ధన్‌తేరస్ పండగ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"ఈ పవిత్ర సందర్భంలో ప్రతి ఒక్కరికీ ఆనందం, సంక్షేమం, సంపూర్ణ ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ధన్వంతరి భగవానుడు అందరికీ సమృద్ధిగా తన ఆశీస్సులు ప్రసాదించుగాక" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్‌తేరస్ శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో అందరికీ ఆనందం, సంక్షేమం, సంపూర్ణ ఆరోగ్యం లభించాలని కోరుకుంటున్నాను. ధన్వంతరి భగవానుడు అందరిపైనా సమృద్ధిగా తన ఆశీస్సులు కురిపించుగాక."
देश के मेरे सभी परिवारजनों को धनतेरस की अनेकानेक शुभकामनाएं। इस पावन अवसर पर मैं हर किसी के सुख, सौभाग्य और आरोग्य की कामना करता हूं। भगवान धन्वंतरि सबको अपना भरपूर आशीर्वाद दें।
— Narendra Modi (@narendramodi) October 18, 2025


