ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో రజత పతకం సాధించిన రింకూను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి నైపుణ్యం, అంకిత భావం దేశంతోపాటు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో రింకూ అద్భుత విన్యాసంతో రజత పతకం సొంతం చేసుకోవడంపై అభినందిస్తున్నాను. భవిష్యత్తులోనూ అతడు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
A fantastic Silver Medal by Rinku in the Javelin Throw F46 event at the Asian Para Games. Congratulations to him. Wishing him the very best for the endeavours ahead. pic.twitter.com/zSInBpPAn0
— Narendra Modi (@narendramodi) October 25, 2023


