అక్షయ తృతీయ ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ ‘అక్షయ తృతీయ’ సందర్భంగా మీకందరికీ అనంత శుభాకాంక్షలు. మానవతకు అంకితమిచ్చిన ఈ పవిత్రమైన పండుగ రోజు... ప్రతి ఒక్కరికి విజయాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని ప్రసాదించడంతో పాటు, ‘వికసిత్ భారత్’ను సాకారం చేయాలన్న సంకల్పానికి కూడా కొత్త శక్తిని అందించాలని అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
आप सभी को अक्षय तृतीया की अनंत शुभकामनाएं। मानवता को समर्पित यह पावन पर्व हर किसी के लिए सफलता, संपन्नता और प्रसन्नता लेकर आए, जो विकसित भारत के संकल्प को नई शक्ति प्रदान करे।
— Narendra Modi (@narendramodi) April 30, 2025




