తమిళ నాడు లోని సేలమ్ రేల్ వే జంక్శన్ లో అక్కడి ప్రజలు వందే భారత్ కు అపురూపమైనటువంటి స్వాగతాన్ని పలికినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలు ఎంతో ఆనందంతోను, ఉల్లాసం తోను సేలమ్ రేల్ వే జంక్శను లో రైలుబండి మీద పూల ను చల్లారు.
తమిళ నాడు లో పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) చేసినటువంటి ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ -
‘‘సేలమ్ లో అపూర్వ స్వాగతం!
వందే భారత్ ఎక్స్ ప్రెస్ వివిధ స్థలాల ను చేరుకొంటోంది అంటే, ప్రజల లో ఇదే తరహా ఉత్సాహం వ్యక్తం కావడమనేది సాధారణం అయిపోయింది, ఇది భారతదేశ ప్రజల లో వ్యక్తం అవుతున్నటువంటి గౌరవ భావన ను చాటి చెబుతున్నది.’’ అని పేర్కొన్నారు.
A spectacular welcome in Salem!
— Narendra Modi (@narendramodi) April 10, 2023
Such enthusiasm is common in different places the Vande Bharat Express reaches, showing the deep pride among the people of India. https://t.co/hHgj3no8vG
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించడం హాయి గా ఉంది అంటూ శ్రీమతి వానతి శ్రీనివాసన్ ఒక ట్వీట్ లో వ్యక్తం చేసిన అభిప్రాయం పట్ల కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్సందిస్తూ -
‘‘అద్భుతం!’’ అని పేర్కొన్నారు.
Wonderful! https://t.co/XRsb0S8S8x
— Narendra Modi (@narendramodi) April 10, 2023






