సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ శ్రీ రఘు రాయ్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీ రఘు రాయ్ సృజనాత్మక దిగ్గజాల్లో ఒకరని, తన లెన్స్ ద్వారా భారత సజీవత్వాన్ని అమరమైందిగా తీర్చిదిద్దారని ప్రధాని వర్ణించారు. శ్రీ రఘు రాయ్ ఛాయాచిత్ర కళ అసాధారణ సున్నితత్వం, గాఢత, వైవిధ్యంతో పరిపూర్ణమైందని, భారత జన జీవనంలో విభిన్న కోణాల్ని ఆయన ఒడిసిపట్టి ప్రజల చెంతకు చేర్చారని శ్రీ మోదీ అన్నారు. ఫోటోగ్రఫీ లోకానికి, సంస్కృతికి శ్రీ రఘు రాయ్ అందించిన తోడ్పాటు సాటి లేనిదని, ఆయన నిష్క్రమణ కళాజగతికి తీరని లోటు అని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘శ్రీ రఘు రాయ్‌ని ఒక సృజనాత్మక దిగ్గజంగా, తన లెన్స్ ద్వారా భారత సజీవత్వాన్ని ఒడిసిపట్టిన ప్రముఖునిగా స్మరించుకుంటాం. ఆయన ఛాయాచిత్ర కళలో అసాధారణ సున్నితత్వం, గాఢత, వైవిధ్యం కలబోసుకున్నాయి. ఆయన కళారూపాలు భారత జన జీవనంలో విభిన్న కోణాల్ని ప్రజలకు మరింత సన్నిహితంగా తీసుకువచ్చాయి. ఆయన మరణం ఫోటోగ్రఫీ ప్రపంచానికే కాదు, సంస్కృతికి కూడా తీరని లోటు. ఈ దుఃఖ ఘడియలో ఆయన కుటుంబానికి, అభిమానులకు, ఫోటోగ్రఫీ జగతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
Shri Raghu Rai Ji will be remembered as a creative stalwart, who captured India’s vibrancy through his lens. His photography had extraordinary sensitivity, depth and diversity. It brought people closer to the different aspects of life in India. His passing is an irreparable loss…
— Narendra Modi (@narendramodi) April 26, 2026


