గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న రైతు అనుకూల నిర్ణయాలు అనేక సత్ఫలితాలను అందించాయని చెబుతూ, వ్యవసాయదారుల గౌరవం, అభ్యున్నతి పరంగా కీలక మార్పులు వచ్చినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ ఫసల్ బీమా వంటి కీలక కార్యక్రమాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలుగా వీటిని అభివర్ణించారు.
కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పీ) నిరంతరం పెరుగుతుండటం వల్ల, దేశంలోని ఆహార ఉత్పత్తిదారులు తమ పంటలకు న్యాయమైన ధరలను పొందడమే కాకుండా, వారి ఆదాయం కూడా పెరుగుతోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సేవ చేయడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గత 11 సంవత్సరాల కాలాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు రైతుల సంక్షేమాన్ని పెంచడమే కాకుండా వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు దోహదం చేశాయన్నారు.
నేల ఆరోగ్యం, నీటిపారుదల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ వహించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు నెరవేరాయని ప్రధానమంత్రి తెలిపారు.
రైతు సంక్షేమం కోసం మా ప్రయత్నాలు రాబోయే కాలంలో మరింత భారీస్థాయిలో కొనసాగుతాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. మన రైతుల గౌరవం, శ్రేయస్సు కోసమే ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"మన కర్షక సోదర సోదరీమణులు గతంలో చిన్న అవసరాలకు కూడా అప్పులు చేయవలసి వచ్చేది. కానీ గత 11 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా వారి జీవితాలు చాలా సులభతరం అయ్యాయి. వారి సంక్షేమం కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ ఫసల్ బీమా వంటి అనేక ముఖ్యమైన చర్యలు మేం చేపట్టాం. ఇప్పుడు ఎమ్ఎస్‌పీ నిరంతర పెరుగుదలతో, దేశంలోని ఆహార ఉత్పత్తిదారులు తమ పంటలకు న్యాయమైన ధరను పొందడమే కాకుండా, వారి ఆదాయం కూడా పెరుగుతోంది.
11YearsOfKisanSamman"
हमारे किसान भाई-बहनों को पहले जहां छोटी-छोटी जरूरतों के लिए भी उधार लेने को मजबूर होना पड़ता था, वहीं बीते 11 साल में हमारी सरकार के निर्णयों से उनका जीवन बहुत आसान हुआ है। पीएम किसान सम्मान निधि हो या फिर किसान फसल बीमा, हमने उनके कल्याण के लिए कई अहम कदम उठाए हैं। अब एमएसपी में… pic.twitter.com/MtQbvGMMcH
— Narendra Modi (@narendramodi) June 7, 2025
"కష్టపడి పనిచేసే రైతులకు సేవ చేయడం మాకు దక్కిన గౌరవం. గత 11 సంవత్సరాలుగా, మేం చేపట్టిన వివిధ కార్యక్రమాలు రైతుల శ్రేయస్సును మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు దోహదం చేశాయి. నేల ఆరోగ్యం, నీటిపారుదల వంటి అంశాలపై మేం దృష్టి సారించడం ఎంతో ప్రయోజనం కలిగించింది. రైతు సంక్షేమం కోసం మా ప్రయత్నాలు రాబోయే కాలంలో రెట్టించిన వేగంతో కొనసాగుతాయి.
11YearsOfKisanSamman"
It’s our privilege to serve our hardworking farmers. For the past 11 years, our various initiatives have boosted prosperity for farmers and also ensured an overall transformation of the agriculture sector. We have focussed on issues like soil health and irrigation, which have… https://t.co/1eNRIe5RJb
— Narendra Modi (@narendramodi) June 7, 2025
“మన రైతుల గౌరవం, శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని గురించి మరింత తెలుసుకోవడానికి ఈ అనుబంధ సమాచారం కూడా చదవండి.
11YearsOfKisanSamman"
Do read this thread to get a glimpse of how we have worked on dignity and prosperity for our farmers. #11YearsOfKisanSamman https://t.co/coqhwFYvUH
— Narendra Modi (@narendramodi) June 7, 2025


