తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్ జట్టును ప్రధానమంత్రి అభినందించారు.
ఈ చరిత్రాత్మక విజయం జట్టులోని ఆటగాళ్ల ధైర్యాన్ని, క్రమశిక్షణను, ఆట పట్ల వారి అభిరుచిని ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గర్వకారణమైన క్షణం... ఈ విజయం ఈ ప్రాంత ప్రజల్లో పెరుగుతున్న క్రీడాభిరుచిని, వారి ప్రతిభను స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘనత చాలా మంది యువ అథ్లెట్లు పెద్ద కలలు కనడానికి, మరిన్ని ఆటల్లో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు అభినందనలు! ఈ చరిత్రాత్మక విజయం జట్టులోని ఆటగాళ్ల ధైర్యాన్ని, క్రమశిక్షణను, క్రీడల పట్ల వారి అభిరుచిని ప్రతిబింబిస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గర్వకారణమైన క్షణం. అక్కడి ప్రజల్లో పెరుగుతున్న క్రీడాభిరుచిని, వారి ప్రతిభను ఇది హైలైట్ చేస్తుంది. ఈ విజయం చాలా మంది యువ అథ్లెట్లు పెద్ద కలలు కనడానికి, వారు మరిన్ని క్రీడల్లో రాణించడానికి స్ఫూర్తినిస్తుంది."
Congratulations to the Jammu and Kashmir team for their first ever Ranji Trophy win! This historic triumph reflects remarkable grit, discipline and passion of the team. It is a proud moment for the people of Jammu and Kashmir and it highlights the growing sporting passion and… pic.twitter.com/3fJO89Z5F8
— Narendra Modi (@narendramodi) February 28, 2026


