ఐఎఫ్ఎఫ్ సిఒ (‘ఇఫ్ కో’) చైర్ మన్ సర్ దార్ బల్ వీందర్ సింహ్ నకయి జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘సర్ దార్ బల్ వీందర్ సింహ్ నకయి గారు వ్యవసాయ రంగం లోను, సహకార రంగం లోను ఒక ప్రముఖుని గా ఉండే వారు. రైతుల కు సాధికారిత ను కల్పించే దిశ లో మార్గదర్శక ప్రాయం అయినటువంటి తోడ్పాటుల ను ఆయన అందించారు. ఆయన మరణం దుఃఖదాయకం. ఆయన కుటుంబాని కి, ఆయన హితాభిలాషులకు ఇదే నా సంతాపం. ఆయన ఆత్మ కు శాంతి లభించు గాక’’ అని పేర్కొన్నారు.
Sardar Balvinder Singh Nakai Ji was a doyen of the agriculture and cooperatives sector. He made pioneering contributions towards empowering farmers. His passing away is saddening. Condolences to his family and well-wishers. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) October 12, 2021


