సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సిక్కిం తన 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణం, ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, ప్రశంసనీయమైనదని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ 50వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ... అక్కడి ప్రజలు చూపిన ఆప్యాయత, అభిమానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శ్రీ మోదీ అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘నా సిక్కిం సోదర సోదరీలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రగతిలో సిక్కిం పాత్ర ఎంతో విశిష్టమైనది. ఆ రాష్ట్ర ప్రజలు నిరంతర ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.

 

సిక్కిం తన 50వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో ఈ శుభ సందర్భం వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఈ వేడుకల సందర్భంగా సిక్కిం ప్రజల మధ్య ఉండే అదృష్టం నాకు కలిగింది. సిక్కింలో నేను పొందిన ఆదరణ నా జ్ఞాపకాలలో చిరకాలం నిలిచిపోతుంది. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి పథానికి కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తూనే ఉంటుంది’’.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s contribution to BRICS: Nari Shakti moves from promise to delivery

Media Coverage

India’s contribution to BRICS: Nari Shakti moves from promise to delivery
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 జూన్ 2026
June 30, 2026

Turning Challenges into Opportunities: PM Modi’s Vision for National Progress