కర్తవ్య పథ్‌లో నిర్వహించిన అద్భుతమైన గణతంత్ర దినోత్సవ కవాతు దృశ్యాలను పంచుకున్న ప్రధానమంత్రి
మన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్‌కు గౌరవకరం: ప్రధానమంత్రి
గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా ప్రదర్శించిన బలమైన భద్రతా వ్యవస్థను ప్రశంసించిన ప్రధానమంత్రి
భారత భద్రతా దళాల సామర్థ్యాలను గణతంత్ర దినోత్సవ కవాతు ప్రతిబింబిస్తుందన్న ప్రధానమంత్రి
గణతంత్ర దినోత్సవ కవాతులో భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని తిబింబించిన ప్రదర్శనను ప్రశంసించిన ప్రధానమంత్రి

గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత్‌ ఎంతో ఉత్సాహంతో, గర్వంతో జరుపుకుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కర్తవ్య పథ్‌లో జరిగిన అద్భుతమైన కవాతు.. భారత ప్రజాస్వామ్య శక్తిని, మన గొప్ప వారసత్వ సంపదను, దేశాన్ని ఏకం చేసే ఐక్యతను చాటిచెప్పిందని ఆయన తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన దృశ్యాలను పంచుకుంటూ.. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ కర్తవ్యపథ్‌లో దేశ గర్వానికి ప్రతీకగా నిలిచిన శక్తిమంతమైన ప్రదర్శనకు సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి అన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లకు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు దక్కిన గౌరవమని ప్రధానమంత్రి అన్నారు. వారి రాక భారత్-యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యానికి పెరుగుతున్న బలాన్ని, ఉమ్మడి విలువలపై దేశానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన భారత్-యూరప్ మధ్య వివిధ రంగాలలో లోతైన నిబద్ధత, సహకారానికి మరింత ఊపునిస్తుందని అన్నారు.

గణతంత్ర దినోత్సవ కవాతు భారతీయ అద్భుతమైన భద్రతా వ్యవస్థను ప్రదర్శించిందని, ఇది దేశ సన్నద్ధతను, సాంకేతిక సామర్థ్యాన్ని, పౌరుల రక్షణ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

బలోపేతమవుతున్న దేశ భద్రతా దళాల సామర్థ్యాలను గణతంత్ర దినోత్సవ కవాతు కళ్లకు కట్టిందని శ్రీ మోదీ అన్నారు. మన భద్రతా దళాలు నిజంగా దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. కవాతు సమయంలో భద్రతా దళాల ఆకట్టుకునే ప్రదర్శనలకు సంబంధించిన దృశ్యాలను ఆయన పంచుకున్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కర్తవ్య పథ్‌లో భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం కనువిందు చేసిందని ఆయన అన్నారు. వైవిధ్యభరితమైన ప్రదర్శనలు, శకటాల ద్వారా ఈ కవాతు దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పిందని అన్నారు. ఇది దేశం  సుసంపన్నమైన, వైవిధ్యమైన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.

 

"మన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లకు ఆతిథ్యం ఇవ్వడం దేశానికి దక్కిన గౌరవం.

వారి రాక భారత్-యూరోపియన్ యూనియన్ భాగస్వామ్యానికి పెరుగుతున్న బలాన్ని, ఉమ్మడి విలువలపై మన నిబద్ధతను తెలుపుతుంది.

ఈ పర్యటన భారత్, యూరప్ మధ్య వివిధ రంగాల్లో లోతైన నిబద్ధత,సహకారానికి మరింత ఊపునిస్తుంది.

@antoniocostapm

@vonderleyen

@EUCouncil

@EU_Commission”

“The Republic Day parade showcased India’s formidable security apparatus, reflecting the nation’s preparedness, technological capability and unwavering commitment to safeguarding its citizens.”

“The Republic Day parade offered a glimpse into the strengthening capabilities of India’s security forces. Our forces are truly our pride!

Here are some more glimpses.”

“A vivid display of India’s cultural mosaic unfolded at Kartavya Path earlier today. The Republic Day parade celebrated India’s cultural diversity, with vibrant performances and tableaux.”

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From conflict to progress: Remote Irpanar village in Chhattisgarh gets electricity

Media Coverage

From conflict to progress: Remote Irpanar village in Chhattisgarh gets electricity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prof. Gobardhan Das Ji meets the Prime Minister
April 27, 2026

Prof. Gobardhan Das Ji met the Prime Minister, Shri Narendra Modi, today. Shri Modi noted that Prof. Gobardhan Das Ji's personal life journey is very inspiring. Every struggle he faced strengthened his commitment to serve society which is reflected in his contribution to public health and immunology.

The Prime Minister posted on X:

"Met Prof. Gobardhan Das Ji this morning. His personal life journey is very inspiring. Every struggle he faced only strengthened his commitment to serve society and make it free from suffering. This has been reflected in his contribution to public health and immunology. His rich work and scholarship will enrich our policy-making architecture."

@dasgobardhan

"আজ সকালে প্রফেসর গোবর্ধন দাস জির সঙ্গে সাক্ষাৎ করলাম। তাঁর ব্যক্তি জীবনের গল্প অত্যন্ত অনুপ্রেরণাদায়ক। তাঁর প্রতিটি সংগ্রাম, সমাজকে সেবা এবং সমস্যামুক্ত করার প্রতি তাঁর অঙ্গীকারকে দৃঢ়তর করেছে। জনস্বাস্থ্য এবং ইমিউনোলজির ক্ষেত্রে তাঁর অবদানেও এর প্রতিফলন দেখা যায়। তাঁর সমৃদ্ধ কর্মকান্ড এবং পাণ্ডিত্য আমাদের নীতি-নির্ধারণী কাঠামোর ক্ষেত্রে গুরুত্বপূর্ণ অবদান রাখবে।"

@dasgobardhan