‘‘భారతదేశం యొక్క బయో-ఇకానమి గత 8 సంవత్సరాల లో 8 రెట్లు మేరకు వృద్ధి చెందింది. మనం 10 బిలియన్ డాలర్ నుంచి 80 బిలియన్ డాలర్ కు చేరుకొన్నాం. బయోటెక్ యొక్క గ్లోబల్ ఇకోసిస్టమ్ లో అగ్రగామి 10 దేశాల జాబితా లో చేరేందుకు భారతదేశంఎంతో దూరం లో లేదు’’
‘‘గడచిన దశాబ్దుల లో మన ఐటి వృత్తి నిపుణుల కు మనం గమనించినటువంటి గౌరవం,ప్రతిష్ఠలే మన బయోటెక్ సెక్టరు కు మరియు బయో ప్రొఫెశనల్స్ కు కూడా దక్కడాన్ని చూస్తున్నాం’’
‘‘సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్ మంత్రం భారతదేశం లో వివిధ రంగాల కువర్తిస్తోంది. ప్రస్తుతం అన్ని రంగాల ను మొత్తం ప్రభుత్వ వైఖరిద్వారా ప్రోత్సహించడం జరుగుతోంది’’
‘‘ఇవాళ దాదాపు గా 60 వేరు వేరు పరిశ్రమల లో 70,000 స్టార్ట్-అప్స్ నమోదు అయ్యాయి. 5,000 కు పైగా స్టార్ట్-అప్స్ బయోటెక్ తోఅనుబంధాన్ని కలిగివున్నాయి’’
‘‘1100 బయోటెక్ స్టార్ట్-అప్స్ ఒక్క కిందటి సంవత్సర కాలం లోనే ఏర్పాటు అయ్యాయి’’
‘‘సబ్ కా ప్రయాస్ భావన ను రేకెత్తిస్తూ, ప్రభుత్వం పరిశ్రమ లోని ఉత్తమ మేధస్సులను ఒక చోటుకు తీసుకు వస్తోంది’’
‘‘అత్యధిక డిమాండు వల్ల వృద్ధి చెందుతున్న రంగాల లో ఒక రంగం గా బయోటెక్ రంగం ఉంది. గత కొన్నేళ్ళు గాభారతదేశం లో జీవన సౌలభ్యం కోసం నిర్వహించిన ప్రచారాలు బయోటెక్ రంగం లో కొత్తఅవకాశాల ను ఏర్పరచాయి’’

బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో- 2022 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు. బయోటెక్ ఉత్పత్తుల కు చెందిన ఇ- పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారిలో కేంద్ర మంత్రులు శ్రీయుతులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, డాక్టర్ జితేంద్ర సింహ్, బయోటెక్ రంగం తో సంబంధం కలిగిన వర్గాలు, నిపుణులు, ఎస్ఎమ్ఇ లు మరియు ఇన్వెస్టర్ లు తదితరులు ఉన్నారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం లో బయో-ఇకానమి గడచిన 8 సంవత్సరాల లో 8 రెట్లు వృద్ధి చెందిందన్నారు. ‘‘మనం 10 బిలియన్ డాలర్ నుంచి 80 బిలియన్ డాలర్ కు చేరుకొన్నాం. బయోటెక్ సంబంధి గ్లోబల్ ఇకోసిస్టమ్ లో అగ్రగామి దేశాల జాబితా లో స్థానాన్ని సంపాదించుకోవడానికి భారతదేశం ఎంతో దూరంలో ఏమీ లేదు’’ అని ఆయన అన్నారు. దేశం లో ఈ రంగం యొక్క అభివృద్ధి లో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసర్చ్ అసిస్ టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ఎసి) తోడ్పాటు ఉందని కూడా ప్రధాన మంత్రి అన్నారు. దేశం ప్రస్తుతం ‘అమృత్ కాలం’ లో కొత్త ప్రతిజ్ఞల ను స్వీకరిస్తున్న వేళ లో దేశాభివృద్ధి లో బయోటెక్ పరిశ్రమ భూమిక చాలా ముఖ్యమైంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రపంచ రంగ స్థలం మీద భారతదేశం యొక్క వృత్తి నిపుణుల కు పేరు ప్రతిష్ఠ లు అంతకంతకు వృద్ధి చెందుతుండటాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ప్రపంచం లో మన ఐటి వృత్తి నిపుణుల యొక్క నైపుణ్యం మరియు నూతన ఆవిష్కరణ ల పట్ల విశ్వాసం అనేది కొత్త శిఖరాల కు చేరుకొంది. ఇదే విధమైన విశ్వాసం మరియు పేరు ప్రతిష్ఠ లు ఈ దశాబ్దం లో భారతదేశం లోని బయోటెక్ రంగాని కి మరియు భారతదేశం లోని బయో ప్రొఫెశనల్స్ కు దక్కడాన్ని మనం గమనిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

బయోటెక్ రంగం లో భారతదేశాన్ని అవకాశాల గడ్డ గా ఎందుకు భావిస్తున్నారో అనేదానికి అయిదు పెద్ద కారణాలు ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఒకటో కారణం - వైవిధ్యం తో కూడిన శీతోష్ణస్థితి మండలాలు మరియు జనాభా; రెండో కారణం - భారతదేశం లోని ప్రతిభాశీల మానవ వనరులు; మూడో కారణం - భారతదేశం లో ‘వ్యాపార నిర్వహణ సౌలభ్యం’ ను పెంచేందుకు అదే పని గా జరుగుతున్న ప్రయాస లు; నాలుగో కారణం - భారతదేశం లో బయో ఉత్పత్తుల కు గిరాకీ నిరంతరం గా పెరుగుతూ ఉండటం; అయిదో కారణం ఏమిటి అంటే అది భారతదేశ బయోటెక్ రంగం మరియు ఆ రంగం సాధించినటువంటి సాఫల్యాలే అని ఆయన వివరించారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క శక్తి ని మరియు సత్తా ను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం అలుపెరుగక కృషి చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘మొత్తం ప్రభుత్వ వైఖరి’ కి ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం జరుగుతోంది అని ఆయన స్పష్టం చేశారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ మంత్రం భారతదేశం లో విభిన్న రంగాల కు వర్తిస్తుంది అని ఆయన అన్నారు. ఏవో కొన్ని రంగాల పై శ్రద్ధ వహించి, ఇతర రంగాల ను వాటి మానాని కి వాటిని వదిలి వేసిన స్థితి లో మార్పున కు ఇది దారి తీసింది. ప్రస్తుతం, దేశాభివృద్ధి కి ప్రతి రంగం ఉత్తేజాన్ని అందిస్తోంది అని ఆయన చెప్పారు. ఈ కారణం గానే ప్రతి ఒక్క రంగం యొక్క ‘అండదండ లు’, మరి అదే విధం గా ప్రతి ఒక్క రంగం యొక్క ‘అభివృద్ధి’ తక్షణావసరం గా ఉన్నాయని కూడా ఆయన అన్నారు. ఆలోచనల లో మరియు వైఖరి లో చోటు చేసుకొన్న ఈ పరివర్తన ఫలితాల ను ప్రసాదిస్తోంది అని ఆయన అన్నారు. ఇటీవలి కొన్నేళ్లలో మరిన్ని రంగాల పైన దృష్టి ని కేంద్రీకరిస్తూ వస్తున్న సంగతి ని ఆయన సోదాహరణం గా వివరించారు.

బయోటెక్ రంగం లో సైతం, ఇదివరకు ఎరుగనటువంటి చర్యల ను తీసుకోవడం జరుగుతోంది. ఈ విషయం స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ లో స్పష్టం గా ఆవిష్కారం అవుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘గత ఎనిమిదేళ్ళ లో మన దేశం లో స్టార్ట్-అప్స్ సంఖ్య కొన్ని వందల నుంచి ప్రస్తుతం 70,000 కు చేరుకొంది. ఈ 70,000 స్టార్ట్-అప్స్ దాదాపు గా 60 వేరు వేరు పరిశ్రమల లో ఏర్పాటయ్యాయి. మళ్ళీ వీటిలో కూడాను 5,000 కు పైగా స్టార్ట్-అప్స్ బయోటెక్ రంగం తో అనుబంధాన్ని కలిగివున్నాయి. బయో టెక్నాలజీ రంగం లో ప్రతి 14వ స్టార్ట్-అప్ తో పాటు గా ఆ కోవ కు చెందని 1100కు పైగా బయోటెక్ స్టార్ట్-అప్స్ ఒక్క క్రిందటి సంవత్సరం లోనే ఉనికి లోకి వచ్చాయి’’ అని ప్రధాన మంత్రి తెలియ జేశారు. ప్రతిభావంతుల దృష్టి ఈ రంగం వైపున కు మళ్ళడం గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, బయోటెక్ రంగం లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య 9 రెట్ల మేరకు పెరిగింది; అలాగే బయోటెక్ ఇంక్యూబేటర్ స్ మరియు అటువంటి వాటికి ఆర్థిక సహాయం 7 రెట్ల మేరకు వృద్ధి చెందింది. బయోటెక్ ఇంక్యూబేటర్ స్ 2014వ సంవత్సరం లో ఆరు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 75 కు చేరుకొన్నాయి. బయోటెక్ ఉత్పత్తులు 10 నుంచి ఇవాళ 700 కు పైచిలుకు స్థాయి కి చేరాయి’’ అని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వం కేంద్ర స్థానం లో ఉండే ధోరణి ని అధిగమించడం కోసం కొత్త గా ఇనేబ్లింగ్ ఇంటర్ ఫేసెస్ ను సమకూర్చేటటువంటి ఒక సంస్కృతి ని ప్రోత్సహించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. బిఐఆర్ఎసి వంటి ప్లాట్ ఫార్మ్ లను బలపరచడం జరుగుతోంది. మరి అనేక ఇతర రంగాలు కూడా ఇదే సరళి ని అనుసరిస్తున్నాయి అని ఆయన అన్నారు. స్టార్ట్-అప్స్ కోసం ఉద్దేశించి స్టార్ట్-అప్ ఇండియా ను తీసుకు రావడాన్ని ఒక ఉదాహరణ గా ఆయన ప్రస్తావించారు. అంతరిక్ష రంగం కోసం ఉద్దేశించినటువంటి ఇన్ స్పేస్ (IN-SPACe), రక్షణ రంగం లో స్టార్ట్-అప్స్ కోసం ఐడెక్స్ (iDEX), సెమి కండక్టర్స్ కోసం ఇండియా సెమి కండక్టర్ మిశన్, యువత లో నూతన ఆవిష్కరణ లను ప్రోత్సహించడం కోసం స్మార్ట్ ఇండియా హ్యాకథన్ లు, మరి అదే విధం గా ఈ బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘సబ్ కా ప్రయాస్ భావన ను రేకెత్తిస్తూ ప్రభుత్వం కొత్త సంస్థల ను ఏర్పాటు చేయడం ద్వారా పరిశ్రమ లోని అత్యుత్తమమైన మస్తిష్కాల ను ఒకే వేదిక మీద కు తీసుకు వస్తోంది అని ఆయన చెప్పారు. ఇది దేశాని కి ఒనగూరిన మరొక ప్రధానమైన ప్రయోజనం. దేశం పరిశోధన రంగం నుంచి మరియు విద్య బోధన రంగం నుంచి సరికొత్త ఆవిష్కారాల ను అందుకొంటుంది. పరిశ్రమ సిసలైన ప్రపంచ దృష్టి కోణం పరం గా తన వంతు సాయాన్నందిస్తుంది. ఇక అవసరమైన విధాన సంబంధి చర్యల ను మరియు మౌలిక సదుపాయాల ను ప్రభుత్వం కల్పిస్తుంది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

‘‘అత్యధిక డిమాండు చోదక శక్తి గా ముందడుగు వేస్తున్నటువంటి రంగాల లో ఒక రంగం గా బయోటెక్ రంగం ఉంది. భారతదేశం లో కొన్ని సంవత్సరాలు గా జీవన సౌలభ్యాన్ని గురించి సాగిన ప్రచారాలు బయోటెక్ రంగాని కి కొత్త అవకాశాల ను ప్రసాదించాయి.’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్యం, వ్యవసాయం, శక్తి, ప్రాకృతిక వ్యవసాయం, బయో ఫోర్టిఫైడ్ సీడ్స్ వంటి పరిణామాలు ఈ రంగాని కి కొత్త బాటల ను పరుస్తున్నాయి అని ఆయన చెప్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Semicon India 2024: Top semiconductor CEOs laud India and PM Modi's leadership

Media Coverage

Semicon India 2024: Top semiconductor CEOs laud India and PM Modi's leadership
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 12 సెప్టెంబర్ 2024
September 12, 2024

Appreciation for the Modi Government’s Multi-Sectoral Reforms