ఈ రోజు కార్తిక పౌర్ణమితో పాటు దేవ్ దీపావళి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారతీయ సంస్కృతితోనూ, ఆధ్యాత్మికతతోనూ ముడిపడిన ఈ సందర్భం ప్రతి ఒక్కరి జీవనంలో సుఖ శాంతులనూ, ఆరోగ్యాన్నీ, సమృద్ధినీ అందించాలని నేను కోరుకుంటున్నాను. పవిత్ర స్నానాలు, దానాలు, హారతులతో పాటు పూజలతో కూడిన మన శుభ సంప్రదాయం అందరి జీవనంలో వెలుగును నింపాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘కార్తిక పౌర్ణమితో పాటు దేవ్ దీపావళి సందర్భంగా... దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ కోటి-కోటి శుభకామనలు. భారతీయ సంస్కృతితోనూ, ఆధ్యాత్మికతతోనూ ముడిపడిన ఈ దివ్య సందర్భం ప్రతి ఒక్కరికీ సుఖాన్నీ, శాంతినీ, ఆరోగ్యాన్నీ, సౌభాగ్యాన్నీ ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. పవిత్ర స్నానాలు, దానాలు, హారతులు, పూజలతో కూడిన మన ఈ పావన సంప్రదాయం అందరి జీవనాన్నీ ప్రకాశింప చేయాలని నేను అభిలషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
"देश के अपने सभी परिवारजनों को कार्तिक पूर्णिमा और देव दीपावली की कोटि-कोटि शुभकामनाएं। भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा यह दिव्य अवसर हर किसी के लिए सुख, शांति, आरोग्य और सौभाग्य लेकर आए। पावन स्नान, दान-पुण्य, आरती और पूजन से जुड़ी हमारी यह पवित्र परंपरा सबके जीवन को प्रकाशित करे।"
देश के अपने सभी परिवारजनों को कार्तिक पूर्णिमा और देव दीपावली की कोटि-कोटि शुभकामनाएं। भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा यह दिव्य अवसर हर किसी के लिए सुख, शांति, आरोग्य और सौभाग्य लेकर आए। पावन स्नान, दान-पुण्य, आरती और पूजन से जुड़ी हमारी यह पवित्र परंपरा सबके जीवन को…
— Narendra Modi (@narendramodi) November 5, 2025


