సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సిక్కిం తన 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణం, ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, ప్రశంసనీయమైనదని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ 50వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ... అక్కడి ప్రజలు చూపిన ఆప్యాయత, అభిమానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘నా సిక్కిం సోదర సోదరీలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రగతిలో సిక్కిం పాత్ర ఎంతో విశిష్టమైనది. ఆ రాష్ట్ర ప్రజలు నిరంతర ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
సిక్కిం తన 50వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో ఈ శుభ సందర్భం వచ్చింది. కొన్ని రోజుల కిందటే ఈ వేడుకల సందర్భంగా సిక్కిం ప్రజల మధ్య ఉండే అదృష్టం నాకు కలిగింది. సిక్కింలో నేను పొందిన ఆదరణ నా జ్ఞాపకాలలో చిరకాలం నిలిచిపోతుంది. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి పథానికి కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తూనే ఉంటుంది’’.
Greetings to my sisters and brothers on their Statehood Day. The contribution of Sikkim to India’s development is deeply valued. Wishing the people of the state good health and prosperity.
— Narendra Modi (@narendramodi) May 16, 2026
This occasion comes at a time when Sikkim is marking 50th Statehood Day celebrations. A…


