మావోవాదమనే భూతాన్ని అంతమొందించడంతో పాటు మన దేశ ప్రజలకు శాంతియుత జీవనాన్నీ, పురోగతినీ అందించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ దిశగా బలగాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన హర్షించారు.
కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘ఈ అసాధారణ విజయాన్ని సాధించిన మన బలగాలను చూస్తే గర్వంగా ఉంది. మావోవాదమనే భూతాన్ని అంతం చేయడానికి, మన దేశ ప్రజలకు శాంతియుత జీవనం, ప్రగతి.. ఈ రెంటినీ అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.’’ అని పేర్కొన్నారు.
Proud of our forces for this remarkable success. Our Government is committed to eliminating the menace of Maoism and ensuring a life of peace and progress for our people. https://t.co/XlPku5dtnZ
— Narendra Modi (@narendramodi) May 21, 2025


