ప్రముఖ రచయిత్రి, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి శ్రీమతి గీతా మెహతా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రముఖ రచయిత్రి శ్రీమతి గీతా మెహతా మృతి నన్నెంతో బాధించింది. ఆమె బహుముఖ వ్యక్తిత్వం, మేధాసంపత్తి, రచన-సినిమా నిర్మాణంపై అభిరుచి జగద్విదితం. ఆమె ప్రకృతి పరిరక్షణ, జల సంరక్షణపైనా ఆమె ఎంతో శ్రద్ధ చూపేవారు. ఈ విషాద సమయంలో @నవీన్_ఒడిషా గారు, వారి కుటుంబానికి ఆ దైవం మనోస్థైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.. ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
I am saddened by the passing away of noted writer Smt. Gita Mehta Ji. She was a multifaceted personality, known for her intellect and passion towards writing as well as film making. She was also passionate about nature and water conservation. My thoughts are with @Naveen_Odisha…
— Narendra Modi (@narendramodi) September 16, 2023


