాతంత్య్రం అనంతర కాలం లో తొలి సారి కొచి- లక్షద్వీప్ ఐలండ్స్ సబ్‌మరీన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్శన్ ( ఎస్ఒఎఫ్‌సి) తో లక్షద్వీప్‌ సంధానం కానుంది. ఫలితం గా లక్షద్వీప్ దీవుల కమ్యూనికేశన్ సంబంధి మౌలిక సదుపాయాల లో సరిక్రొత్త మార్పు వస్తుంది. ఇంటర్ నెట్ సేవల లో వేగం, విశ్వసనీయత పెరుగుతాయి. టెలిమెడిసిన్, ఇ-గవర్నెన్స్, విద్య సంబంధి కార్యక్రమాలు, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ కరెన్సీ ఉపయోగం, డిజిటల్ లిటరసీ వంటి వాటికి మార్గం సుగమం కాగలదు.

 

కద్‌మత్ లో నిర్మించిన ‘లో టెంపరేచర్ థెర్మల్ డిసెలినేశన్ (ఎల్‌టిటిడి) ప్లాంటు ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు. దీని ద్వారా రోజూ 1.5 లక్షల లీటర్‌ ల స్వచ్ఛమైన తాగునీరు సరఫరా కు వీలు ఏర్పడుతుంది. అగత్తీ, మినికాయ్ ద్వీపాల లోని అన్ని గృహాలకు నల్లా కనెక్శన్ లను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. పగడపు దీవి అయిన లక్షద్వీప్ దీవుల లో త్రాగు నీటి లభ్యత నిరంతర సమస్యగా ఉంది. ఇక్కడ భూగర్భజల లభ్యత స్వల్పం కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యం లో తాజా త్రాగునీటి ప్రాజెక్టు లు అందుబాటు లోకి రావడం తో, ఈ ద్వీపాల పర్యటన సంబంధి సామర్థ్యం పెరుగుతుంది. తద్ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

దేశ ప్రజల కు అంకితం చేసిన ఇతర ప్రాజెక్టుల లో కవరత్తీ లో నిర్మించిన సౌర శక్తి ప్లాంటు కూడా ఒకటి. ఇది లక్షద్వీప్‌ లోని తొలి బ్యాటరీ ఆధారిత సౌర విద్యుత్తు ప్రాజెక్టు. దీనివల్ల డీజిల్ అండ తో విద్యుత్తు ఉత్పాదన పైన ఆధారపడవలసిన అవసరం తప్పుతుంది. దీనితో పాటు కవరత్తీ లో ఇండియా రిజర్వ్ బెటాలియన్ (ఐఆర్‌బిఎన్) ప్రాంగణం లో 80 మంది సిబ్బంది కోసం నిర్మించిన కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.

 

అలాగే కల్‌పేనీ లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ భవనం పునర్ నవీకరణ పనులతో పాటు, ఆండ్రోట్ , చెట్‌లాట్, కద్‌మత్, అగత్తీ, మినికాఁయ్ దీవుల లో అయిదు మాడల్ ఆంగన్‌వాడీ సెంటర్ స్ నిర్మాణాని కి ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s PC exports double in a year, US among top buyers

Media Coverage

India’s PC exports double in a year, US among top buyers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Congratulates India’s Men’s Junior Hockey Team on Bronze Medal at FIH Hockey Men’s Junior World Cup 2025
December 11, 2025

The Prime Minister, Shri Narendra Modi, today congratulated India’s Men’s Junior Hockey Team on scripting history at the FIH Hockey Men’s Junior World Cup 2025.

The Prime Minister lauded the young and spirited team for securing India’s first‑ever Bronze medal at this prestigious global tournament. He noted that this remarkable achievement reflects the talent, determination and resilience of India’s youth.

In a post on X, Shri Modi wrote:

“Congratulations to our Men's Junior Hockey Team on scripting history at the FIH Hockey Men’s Junior World Cup 2025! Our young and spirited team has secured India’s first-ever Bronze medal at this prestigious tournament. This incredible achievement inspires countless youngsters across the nation.”